• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీహెచ్‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్

    టీకాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. అంబర్‌పేట టికెట్‌ తనకు రాకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు. అసలు రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేయించింది ఉత్తమే నంటూ వ్యాఖ్యానించారు. తనను, జగ్గారెడ్డి లాంటి సీనియర్లను బయటకు పంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈక్రమంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లొద్దని అధిష్టానం ఆదేశించింది. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది.

    రాహుల్ లీడర్‌ కాదు రీడర్: కేటీఆర్

    ఓటుకు నోటు కేసు గజదొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను పట్టుకుని కుటుంబ పాలన అంటున్నారు… రాహుల్ ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ లీడర్‌ కాదు.. రీడర్. కాంగ్రెస్‌ నేతలు ఏది చదివిస్తే అదే చదువుతారు. నేర్చుకునే ప్రయత్నం చేయరు. నోటికి ఎదొస్తే అది వాగి వెళ్లడం సరికాదంటూ విమర్శించారు.

    మీడియాకు రేవంత్ రెడ్డి వార్నింగ్

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. ఇష్టారీతిన తప్పుడు వార్తలు రాస్తే ఉపేక్షించమని స్పష్టం చేశారు. రాజకీయ నిరసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు రాస్తున్నట్లు విమర్శించారు. ఈ వార్తల వల్ల కిందిస్థాయి కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని చెప్పుకొచ్చారు.

    కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్

    కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు YSRTP పార్టీని కాంగ్రెస్‌లో షర్మిల విలీనం చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె పాలేరు నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పాలేరు సీటు కోసం ఆమె పట్టుబట్టినప్పటికీ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. జాతీయ కార్యదర్శి పదవితో పాటు ఖమ్మం ఎంపీ స్థానానని ఆఫర్ చేసింది. దీంతో డీల్ సెట్ కాకపోవడంతో పాలేరు నుండి పోటీకి షర్మిల రెడీ అయింది. ముందు నుంచి షర్మిల రాకను పీసీసీ … Read more

    నేడు 70% కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు!

    తెలంగాణలో నేడు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటిలో 60-70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అభ్యర్థులను ఖరారు చేస్తే వారంతా ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందని కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌తో చెప్పినట్లు పేర్కొన్నారు. భారాస మాదిరి ముందస్తుగా టికెట్లు ఖరారు చేయడం కాంగ్రెస్‌ లాంటి జాతీయపార్టీలో సాధ్యం కాదన్నారు.

    బీఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ కీలక నేత

    బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్ చేరనున్నారు. సాయంత్రం కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే కేటీఆర్‌తో ఫొన్‌లో మాట్లాడిన శ్రీధర్.. మైనంపల్లిని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

    కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా

    మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. మెదక్ టికెట్ ఆశించిన తిరుపతి రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు.. మైనంపల్లి రోహిత్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారంతో మనస్తాపం చెందారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తున్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వటం పట్ల అలకబూనారు. అధిష్ఠానంతో చర్చించాక కూడా హామీ దక్కకపోవడంతో తిరుపతి రెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యచరణను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు.

    కార్యకర్తలతో చిందులేసిన రేవంత్ రెడ్డి

    హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్.. గిరిజన కార్యకర్తలతో కలిసి కాసేపు చిందులేశారు. మహిళా కార్యకర్తలతో కాలు కదిపి కోలాహలం చేశారు. దీంతో పాదయాత్ర చేస్తున్న నాయకుల్లో ఉత్తేజం కలిగింది. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపేట, మరిపెడ, కుడియా, ఇస్లా తండాల్లో పర్యటించారు. Revanth Reddy Dance along with Banjara … Read more

    2022 తెలంగాణ ఓవరాల్ రౌండప్

    ఒమిక్రాన్ కలవరం కారణంగా మూతబడిన పాఠశాలలు. రెండేళ్లకోసారి దర్శనమిచ్చే సమ్మక్క, సారలమ్మ ఆశీర్వచనాలు. 216 అడుగుల రామానుజాచార్యుడి విగ్రహ ప్రారంభోత్సవం. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఘట్టం మల్లన్న సాగర్ ఆవిష్కరణ. 12 ఏళ్లకోసారి వచ్చే ప్రాణహిత పుష్కరాల సందడి ఇది తెలంగాణలో ఈ ఏడాది మెుదటి అర్థభాగం. అంకురాలకు నిలయంగా మారిన టీ హబ్ 2.0, బాక్సింగ్ ఛాంపియన్‌గా నిఖత్ జరీన్, ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నిపథ్ సికింద్రాబాద్‌ అల్లర్లు, క్యాసినో, మద్యం కుంభకోణం, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాలు వంటి పంచాయితీలు…ఒక్కసారిగా మునుగోడు గెలుపుతో జాతీయ … Read more