This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!

    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!

    May 27, 2024

    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో యంగ్‌ హీరోలు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

    థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు

    గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి

    విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

    భజే వాయు వేగం

    యంగ్‌ హీరో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుని తిరిగి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానున్నట్లు చెప్పింది. 

    గం.. గం.. గణేశా

    విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. రిష్మా, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మే 31న విడుదల కానుంది. 

    మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి

    బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన లేటెస్ట్ రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా  ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ (Mr. & Mrs. Mahi). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ క్రికెటర్‌గా కనిపించనుంది.

    హిట్ లిస్ట్

    తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వ వహించారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతోంది. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు

    ఆ ఒక్కటి అడక్కు

    కామెడీ స్టార్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు‘ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ఈ సినిమాను మే 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

    TitleCategoryLanguagePlatformRelease Date
    ErikSeriesEnglishNetflixMay 30
    Geek GirlSeriesEnglishNetflixMay 30
    Panchayat S3SeriesHindiAmazon primeMay 28
    Aa Okkati AdakkuMovieTeluguAmazon primeMay 31
    Swatantra Veer SavarkarMovieHindiZee 5May 28
    ComdenSeriesEnglishDisney + HotstarMay 28
    The First AmenMovieEnglishDisney + HotstarMay 30
    Uppu Puli KaramMovieTamilDisney + HotstarMay 30
    Illegal S3SeriesHindiJio CinemaMay 29
    Dedh Bigha ZameenMovieHindiJio CinemaMay 31
    The Last Refill ManMovieEnglishJio CinemaMay 31
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version