హీరోల కుమారులు, కుమార్తెలు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం సర్వ సాధారణం. తెలుగు ఇండస్ట్రీలో చాలామంది అలా వచ్చిన వారే. వారసులుగా వచ్చినప్పటికీ వారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తర్వాత జనరేషన్ కూడా సిద్ధంగా ఉంది. టాప్ హీరోల పిల్లలు చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. భవిష్యత్ కోసం ఇప్పుడే బాటలు వేసుకుంటున్నారు వాళ్లేవరో ఓసారి లుక్కేద్దాం.
గౌతమ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ అచ్చుగుద్దినట్లుగా కృష్ణలా ఉంటాడు. మహేశ్ తర్వాత సినిమాల్లోకి కచ్చితంగా అడుగుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ సినిమాలో ఇప్పటికే నటించాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేశ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేశాడు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
మహాధన్
చిత్ర పరిశ్రమలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎదిగిన రవితేజ కుమారుడే మహాధన్. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్రలో కనిపించింది కొద్ది నిమిషాలే అయినా ఇరగ్గొట్టాడు. మహాధన్‌కి నటన మీద ఆసక్తి ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో రవితేజ కన్ఫర్మ్ చేశాడు. “ సినీ పరిశ్రమలో ఉన్నాం కనుక కచ్చితంగా ఆసక్తి ఉంటుంది. లేదని చెప్పలేను. కానీ, ఎప్పుడూ వస్తాడనేది వాడి ఇష్టం” అన్నారు. దీనిబట్టి మహాధన్ హీరోగా వస్తాడనటంలో ఎలాంటి సదేహం లేదు.
అకీరా నందన్
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు జన్మించిన కుమారుడు అకీరా నందన్. అకీరా సినిమాల్లోకి రావాలని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. నటనవైపు కాకుండా ఇండస్ట్రీలోనే మరోరంగంపై దృష్టిసారించాడు అకీరా. ఇటీవల రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిల్మ్‌కు సంగీతం అందించాడు. ఈ విషయాన్ని అడివి శేష్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
సితార
మహేశ్ కుమార్తె సితార కూడా ఎంట్రీ ఇచ్చేసింది. సర్కారు వారి పాట చిత్రంలో ఓ సాంగ్‌లో తళుక్కున మెరిసింది సితార పాప. సినిమారంగంపై మక్కువని చెప్పకనే చెప్పింది. భవిష్యత్‌లో సితార నుంచి కూడా ఓ సినిమా ఉంటుందని ఆశించవచ్చు.
అల్లు అర్హ
అల్లు అర్జున్ కుమార్తె అర్హ బాలనటి అవాతరమెత్తింది. సామాజిక మాధ్యమాల్లో తండ్రితో కలిసి సందడి చేసే ఈ చిచ్చర పిడుగు.. గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం సినిమాలో ఓ క్యారెక్టర్‌లో మెరిసింది. ప్రిన్స్ భరత పాత్రలో నటించింది అర్హ. ఇందులో ముద్దుగా చెప్పిన డైలాగులకు మంచి మార్కులు పడ్డాయి. భవిష్యత్‌లో సినీరంగంలో రాణిస్తుందనడానికి ఈ ఒక్క సినిమా చాలు.
అరియానా, వివియానా
మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా కూడా తమ ప్రతిభను చాటారు. విష్ణు నటించిన జిన్నా సినిమాలో పాటను ఆలపించారు ఇద్దరు. దీనిపై మంచు కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
అయాన్, అభిరామ్
అల్లు అర్జున్ కుమారుడు అయాన్, జూనియర్ ఎన్టీఆర్ తనయుడు అభిరామ్ ఇప్పటివరకైతే ఆరంగేట్రం చేయలేదు. కానీ, రెండు కుటుంబాల నుంచి వారసులుగా ఉన్న కారణంగా భవిష్యత్‌లో కచ్చితంగా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!