• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

  బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్న శోభాశెట్టికి అతి తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ కానుందనే చర్చ జరుగుతోంది. శోభాశెట్టితో పాటు యావర్, అశ్వినీ, అమర్ దీప్, పావని, పూజా మూర్తి, తేజ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. యావర్‌కు టాప్ ఓటింగ్ వస్తుండగా.. అమర్ దీప్, తేజ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పూజా మూర్తి, శోభాశెట్టికి తక్కువ ఓటింగ్ వస్తోంది. దీంతో అతి తక్కువ ఓటింగ్ వస్తున్న శోభాశెట్టిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించనున్నట్లు తెలుస్తోంది.

  ఎన్టీఆర్‌పై నాగ్ కామెంట్స్.. వైరల్

  ఏఎన్ఆర్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నాగచైతన్య బాహాటంగానే ఖండించారు. అయితే, బాలకృష్ణతో నాగార్జునను పోల్చుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బంగార్రాజు ఈవెంట్‌ సమయంలో నాగార్జున సీనియర్ ఎన్టీఆర్‌ని కొనియాడారు. ‘ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకుంటుంటే.. బాలకృష్ణ మాత్రం ఏఎన్ఆర్‌ని కించపరిచేలా మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. Difference between #MentalBalaKrishna and King @iamnagarjuna Nag … Read more

  అవికా గోర్ ‘పాప్‌కార్న్’ ట్రైలర్ విడుదల

  చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటిస్తున్న సినిమా ‘పాప్‌కార్న్’. ఈ చిత్ర ట్రైలర్‌ని నాగార్జున విడుదల చేశారు. సాయిరోనక్ హీరోగా నటించాడు. తొలిసారిగా అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ గంధం విభిన్నంగా తెరకెక్కించారు. ఓ లిఫ్టులో భిన్న వ్యక్తిత్వాలున్న ఒక అమ్మాయి, అబ్బాయి చిక్కుకుంటే ఎలా ఉంటుంది? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాన్ని ట్రైలర్‌ ద్వారా చూపించారు. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా ఈ చిత్రం నిర్మాణమవుతోంది.

  పవన్, కార్తి.. ఇద్దరూ ఒక్కటే: నాగ్

  హీరో పవన్ కళ్యాణ్, కార్తి.. ఇద్దరూ ఒక్కటే అని నాగార్జున అన్నాడు. సర్దార్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగ్.. తన మనసుల మాట చెప్పాడు. ‘ఒక స్టార్‌కి తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. అలా పవన్ కళ్యాణ్, పునీత్ రాజ్‌కుమార్, కార్తి తమ ప్రదర్శనతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. వీరు అరుదైన నటులు. బోల్డ్ కథల ఎంపికతో కార్తి సూపర్ స్టార్ అయ్యాడు. తెలుగులో మాట్లాడగలడు. అందుకే తెలుగు అభిమానులు అంతగా అభిమానిస్తారు’ అని నాగ్ … Read more

  ఒకే ఒక జీవితం చూసి నాగార్జున కంట‌త‌డి

  శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ‘ఒకే ఒక జీవితం’ మూవీ సెప్టెంబ‌ర్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం స్పెష‌ల్ స్కీనింగ్ చూసింది. వారితో పాటు నాగార్జున‌, అమ‌ల‌, శ‌ర్వానంద్ కుటుంబ‌స‌భ్యులు అంద‌రూ క‌లిసి సినిమాను చూశారు. నాగార్జున మాట్లాడుతూ నాకు మా అమ్మ గుర్తొచ్చిందంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. అంద‌రూ కంట‌త‌డితో బ‌య‌ట‌కు రావ‌డం చూడ‌వ‌చ్చు. అమ్మ మీద ప్రేమ ఉన్న ప్ర‌తి ఒక్క‌రికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంద‌ని చెప్తున్నారు.

  Biggboss 6: కంటెస్టెంట్స్‌తో ఫ‌న్ మామూలుగా లేదుగా!

  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 నేడు ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. నాగార్జున ఎప్ప‌టిలాగే త‌న ఎన‌ర్జీతో అల‌రిస్తున్నాడు. కొంత‌మంది కంటెస్టెంట్స్ వాయిస్‌ను వినిపించారు, కానీ మోహాలు చూపించ‌కుండా ప్రోమోను రిలీజ్ చేస్తారు. అందులో సింగ‌ర్ రేవంత్, చ‌లాకీ చంటీల గురించి క్లియ‌ర్‌గా తెలుస్తుంది. ఇక మిగ‌తా కంటెస్టెంట్స్ ఎవ‌రో ఈరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలుసుకోవ‌చ్చు. ఈ సారి హౌజ్‌లో అమ్మాయిల డామినేష‌న్ ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం.

  బిగ్‌బాస్ సీజన్ -6 ఫస్ట్ గ్లింప్స్ విడుదల

  సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ సీజన్ -6 ప్రారంభం కానుంది. ఈమేరకు బిగ్‌బాస్ నిర్వాహకులు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీడియో చూస్తుంటే ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్‌ల ఎంపిక పూర్తి చేసిన బిగ్‌బాస్ యాజమాన్యం షోను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు బిగ్‌బాస్ 3,4,5కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున సీజన్‌ 6కి కూడా ఆయనే వ్యాఖ్యాతగా కొనసాగనున్నారు.

  10M వ్యూస్‌తో దూసుకెళ్తున్న ‘ది ఘోస్ట్’ ట్రైలర్

  అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ది ఘోస్ట్’. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్లిపోతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ 10 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌తో పాటు 3 లక్షల పైగా లైక్స్‌తో ట్రెండ్ అవుతుంది. అక్టోబర్ 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీపై అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు తెలుగు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

  సెప్టెంబ‌ర్ 4 నుంచే బిగ్‌బాస్ 6 ప్రారంభం

  తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 6 సెప్టెంబ‌ర్ 4 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను నేడు విడుద‌ల చేశారు. కంటెస్టెంట్స్‌ను ఆగ‌స్ట్ చివరి వారం నుంచి క్వారెంటైన్‌లో ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈసారి ఇద్ద‌రు కామ‌న్ పీపుల్ షోలో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ఇందులో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ గురించి వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అమ‌ర్‌దీప్‌, చ‌లాకీ చంటి, గీతూ రాయ‌ల్, ఆది రెడ్డి, శ్రీహాన్ , నేహా చౌద‌రి, దీపికా పిల్లి, ఉద‌య‌భాను, యాంక‌ర్ ప్ర‌త్యూష‌ త‌దిత‌రుల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తుంది.

  త‌న ఫ‌స్ట్‌ల‌వ్‌ను గుర్తుచేసుకున్న మెగాస్టార్

  బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిరంజీవి, అమీర్‌ఖాన్, నాగ‌చైత‌న్య‌ల‌ను కింగ్ నాగార్జున ఇంట‌ర్వ్యూ చేశాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ప‌దేళ్ల‌కే ప్రేమ‌లో ప‌డ‌తాడు. మీ ఫ‌స్ట్ ల‌వ్ ఎప్పుడు అని నాగ్ చిరంజీవిని అడిగాడు. ఏడ‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ప్పుడు నాకు సైకిల్ అంత‌గా రాదు. ఒక అమ్మాయి నాకు సైకిల్ నేర్పించేది. ఆమె నేర్పిస్తుంటే సైకిల్ చూడ‌కుండా నేను ఆ అమ్మాయినే చూసేవాడిని అంటూ త‌న ఫ‌స్ట్‌ల‌వ్ గురించి … Read more