• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Volvo C40 Recharge: ఎలక్ట్రిక్ కార్లలో రారాజు.. ఇక కియా, BMW పని అయిపోయినట్లేనా?

    స్విస్ ఆటో మేకర్ వోల్వో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. Volvo C40 రిచార్జ్ పేరుతో దీనిని SUV సెగ్మెంట్లో తీసుకొచ్చింది. దేశీయ మార్కెట్‌లో దీని ఎక్స్‌ షోరూం ధర రూ.61.25 లక్షలుగా ఉంది. దీని ధరకు తగ్గట్టుగానే అన్ని రకాల ప్రీమియం ఫీచర్లతో కారును తయారు చేశారు. మరి ఈ కారు ఫుల్ డీటెయిల్స్‌పై ఓ లుక్‌ వేద్దాం.

    Volvo C40 Recharge Specifications

    డిజైన్

    వోల్వో సీ40 రిచార్జ్ ఎలక్ట్రిక్ కారు అట్రాక్టివ్ అపియరెన్స్‌తో స్టైలీష్ లుక్‌లో కనిపిస్తుంది.  ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్, 19-ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హై గ్లాస్ బ్లాక్ సైడ్ విండో ట్రిమ్, డోర్ మిర్రర్ కవర్స్ లామినేటెడ్ పనోరమిక్ రూఫ్ విత్ ప్రొటెక్టివ్ యూవీ కోటింగ్, మ్యాట్లె టెక్ గ్రే,  ప్రొటెక్టివ్ క్యాప్ కిట్, టింటెడ్ రేర్ విండో ఆధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

    క్యాబిన్

    క్యాబిన్‌ను కంప్లీట్ హైలుక్‌లో అయితే డిజైన్ చేశారు.  ఎయిర్ క్లీనర్, యాప్ రిమోట్ సర్వీస్, పిక్సెల్ లైట్స్, హార్మన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ మంచి లాంగ్ రైడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి.  60:40 ఫోల్డబుల్ రేర్ సీట్లు, 12-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9-అంగుళాల సెంటర్ డిస్ ప్లేతో కూడిన డాష్ బోర్డ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ ప్లే స్టోర్ తోపాటు ఇన్ బిల్ట్ గూగుల్ యాప్స్ ఉంటాయి. 360 డిగ్రీ పార్కింగ్ వ్యూ, రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (BLIS), క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ‌అమర్చారు.

    ఎయిర్ బ్యాగ్స్

    వోల్వో సీ40 రిచార్జ్ కారు  ఫ్రంట్ సైడ్‌ క్యాబిన్‌లో మొత్తం నాలుగు ఎయిర్ బ్యాగ్స్‌ను అయితే ప్రొవైడ్ చేస్తోంది. ముందు కూర్చునే  డ్రైవర్, ప్యాసింజర్‌కు ఇవి రక్షణ కల్పిస్తాయి.

    ఇంజన్ కెపాసిటీ

    వోల్వో సీ40 రిచార్జ్ డ్యూయల్ మోటర్ సెటప్‌తో వచ్చింది. ఈ రెండు 78kWh బ్యాటరీ ప్యాక్‌కు అనుసంధానమై ఉంటాయి. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 530 కి.మీ వరకు ప్రయాణిస్తుందని క్లెయిమ్ చేసింది. సీ40 రిచార్జ్ ఈవీ కారు ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఆఫర్‌ చేస్తోంది. 150kW DC ఛార్జర్ ద్వారా  బ్యాటరీ 0-100 శాతం ఛార్జ్ కావడానికి కేవలం 27 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. 

    దీనిలోని ట్విన్ మోటార్ సెటప్  408hp, 660NM టార్క్‌ను అయితే వెలువరుస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 180 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.

    కలర్ ఆప్షన్స్

    సీ40 రిచార్జ్ ఈవీ కారు ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 

    1. బ్లాక్ స్టోన్ (Black Stone)
    2. ఓనీక్స్ బ్లాక్ (Onyx Black)
    3. ఫ్యుషన్ రెడ్ (Fusion Red)
    4. థండర్ గ్రే (Thunder Grey)
    5. జోర్ బ్లూ (Fjord Blue)
    6. సిల్వర్ డాన్ (Silver Dawn)
    7. క్రిస్టల్ వైట్ (Crystal White)
    8.  సాగే గ్రీన్ (Sage Green)

    బుకింగ్స్ స్టార్ట్

    వోల్వో సీ40 రిచార్జ్ కారు బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ పెర్కొంది. అధికారిక వెబ్‌సైట్‌లో కార్ల ప్రీబుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.  బుక్ చేసుకున్న కొన్ని రోజుల్లో కార్ల డెలివరీ మొదలు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

    కియా, హ్యూందాయ్‌కు పోటీ

    వోల్వో సీ40 రిచార్జ్ అందిస్తున్న ప్రీమియం ఫీచర్స్‌తో ఇప్పటికే ఈ సెగ్మెంట్లో ఉన్నా హ్యుందాయ్ ఐకానిక్-5 తోపాటు కియా ఈవీ6, బీఎండబ్ల్యూ 14 ఈవీ కార్లు గట్టి పోటీని ఎదుర్కొనున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv