• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తమిళనాడులో ప్రమాదం.. వీడియో వైరల్

    తమిళనాడు తూత్తుకూడిలో చోటు చేసుకున్న ఓ ప్రమాదం నెట్టింట వైరల్ అవుతోంది. లారీ ఎదురుగా వస్తుండగా మెడకు తాడు తట్టుకుని బైకర్ అమాంతంగా వెనక్కి ఎగిరి పడ్డాడు. అదృష్ట వశాత్తు ఈ ఘటనలో బైకర్ ముత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే, లోడు కిందకి జారుతున్నా పట్టించుకోకుండా డ్రైవర్ దూసుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీకి కట్టిన తాడు ఊడిపోవడంతో ముత్తు మెడకు చుట్టుకుంది. రెప్పపాటులో సంభవించిన ఈ ప్రమాదాన్ని చూసి నెటిజన్లు జంకుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని … Read more

    అతివేగం ఎంత పనిచేసిందో చూడండి!

    తమిళనాడులోని చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అతివేగంగా ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. తారామణి-వేలచేరి లింక్‌ రోడ్డుపై యువకులు వేగంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాలీ రోడ్డు దాటేందుకు మలుపు తిప్పడంతో అదుపుతప్పి గుద్దుకున్నారు. దీంతో అక్కడిక్కడే చనిపోయారు. ప్రమాద సమయంలో బైక్‌ గంటకు 114 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందుకు సంబంధించి యువకులు తీసిన [వీడియో ](url) వైరల్ అయ్యింది. Warning : Speed thrills, but kills. 2 youths on a bike riding … Read more

    పుణేలో లారీ బీభత్సం ,30 మందికి గాయాలు

    మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ[ బీభత్సం](url) సృష్టించింది. బెంగళూరు హైవేలోని నావెల్ వంతెనపై ముందున్న వాహనాలను వేగంగా ఢీకొట్టింది. సుమారు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు…ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగ నిర్ధారించారు. అందులోని చమురు రోడ్డుపై పడటం వల్ల వాహనాలు జారి ప్రమాదానికి గురయ్యాయి. Horrible Accident at Navale Bridge Pune …. minimum of 20-30 vehicles involved pic.twitter.com/FbReZjzFNJ … Read more

    భీభత్సం సృష్టించిన టెస్లా కారు

    చైనాలో టెస్లా కారు భీభత్సం సృష్టించింది. సౌత్ ఫ్రావిన్సీ గ్వాంగ్‌డ్వాంగ్‌లో టెస్లా కారుకు బ్రేకులు పని చేయకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. [వీడియో](url) ప్రకారం కారు నియంత్రణ కోల్పోవడంతో అదుపులోకి రాలేదు. దీంతో కారు చాలా దూరం ప్రయాణించి స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This video of a Tesla trying to … Read more

    గుజరాత్‌లో కూలిన కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీగల వంతెన నదిలో కూలడంతో సుమారు 100మందికి పైగా నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగే సమయంలో వంతెనపై 500మంది ఉన్నట్లు సమాచారం. కాగా, సామర్థ్యానికి మించి సందర్శకుడు వంతెనపైకి చేరుకోవడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. చిన్నారులు, మహిళలు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎంకు ఆదేశించారు. गुजरात के मोरबी में केबल पुल टूट गया। करीब 400 लोग नदी … Read more

    క్షేమంగానే రైనో; సీఎం

    హల్దీబారీలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన రైనో ఆరోగ్యంగానే ఉన్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా డ్రోన్ ద్వారా తీసిన[ వీడియో](url)ను సీఎం పంచుకున్నారు. ఈ మేరకు జంతువులు రోడ్లు దాటేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలని వాహనదారులను కోరారు. కాగా ఇటీవల హల్దీబారీ రహదారి వద్ద వేగంగా వెళ్తున్న ట్రక్కును రైనో ఢీకొట్టింది. ఆ తర్వాత అది పడుతూ లేస్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. అప్పటినుంచి దాని ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇదే విషయమై సీఎం స్పందించి వీడియో … Read more

    చిన్న తప్పుతో ఘోర ప్రమాదం

    కొందరు నిర్లక్ష్యపూరితంగా చేసే చిన్న తప్పులు మరొకరి ప్రాణాల మీదికి తెస్తాయి. అటువంటి సంఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ మహిళ తన స్కూటర్‌పై వెళ్తుండగా.. ముందు నిలిపి ఉంచిన కారు డోరు అకస్మాత్తుగా తెరవటంతో దానిని ఢీకొట్టి ఆ మహిళ రోడ్డుపై పడిపోయింది. ఆ వెనకాలే వస్తున్న కారు ఆమెపై ఎక్కింది. దీంతో ఆ మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది.ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు. వీడియో కోసం [వాచ్ ఆన్ ](url)బటన్‌పై నొక్కండి Before opening the door … Read more

    VIRAL: యువకులపై దూసుకెళ్లిన కారు

    యూపీలోని ఘజియాబాద్‌లో ఓ కాలేజీకి చెందిన రెండు గ్రూపుల మధ్య ఘర్షణ కారణంగా యువకులు రోడ్డుపై తలపడుతున్నారు. అంతలోనే ఓ కారు ఓ వేగంగా ఆ విద్యార్థులపై నుంచిదూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ఆ యువకులకు గాయాలైనా గొడవ ఆపలేదు. పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకొని గొడవను సద్దుమణిగించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన [వీడియో](url) వైరల్ అవుతుంది. Fight among college students in Ghaziabad. Two students hit by Honda City car.#Ghaziabad #ViralVideo Video @Twitter … Read more

    పోలీసన్నా.. నీకు సలాం..!

    సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలకు తెగించి నలుగురిని కాపాడారు హైదరాబాద్ సిటీ పోలీసులు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే ఈ సాహసం చేసిన ఆంజనేయులు, రాకేశ్‌లను నగర సీపీ సీవీ ఆనంద్ అభినందించారు. వారి ధైర్య సాహసాలను కొనియాడారు. తన సర్వీసులో వీరి సేవలు గుర్తిండిపోతాయని కితాబిచ్చారు. ప్రజల భద్రత కోసం తామెప్పుడూ ముందుంటామని చాటిచెప్పారు. ఓ వీడియోను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. నిజంగా ఈ పోలీసు అన్నలు గ్రేట్ కదూ..! Risking their lives , officers of City police … Read more

    ఘోర ప్రమాదం.. 11మంది మృతి

    జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సజియాన్ నుంచి మండీకి వెళ్లే దారిలో మినీబస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 25మంది గాయాలబారిన పడ్డారు. వీరిని మండీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో పాఠశాల విద్యార్థులున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. 11 die, 25 injured in minibus accident in J-K's Poonch Read @ANI Story | https://t.co/e0eqyEfsWT#accident #Poonch #JammuAndKashmir #raodaccident #busaccident … Read more