తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. శ్రీకాంత్ ఓదెల (srikanth odela)
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్ దగ్గర శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2. వేణు ఎల్దండి(Venu Yeldandi)
బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
3. బుచ్చిబాబు సాన(buchi babu sana)
డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్ హిట్ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం.
4. సందీప్ వంగా(sandeep reddy vanga)
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.
5. అనిల్ రావిపూడి(anil ravipudi)
డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.
6. సుజీత్ (sujeeth)
డైరెక్టర్ సుజీత్ కూడా రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సుజీత్ ఓ సినిమా చేస్తున్నాడు.
7. తరుణ్ భాస్కర్(Tharun Bhascker)
పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్ భాస్కర్ సైమా అవార్డ్స్-2016 సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్ సేన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
8. స్వరూప్ RSJ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్ RSJ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
9. అజయ్ భూపతి(Ajay Bhupathi)
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
10. కరుణ కుమార్(karuna kumar)
డైరెక్టర్ కరుణ కుమార్ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం