ఒక సినిమా సక్సెస్‌లో కథ, హీరో స్టార్‌డమ్, పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా గణనీయమైన పాత్రను పోషిస్తుంది. ఒక సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా తీసినప్పటికీ దానిని సరిగ్గా ఎలివేట్ చేసే BGM లేకపోతే ఫలితం ఉండదు. అందుకే దర్శకులు పాటలతో పాటు(Top Telugu BGM Movies) నేపథ్య సంగీతానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను ఫైనలైజ్ చేస్తుంటారు. ఇప్పటివరకూ తెలుగులో వందలాది చిత్రాలు వచ్చినప్పటికీ BGM అనగానే ఠక్కున కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అటువంటి టాప్ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
సలార్ (Salaar)
ప్రభాస్ (Prabhas) హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’. ఈ సినిమా విజయంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. రవి బస్రూర్ (Ravi Basrur) అందించిన BGM.. యాక్షన్ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది.
పుష్ప (Pushpa)
సుకుమర్ – అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa BGM) లోనూ నేపథ్య సంగీతం హైలేట్‌గా అనిపిస్తుంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సన్నివేశానికి తగ్గట్లు అద్భుతమైన బీజీఎంలను అందించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే BGM సినిమాకే హైలెట్ అనిచెప్పవచ్చు.
ఆర్‌ఆర్‌ఆర్ (RRR)
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్‌చరణ్ హీరోలుగా చేసిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విజయాన్ని అందుకుంది. కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు వెన్నెముకగా నిలిచాయి. ముఖ్యంగా తారక్, రామ్‌చరణ్ పాత్రలను హైలెట్ చేస్తూ ఇచ్చిన BGM గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.
రంగస్థలం (Rangasthalam)
రామ్‌చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో రంగస్థలం ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు పాటలతో పాటు బీజీఎం((Rangasthalam) ప్రధాన బలంగా నిలిచింది.
అర్జున్ రెడ్డి (Arjun Reddy)
విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అర్జున్ రెడ్డి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో విజయ్ చాలా అగ్రెసివ్‌గా కనిపించాడు. అతడి యాక్షన్‌కు తగ్గ బీజీఎం తోడవడంతో సినిమాలోని సీన్లు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి.
బాహుబలి (Baahubali)
తెలుగులో అద్భుతమైన నేపథ్య సంగీతంతో వచ్చి చిత్రాల్లో ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ ఒకటి. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతీ సన్నివేశానికి జీవం పోసిందని చెప్పవచ్చు.
ఇంద్ర (Indra)
మెగాస్టార్ చిరంజీవి చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘ఇంద్ర’ ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డుల మోత మోగించింది. మణిశర్మ ఇచ్చిన బీజీఎం సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. ‘మెుక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’.. అంటూ చిరు చెప్పే డైలాగ్‌కు మణిశర్మ ఇచ్చిన BGM విజిల్ వేసేలా ఉంటుంది. అటు చిరు – ప్రకాష్ ఎదురుపడ్డ సందర్భంలోనూ వచ్చే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
మిర్చి (Mirchi)
ప్రభాస్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘మిర్చి’ సినిమా కూడా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వీక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా రెయిన్‌లో ఫైట్ సందర్భంగా వచ్చే BGM అదరహో అనిపిస్తుంది.
విక్రమార్కుడు (Vikramarkudu)
రాజమౌళి – రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమార్కుడు‘ కూడా అద్భుతమైన బీజీఎం గలిగిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులో ప్రకాష్ రాజ్ రవితేజ ప్రొఫైల్‌ను చూస్తున్న క్రమంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. నీకు భయం లేదా అన్న ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతుండగా వచ్చే BGM ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.
ఛత్రపతి (Chatrapathi)
రాజమౌళి – ప్రభాస్ కాంబోలో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రభాస్ శత్రువులకు వార్నింగ్ వచ్చే సమయంలో నేపథ్య సంగీతం ఆకట్టుకుటుంది.
స్టాలిన్ (Stalin)
చిరు హీరోగా తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా BGM అప్పట్లో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. విలన్ ప్రదీప్ రావత్‌కు చిరు వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే నేపథ్య సంగీతం మెప్పిస్తుంది.
తులసి (Tulasi)
వెంకటేష్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బాస్టర్ చిత్రం ‘తులసి’. సినిమా టైటిల్‌తో వచ్చే BGM ఆడియన్స్‌ను కూర్చిలో కూర్చోనివ్వకుండా చేస్తుంది. అలాగే హీరోయిన్ నయనతారతో వచ్చే భావోద్వేగ సన్నివేశాల్లోని BGM కూడా హృదయాలకు హత్తుకుంటుంది.
సింహాద్రి (Simhadri)
తారక్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ‘సింహాద్రి’ ఒకటి. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి రూపొందించారు. తన అక్కను చంపిన విలన్లను తారక్ వేటాడే క్రమంలో వచ్చే BGM మెస్మరైజ్ చేస్తుంది.
రక్షకుడు (Rakshakudu)
నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా సాంగ్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటు నేపథ్య సంగీతం కూడా అప్పటి చిత్రాలకు భిన్నంగా రెహమాన్ అందించాడు.
ఓజీ (OG)
పవన్ కల్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘హంగ్రీ చీతా’ పేరుతో విడుదలైన ఈ చిత్ర సాంగ్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లోని బీజీఎంను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తమ మెుబైల్స్‌కు రింగ్‌టోన్, కాలర్ ట్యూన్స్‌గా పెట్టుకుంటున్నారు.
యానిమల్ (Animal)
ఈ మధ్య కాలంలో నేపథ్య సంగీతంతో బాగా పాపులర్ అయిన చిత్రం యానిమల్. రణ్‌బీర్ మాస్ యాక్షన్‌ను హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బీజీఎం అద్భుతంగా ఎలివేట్ చేసింది. తన తండ్రిని చంపాలని అక్క భర్త స్కెచ్ వేస్తున్నట్లు రణ్‌బీర్ తెలుసుకున్న సమయంలో వచ్చే BGM సినిమాకే హైలేట్.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్