• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్‌ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?

    నటినటులు: అల్లరి నరేష్‌, మిర్నా మీనన్‌, ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా, నాగ మహేష్‌, రమేష్‌ రెడ్డి

    దర్శకత్వం: విజయ్‌ కనకమేడల

    నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్‌

    సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ జాదవ్‌

    సంగీతం: సాయిచరణ్‌ పాకాల

    ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్‌ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్‌ చందనా సిస్టర్స్‌ వంటి సినిమాలతో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్స్‌ ఇచ్చాడు. తద్వారా మినిమమ్‌ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్‌ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్‌ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్‌ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్‌ హిట్‌ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

    కథేంటి:

    నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్‌(అల్లరి నరేష్‌) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది. అసలు ఈ శివకుమార్‌ ఎవరు?. హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్‌ ఎలా చెక్‌ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే..

    ఎవరెలా చేశారంటే:

    సీరియస్‌ పోలీసు ఆఫీసర్‌ రోల్‌లో అల్లరి నరేష్‌ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్‌ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్‌ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్‌ మిర్నా మీనన్‌ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్‌ లోహితష్వా,  కౌషిక్‌ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.

     

    సాంకేతికంగా:

    దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్‌ సీన్‌ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో డైరెక్టర్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు.

    ప్లస్‌ పాయింట్స్‌

    • నరేష్‌ నటన
    • నేపథ్య సంగీతం
    • యాక్షన్‌ సీన్స్‌

    మైనస్‌ పాయింట్స్‌

    • రొటీన్‌ సీన్స్‌
    • సాగదీత
    • పాటలు

    రేటింగ్‌: 2.75/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv