అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో ట్రైలర్ (Pushpa 2 Trailer) రిలీజ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్‌పై ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా స్పష్టత ఇచ్చారు.
పాట్నాలో గ్రాండ్ రిలీజ్
దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఇందులో గన్ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.
బిహార్‌లోనే ఎందుకంటే?
తెలుగు స్టేట్స్‌తో పాటు నార్త్‌లో ఇన్ని రాష్టాలు ఉండాలుగా ‘పుష్ప 2’ టీమ్ ట్రైలర్ రిలీజ్‌కు బిహార్‌నే ఎంచుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్ స్టేట్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్పగాడి మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో బన్నీని ఇమిటేట్ చేస్తూ పెద్ద ఎత్తున రీల్స్ సైతం చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్ రీల్స్ చేసింది. బిహార్ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి ఆదరణ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్ సందర్భంగా ‘పుష్ప’లోని శ్రీవల్లి సాంగ్ ప్రముఖంగా వినిపించింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి ‘తూ హై గజాబ్ యూపీ.. తేరి కసం యూపీ’ అంటూ లిరిక్స్ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్, యూపీలో పుష్పగాడి క్రేజ్‌కు నిదర్శనమైన ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చని అంచనా వేస్తోంది.
‘కిస్సిక్’ శ్రీలీల అదుర్స్
స్టార్ హీరోయిన్ శ్రీలీల ‘పుష్ప 2’లో ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్‌లో బన్నీతో ఆమె ఉన్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే శ్రీలీల తమ ప్రాజెక్టులో భాగమైనట్లు ‘పుష్ప 2’ టీమ్ ఆదివారం (నవంబర్ 11) అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ‘ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల’అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.
డ్యాన్స్ అదిరిపోవాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ (Pushpa 2 Trailer) అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ ‘ధమాకా’ చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో ‘కుర్చీని మడతపెట్టి’ సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
ప్రమోషన్స్‌కు టీమిండియా!
‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ (Pushpa 2 Trailer)ను ప్లాన్ చేస్తున్నారట. అక్కడ జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అర్షదీప్ సింగ్ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం