మొబైల్ ఇండస్ట్రీలో సామ్సంగ్ గట్టి పోటీని ఇస్తోంది. అత్యాధునిక ఫీచర్లతో సరసమైన ధరలకే స్మార్ట్ఫోన్లను యూజర్లకు అందిస్తోంది. ఏటా బెస్ట్ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్న సామ్సంగ్ ఈ ఏడాది కూడా మరికొన్ని ఫోన్లను లాంఛ్ చేయనుంది. ఎడ్జ్ కట్టింగ్ పీచర్లు, ఆకట్టుకునే డిజైన్లతో కలగలిసిన స్మార్ట్ఫోన్లు సామ్సంగ్ ఫ్యాక్టరీలో రూపు దిద్దుకుంటున్నాయి. మరి, 2023లో లాంఛ్ కానున్న ఉత్తమ స్మార్ట్ఫోన్లు ఏంటో చూసేద్దామా.
Samsung Galaxy S24 Ultra
సామ్సంగ్ గెలాక్సీ నుంచి వచ్చే S సిరీస్‌లో వచ్చే ఫోన్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ఏడాది వచ్చే సామ్సంగ్ ఫోన్లలో బెస్ట్‌గా నిలవనుంది. ఇందులో నుంచే ఎస్24 అల్ట్రా పేరుతో మరో ఫోన్ అందుబాటులోకి రానుంది. 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటుతో 6.83 అంగుళాల సూపర్ AMOLED+ డిస్ప్లే దీని సొంతం. ఇక, పవర్ ఫుల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జన్ 2 లేదా 3 చిప్సెట్తో రానుంది. డివైజ్ మెమొరీ 12GB RAMతో రానున్నట్లు సమాచారం. ఇందులో 5,100mAh కెపాసిటీతో బ్యాటరీ ఉండనుంది. 45వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. 200 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. 60 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చే సూచనలు ఉన్నాయి.
Samsung Galaxy A82 5G
సరసమైన ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోందీ స్మార్ట్‌ఫోన్. 6GB RAMతో సామ్సంగ్ గెలాక్సీ A82 5G రానుంది. ఇందులో పవర్ ఫుల్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉండనుంది. ఇక, 120Hz రిఫ్రెష్ రేటుతో 6.71 అంగుళాల సూపర్ AMOLED+ డిస్ప్లే దీని సొంతం. ఈ భారీ స్క్రీన్‌పై విజువల్స్ చూస్తే లీనమవ్వాల్సిందే. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. 64మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పాటు 12మెగా పిక్సెల్, 5మెగా పిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక, 10మెగా పిక్సెల్ క్లారిటీతో సెల్ఫీ కెమెరా రానుంది. 4,500mAh కెపాసిటీ గల బ్యాటరీతో ఇది రానుంది. 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. అయితే, దీని ధరపై ఇంకా క్లారిటీ రాలేదు.
Samsung Galaxy S23 FE
సామ్సంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఇ స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జన్ 1 ఎస్వోసీ వంటి పవర్ఫుల్ చిప్సెట్ లేదా ఎక్సినోస్ 2200 చిప్సెట్తో వచ్చే సూచనలు ఉన్నాయి. 4500mAh కెపాసిటీతో బ్యాటరీ ఉండనుంది. 25వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ప్రైమరీ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. 120Hz రిఫ్రెష్ రేటుతో AMOLED స్క్రీన్ రానుంది.
Samsung Galaxy A74 5G
సామ్సంగ్ గెలాక్సీ A74 5G మొబైల్ పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రానుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జన్ 1 చిప్సెట్తో వస్తోంది. 8GB వరకు RAM సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల Full HD+ డిస్ప్లే దీనికి ఉండనుంది. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ రానుంది. ఇక, 500mAh బ్యాటరీ కెపాసిటీతో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేయనుంది. బడ్జెట్ ధరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ని పొందేందుకు వీలుంది.