ఏఎన్ఆర్‌పై బాలకృష్ణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నాగచైతన్య బాహాటంగానే ఖండించారు. అయితే, బాలకృష్ణతో నాగార్జునను పోల్చుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బంగార్రాజు ఈవెంట్ సమయంలో నాగార్జున సీనియర్ ఎన్టీఆర్‌ని కొనియాడారు. ‘ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లివ్స్ ఆన్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటుంటే.. బాలకృష్ణ మాత్రం ఏఎన్ఆర్‌ని కించపరిచేలా మాట్లాడటం కరెక్టు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.