రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. సినిమా విడుదల (జూన్ 27)కు మరో నాలుగు రోజుల సమయమే ఉన్నందున శుక్రవారం.. రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తొలి ట్రైలర్‌లా ఈ వీడియోలో కూడా హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. ఈ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్స్ సీన్స్‌తో నింపేశారు. అయితే ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేపారు. ట్రైలర్‌లో విజయ్ దేవరకొండ సైతం ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఆ పాత్రలో విజయ్ దేవరకొండ!
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్ క్యాస్ట్ నటించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించినట్లు గత కొంతకాలంగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కల్కి రెండో ట్రైలర్ రిలీజ్ కాగా.. అందులో విజయ్ దేవరకొండను చూపకనే చూపించారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ ట్రైలర్‌లో మహాభారత సంగ్రామం సీక్వెన్స్‌ను కొద్దిసేపు చూపించారు. ఇందులో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అర్జునుడితో తలపడ్డారు. అయితే అర్జునుడి పాత్ర ముఖాన్ని స్పష్టంగా చూపించలేదు. దీంతో అది విజయ్ కావొచ్చని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. మహాభారతం సీక్వెన్స్‌లో విజయ్ అర్జునుడిగా కనిపించడం ఖాయమని అంటున్నారు. ఈ ప్రశ్నకు జూన్ 27న క్లారిటీ వచ్చే అవకాశముంది.
ట్రైలర్‌లో మరో నటి రివీల్
కల్కి సెకండ్ ట్రైలర్‌లో ఓ హీరోయిన్‌ను చూపించి దర్శకుడు నాగ్ అశ్విన్ అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఆ నటి మరెవరో కాదు.. మాళవిక నాయర్ (Malvika Nair). గతంలో వైజయంతీ నెట్‌వర్క్ బ్యానర్‌లలో తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘మహానటి’లోను ఆమె కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి చిత్రంలో ఆమె నటించడం విశేషం. వైజయంతి బ్యానర్‌లో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’లోనూ మాళవిక సందడి చేసింది. ట్రైలర్‌లోని ఆమె లుక్‌ను కొందరు స్క్రీన్ షాట్ తీసి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ఆమె పాత్రలో పోషించిందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
రాజమౌళి పాత్ర అదేనా?
కల్కి చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) కూడా ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన విశ్వామిత్రుని పాత్రలో కనిపిస్తారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. సినిమాలోని కీలక సన్నివేశంలో రాజమౌళి పాత్ర తెరపైకి వస్తుందని అంటున్నారు. రెండు నుంచి మూడు నిమిషాల నిడివి లోపే రాజమౌళి పాత్ర ముగుస్తుందని సమాచారం. మరోవైపు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ నుంచి కూడా ఓ క్యామియో ఉంటుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఆర్‌జీవీ పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. కల్కి కోసం ఆర్జీవీ ఫస్ట్ టైమ్ యాక్టర్‌గా మారడం గమనార్హం.
సెకండ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
కల్కి సెకండ్ ట్రైలర్‌ను పూర్తిగా యాక్షన్ సీన్స్‌తో నింపేసారు. లోకనాయకుడు కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచింది.’ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనుషులు మారరు, మారలేరు’ అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మధ్య కూడా ఫైట్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇక హీరోయిన్ దీపికా పదుకొణె, శోభనను కూడా కాసేపు చూపించారు. ఆఖర్లో ప్రభాస్ డైలాగ్ కూడా బాగుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి ట్రైలర్ భారీ యాక్షన్ సీన్స్‌తో అద్భుతంగా ఉంది. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 16 గంటల్లో 7.9 మిలియన్ వ్యూస్ సాధించింది.