• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme C67 5G: మార్కెట్‌లోకి కళ్లు చెదిరే 5జీ ఫోన్.. ఫీచర్లకు ఫిదా కావాల్సిందే! 

    ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేస్తుంది. ఇటీవల భారత మార్కెట్లో రియల్‌మీ C67 5జీ హ్యాండ్‌సెట్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ మెుబైల్స్‌ గురువారం (డిసెంబర్‌ 20) నుంచి అందుబాటులోకి వచ్చాయి. సీ సిరీస్‌లో రియల్‌మీ తీసుకొచ్చిన తొలి 5G మెుబైల్‌ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్‌ అత్యధిక ఆఫ్‌లైన్‌ సేల్స్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    Realme C67 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.72 అంగుళాల  FHD+ IPS LCD స్క్రీన్‌తో తీసుకొచ్చారు. దీనికి 2400 X 1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, 91.40 పర్సెంట్‌ స్క్రీన్‌ బాడీ రేషియో, 680 nits బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్‌ MediaTek Dimensity 6100+ SoC ప్రొసెసర్‌, Mali G57 MC2 జీపీయూ, Android 13 ఆధారిత  Realme UI 4.0 custom skin ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై వర్క్‌ చేస్తుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ నయా మెుబైల్‌ను రియల్‌మీ రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 4GB RAM + 128GB ROM,  6GB RAM + 128GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ఈ రెండు వేరియంట్లలో స్టోరేజ్‌ను స్థిరంగా ఉంచి ర్యామ్‌ సామర్థ్యాన్ని పెంచడం గమనార్హం. అయితే microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని రియల్‌మీ కల్పించింది. 

    బిగ్‌ బ్యాటరీ

    Realme C67 మెుబైల్‌కు శక్తివంతమైన బ్యాటరీని అందించారు. 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్‌ చేశారు. 

    కెమెరా 

    ఈ నయా రియల్‌మీ ఫోన్‌ను డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు.  50MP ప్రైమరీ కెమెరా + 2 MP పొట్రెయిట్‌ సెన్సార్‌ను ఫోన్‌కు అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 8MP ఫ్రంట్‌ కెమెరాను ఫిక్స్‌ చేశారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Realme C67 5G మెుబైల్‌… 5G, 4G LTE, WiFi, Bluetooth 5.2, USB Type-C port వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. రెండు సంవత్సరాల పాటు Android OS అప్‌గ్రేడ్స్‌ను ఉచితంగా అందించనున్నట్లు రియల్‌మీ ప్రకటించింది.

    కలర్ ఆప్షన్స్‌

    ఈ మెుబైల్‌ను చైనీస్‌ కంపెనీ రెండు కలర్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చింది. సన్నీ ఓయాసిస్‌ (Sunny Oasis), డార్క్ పర్పుల్‌ (Dark Purple) వేరియంట్లలో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    Realme C67 5G మెుబైల్‌ ధరను కంపెనీ వేరియంట్ల ఆధారంగా నిర్ణయించింది. 4GB + 128GB మోడల్‌ ధర రూ.13,999గా నిర్ణయించింది. అలాగే 6GB + 128GB వేరియంట్‌ మెుబైల్‌ను రూ.14,999 ఆఫర్ చేస్తోంది. HDFC, ICICI బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకూ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇతర బ్యాంకులకు సంబంధించి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ 4GB + 128GB మోడల్‌ను రూ.12,697 అందిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv