పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాను చిత్రబృందం సెప్టెంబరు 2న విడుదల చేసింది. ట్రైలర్ తో అంచనాలను పెంచిన ఈ సినిమా.. ఎలా ఉంది? థియేటర్లో ఆడియెన్స్ ను మెప్పించిందా? డీఎస్పీ సంగీతం సినిమాకు ఎంతమేర కలిసొచ్చింది? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి..?
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన రిషి, రాధాల ప్రేమ కథే ఈ సినిమా. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కలిసి పెరిగి.. ప్రేమలో పడటం.. కానీ అది కనబరచకపోవడం.. చివరికి ఒకరినొకరు అర్థం చేసుకుని.. వారి ప్రేమను గెలిపించుకోవడం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. అయితే, వారిద్దరి ప్రేమను గెలిపించుకునే క్రమంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు? వాళ్ల కుటుంబాలను ఏ విధంగా ఒప్పించారన్నది తెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది…?
ఇలాంటి కథలు తెలుగు సినిమాల్లో చాలానే వచ్చాయి. అందరికీ తెలిసిన కథనే తెరకెక్కించడానికి దర్శకుడు సాహసం చేశారనే చెప్పాలి. కథను ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. తర్వాత ఏం జరగబోతోందోనని చెప్పేస్తాడు. తొలి అర్ధభాగం సినిమా హాయిగా సాగిపోతుంటుంది. కానీ సెకండాఫ్ పై దర్శకుడు కాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. కథనం కాస్త నెమ్మదిస్తుంది. క్లైమాక్స్ పై మరికొంత శ్రమ పెట్టాల్సింది. హీరో,హీరోయిన్ల మధ్య తెరపై కెమెస్ట్రీ బాగా కుదిరింది. రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ, తారల నటన ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. సీన్లకు అనుగుణంగా సాగే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్లు కలర్ ఫుల్ గా కనిపిస్తాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్. హీరోకు కాస్ట్యూమ్స్ నప్పాయి. ఆయా పాత్రలకు నటీనటుల ఎంపిక బాగా కుదిరింది.
ఎవరెలా చేశారు..?
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు నటీనటులే ప్రధాన బలం. హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ ఓ మెట్టు పైకెక్కాడు. రిషిగా కొన్ని సీన్లలో జనాలను మెప్పించాడు. మూడో సినిమానే అయినా.. తన నటనలో పరిణతి కనిపించింది. తనకంటూ ఉన్న కామెడీ టైమింగ్ ని చక్కగా పండించాడు. హీరోయిన్ గా కేతిక శర్మ ఆకట్టుకుంది. తన అందచందాలతో అలరించింది. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో ఈ అమ్మడు మరింత అందంగా కనిపించింది. కొన్ని సీన్లలో వైష్ణవ్ తో పోటీ పడి నటించింది. తనదైన కామెడీతో సర్పంచ్ గా సత్య కడుపుబ్బా నవ్వించాడు. హీరోయిన్ అన్నగా నవీన్ చంద్ర మెప్పించాడు. నరేష్, ప్రభు, తులసి, సుబ్బరాజు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సంగీతం విషయానికి వస్తే డీఎస్పీ తన మార్క్ చూపించాడు. సందర్భాన్ని బట్టి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీశాడు. శ్యాందత్ కెమెరా పనితనం బాగుంది.
బలాలు..
హీరో, హీరోయిన్ కెమెస్ట్రీ
నేపథ్య సంగీతం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
బలహీనతలు..
తెలిసిన కథ
కథనం
ఫైనల్ గా.. ‘రంగ రంగ వైభవంగా’ ప్రేక్షకుడికి థియేటర్లో ఓ మంచి కాలక్షేపం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!