‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతికి రాబోతున్న రామ్‌చరణ్ (Ramcharan) ఈ సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Buchi Babu Sana)తో ‘RC 16’ ప్రాజెక్టు చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మల్లయుద్దం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం రామ్‌చరణ్ మేకోవర్ అవుతున్నాడు. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని మలుచుకుంటున్నాడు. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ముందు దైవానుగ్రహం కోసం దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మూవీ స్క్రిప్ట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్ణాటక మైసూరులోని ఓ ఆలయంలో బుచ్చిబాబు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా చూస్తుంటే బుచ్చిబాబు వైఖరి ఇస్రో సైంటిస్టులను తలపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సేమ్ టూ సేమ్..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఇప్పటివరకూ ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించింది. అయితే ప్రతీ ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు దైవ దర్శనానికి వెళ్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూడమని వేడుకుంటారు. అలాగే నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలోని చెంగాలమ్మ సన్నిధిలోనూ ఇస్రో ఛైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు బుచ్చిబాబు చేస్తోంది చూస్తే ఇస్రో శాస్త్రవేత్తలే గుర్తుకు వస్తున్నారు. బచ్చిబాబు కూడా షూటింగ్ ప్రారంభానికి ముందు వరుస పెట్టి దేవలయాలు చుట్టేస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌తో కలిసి కడప వెళ్లిన బుచ్చిబాబు అక్కడ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట ‘RC16’ స్క్రిప్ట్ పెట్టి ఆశీర్వచనం కోరారు. తాజాగా మైసూర్‌లోని ఛాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఎలాంటి అవరోధాలు లేకుండా సినిమా సక్సెస్ కావాలని ప్రార్థించారు. దీంతో ఇస్రో సైంటిస్టులతో బుచ్చిబాబును పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
‘RC 16’ షూటింగ్ షురూ..
శుక్రవారం (నవంబర్ 22) ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి బుచ్చిబాబు ఆలయ ప్రాంగణంలో మూవీ స్క్రిప్ట్ పట్టుకొని దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్టుకు ఆసక్తిక వ్యాఖ్యలను సైతం జోడించారు. ఇది తమకు చాలా ముఖ్యమైన రోజని, ఎంతోకాలం ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసిందని పేర్కొన్నారు. చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది మెుదలైందంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టు బట్టి శుక్రవారం (నవంబర్ 22) నుంచే RC 16 రెగ్యులర్ షూట్ మెుదలైనట్లు తెలుస్తోంది. మైసూరులోనే ఏర్పాటు చేసిన సెట్‌లో మూడు రోజుల పాటు షూట్ జరగనున్నట్లు సమాచారం. ఇందులో హీరో లేని సీన్లను మాత్రమే షూట్ చేస్తారని తెలిసింది. వచ్చే వారం నుంచి రామ్‌చరణ్ షూటింగ్‌లో భాగమవుతారని సమాచారం.
టీమ్‌లోకి జగ్గుభాయ్..
‘RC 16’ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ప్రాజెక్ట్‌లో దిగ్గజ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. షూట్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. దీంతో జగ్గుభాయ్ ఈ మూవీలో ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ఈ పోస్టుకు థ్యాంక్యూ కామండో అంటూ జగపతిబాబు రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్‌లోనే జగపతిబాబు కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాగా, రామ్‌చరణ్ – జగ్గుభాయ్ ప్రత్యర్థులుగా చేసిన ‘రంగస్థలం’ (Rangasthalam) చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
‘RC16’ స్టోరీ ఇదే!
‘RC16’ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మలయుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడిరామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ లుక్‌తో పోలిస్తే చరణ్ బాడీతో పాటు, లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ స్వరాలు అందించనున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!