OTT Suggestion: ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestion: ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!

    OTT Suggestion: ఏప్రిల్‌లో ఓటీటీలోకి వచ్చి ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాలు ఇవే!

    April 18, 2024

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఏప్రిల్ నెల సగం గడిచి పోయింది. మరి ఈ 15 రోజుల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి.

    అమర్ సింగ్ చమ్కీలా (Amar Singh Chamkila)

    పరణితీ చోప్రా లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం అమర్ సింగ్ చమ్కీలా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. పంజాబీ ఫేమస్ స్ట్రీట్  సింగర్ అమర్ సింగ్ చమ్కీలా జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో పరిణితీ చోప్రాతో పాటు దిల్జీజ్ దోసంజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

    ప్రేమలు (Premalu)

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమలు. ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. తెలుగు వెర్షన్ ఆహాలో ఉండగా.. మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్లు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజూ , నస్లెన్ కే గఫూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    ఓం భీమ్ బుష్(Om Bheem Bush)

    అమెజాన్ ప్రైమ్‌లో టాప్‌లో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా ఏప్రిల్ 12 నుంచి ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హర్రర్ కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించారు. అయేషా ఖాన్, ప్రీతి ముఖుందన్ హీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ఫ్యామిలీతో కలిసి చూడాలనుకునేవారి ఈ చిత్రం మంచి ఎంపిక. ఇక ఈ చిత్రం కథను రఫ్‌గా చెప్పాలంటే.. క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ అనే ముగ్గురు స్నేహితులు అల్లరి చిల్లర పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.

    గామి(GAAMI)

    మాస్‌కా దాస్ విశ్వక్‍సేన్ నటించిన  ‘గామి‘ చిత్రం ఏప్రిల్ 12నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఓటీటీలో మాత్రం సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రం జీ5లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.  తెలుగుతో పాటు  తమిళం, కన్నడలోనూ అందుబాటులోకి ఉంది. విద్యాధర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈ అడ్వెంచర్ థ్రిలర్ మూవీని చూసేందుకు అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలితో కలిసి ఈవీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఈ చిత్రం కూడా టాప్ చాయిస్

    కాజల్ కార్తిక (Kajal Karthika)

    కాజల్ అగర్వాల్‌, రెజీనా కసాండ్రా నటించిన హార్రర్‌ థ్రిల్లర్‌ ‘కాజల్‌ కార్తిక‘. ఏప్రిల్‌ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో రిలీజై దాదాపు ఏడాది గడిచిన తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కార్తీక (రెజీనా).. కాలక్షేపం కోసం ఓ పాత లైబ్రరీకి వెళ్లి అక్కడ వందేళ్ల నాటి పుస్తకాన్ని చదువుతుంది. అందులోని ఐదు దయ్యాల పాత్రలు ఒక్కొక్కటిగా కళ్ల ముందుకు వస్తుంటాయి. అలా వచ్చిన కార్తిక (కాజల్‌) ఎవరు? ఆమె మరణానికి గ్రామస్తులు ఎందుకు కారణమయ్యారు? మిగిలిన నాలుగు దెయ్యాల పాత్రలు ఏంటి? అన్నది కథ.

    తంత్ర (Tantra)

    అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన హార్రర్‌ థ్రిల్లర్‌ తంత్ర.. ఏప్రిల్‌  5 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. రేఖ (అనన్య)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. బాల్య స్నేహితుడు తేజూను ఆమె ఇష్టపడటంతో ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? విగత (వంశీ), రాజేశ్వరి (సలోని) పాత్రలతో రేఖకు సంబంధం ఏంటి? అన్నది కథ.

    డ్యూన్ పార్ట్-2 (Dune: Part Two)

    హాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం‘డ్యూన్ పార్ట్-2. ఈ సైన్స్ ఫిక్షన్ జనర్‌లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం రెంటల్ విధానంలో అందుబాటులోకి ఉంది. డెనిస్ విల్లేనువే దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రంలో తిమోతీ చాల్మెట్, జెంబియా, రెబాకా ఫెర్గ్యూసన్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.

    లంబసింగి (Lambasingi)

    బిగ్‌బాస్ ఫేమ్‌ దివి.. హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘లంబసింగి’. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. మార్చి 15న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్‌ 2న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చి ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కానిస్టేబుల్‌ వీరబాబు.. నర్సు హరితను ప్రేమిస్తాడు. ఆమె.. నక్సలైట్ల లీడర్‌ కోనప్ప కూతురని వీరబాబుకు తెలుస్తుంది. ఓ రోజు కోనప్ప నేతృత్వంలోని దళం వీరబాబు పనిచేసే పోలీసుస్టేషన్‌పై దాడి చేస్తుంది. ఆ దళంలో హరిత కూడా ఉండటంతో వీరబాబు షాకవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    చారి 111

    వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్‌ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. థియేటర్లలో మిక్స్డ్‌ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍ అవుతోంది. 

    అదృశ్యం (Adhrushyam)

    ‘ఇని ఉత్తరం’ అనే మలయాళ  సినిమాకు తెలుగు డబ్ వెర్షన్ ఇది. తెలుగులో అదృశ్యం పేరుతో ఓటీటీలోకి వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం..ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి సుధీశ్ రామచంద్రన్ దర్శకత్వం వహించగా.. అపర్ణ బాలమురళి, హరీశ్ ఉత్తమన్  లీడ్ రోల్స్‌లో నటించారు.

    శర్మ అండ్ అంబానీ (Sharma And Ambani)

    శర్మ అండ్ అంబానీ మూవీ ఏప్రిల్ 11నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ కామెడీ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సాయి చిత్రీకరించగా.. భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశర్ కర్రీ  లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ చిత్రం కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version