ఈ వీకెండ్ వినాయక చవితి (సెప్టెంబర్ 7) సందర్భంగా పలు కొత్త చిత్రాలు ఓటీటీలో అడుగుపెట్టాయి. మరికొన్ని స్ట్రీమింగ్‌లోకి వచ్చి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్దమవుతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదిగా సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ఇందులో రామ్‌కు జోడీగా కావ్యా థాపర్ నటించింది. ప్లాట్ ఏంటంటే ‘మాఫియా డింపుల్ బిగ్ బుల్(సంజయ్ దత్) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్ బ్రేయిన్‌లోకి బిగ్ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు?’ అనేది కథ
సింబా (Simbaa)
జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సింబా‘. ఈ సినిమాకు సంపత్ నంది కథ, మాటలు అందించాడు. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 6 నుంచి ఆహా వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌లోకి రానుంది. ప్లాట్ ఏంటంటే ‘పార్థ గ్రూప్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యకు గురవుతారు. దీని వెనక టీచర్ అక్షిక (అనసూయ), జర్నలిస్టు ఫాజిల్ (మాగంటి శ్రీనాథ్) ఉన్నట్లు నిర్ధారించి పోలీసులు అరెస్టు చేస్తారు. అయినప్పటికీ పార్థ గ్యాంగ్‌లోని మరో వ్యక్తి హత్యకు గురవుతాడు. అసలు ఆ హత్యలకు కారణం ఏంటి? పార్థ మనుషులనే ఎందుకు హత్య చేస్తున్నారు? వీటితో మ్యాన్ పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు)కి సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
నింద (Nindha)
యంగ్ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్ర పోషించిన ‘నింద’ చిత్రం ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీకి రాజేశ్ జగన్నాథం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 6 నుంచి ఈటీవీ విన్ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుండటం గమనార్హం. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ‘ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది. దీంతో తీర్పు చెప్పిన న్యాయమూర్తి బాధతో కన్నుమూస్తారు. ఈ కేసులో అసలైన నేరస్థుడిని పట్టుకునేందుకు జడ్డి కొడుకు బయలు దేరతాడు. ఆరుగురు అనుమానుతుల్ని కిడ్నాప్ చేసి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతడికి సంచలన నిజాలు తెలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది?’ అన్నది కథ.
అడియోస్ అమిగో (Adios Amigo)
సూరజ్ వెంజరముడు, ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అడియోస్ అమిగో‘. గత నెల ఆగస్టు 9న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. తెలుగులోనూ ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ప్రియన్ (సూరజ్) ఆర్థిక సమస్యల్లో ఉంటాడు. తల్లి గుండె ఆపరేషన్‌కు సైతం డబ్బులేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి ధనవంతుడైన ప్రిన్స్ (ఆసిఫ్) పరిచయమవుతాడు. అయితే ఇతరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రిన్స్ వల్ల ప్రియన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? ప్రిన్స్ వద్ద ప్రియన్ డబ్బు తీసుకోగలిగాడా? తన తల్లికి వైద్యం చేయించాడా?’ అనేది స్టోరీ.
ఇరుల్ (Irul)
ఫహాద్ ఫాజిల్, మంజుమ్మల్ బాయ్స్ ఫేమ్ సౌబీన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇరుల్’ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. కేవలం మూడు పాత్రలతోనే దర్శకుడు నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కథ మొత్తం ఫహాద్ ఫాజిల్, దర్శనా రాజేంద్రన్‌తో పాటు సౌబీన్ షాహిర్ పాత్రల చుట్టూ ఒకే ఇంట్లో సాగుతుంది. సెప్టెంబర్ 6 నుంచి ఆహా వేదికగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. ప్రస్తుతానికి తమిళంలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్లాట్ ఏంటంటే ‘అలెక్స్ (సౌబీన్ షాహిర్) ఓ రైటర్. తన ప్రియురాలు అర్చనతో (దర్శనా రాజేంద్రన్) కలిసి కారులో ట్రిప్‌కు బయలుదేరుతాడు. ఓ అటవీ ప్రాంతంలో వారి కారు ఆగిపోతుంది. షెల్టర్ కోసం దగ్గరలోని ఓ ఇంట్లోకి వెళతారు. ఆ ఇంటి ఓనర్ ఉన్ని (ఫహాద్ ఫాజిల్) వారికి ఆశ్రయం ఇస్తాడు. సీరియల్ కిల్లర్ అయినా ఉన్ని బారి నుంచి వారు ఎలా తప్పించుకున్నారు? అన్నది స్టోరీ.
ఐసీ814: ది కాందహార్ హైజాక్ (IC814: The Kandahar Hijack)
గతవారం కూడా పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి విడుదలయ్యాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సిరీస్ ‘ఐసీ814: ది కాందహార్ హైజాక్‘. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌ను ఇప్పటివరకూ చూడకుంటే ఈ వీకెండ్ చేసేయండి. మీరు తప్పకుండా థ్రిల్ అవుతారు. ఇందులో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, దియా మీర్జా, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 29వ తేదీ నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘1999లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. పైలెట్‌ను బెదిరించి అఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌లో విమానాన్ని ల్యాండ్ చేయిస్తారు. ఈ క్రమంలో విమానంలోని 188 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది పరిస్థితి ఏంటి? వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది?’ అన్నది స్టోరీ.
బడ్డీ (Buddy)
అల్లు శిరీష్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం బడ్డీ కూడా లాస్ట్ వీక్ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఫాంటసీ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో ఆగస్ట్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్లాట్ ఏంటంటే ‘ఆదిత్య రామ్ (అల్లు శిరిష్) పైలెట్‌గా చేస్తుంటాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పల్లవిని చూడకుండానే ప్రేమిస్తాడు. ఓ రోజు పల్లవి మెడికల్ మాఫియా వలలో చిక్కుకొని కిడ్నాప్ అవుతుంది. కోమాలోకి వెళ్లిన ఆమె ఆత్మ టెడ్డీలోకి ప్రవేశిస్తుంది. విలన్ల వద్ద ఉన్న తన బాడీని ఆదిత్య సాయంతో ఎలా పొందింది?’ అన్నది స్టోరీ.
పురుషోత్తముడు (Purushothamudu)
యంగ్ హీరో రాజ్‌తరుణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పురుషోత్తముడు’ (Purushothamudu). రామ్ భీమన దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించారు. జూలై 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఆగస్టు 29 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘రామ్ (రాజ్ తరుణ్) పుట్టుకతో కోటీశ్వరుడు. సీఈవోగా బాధ్యతలు చేపట్టే సమయానికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. 100 రోజులు సామాన్యుడిలా జీవించాల్సి అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రాయపులంక గ్రామానికి రామ్ చేరుకుంటాడు. అక్కడికి వెళ్లాక రామ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? గ్రామస్తుల కోసం రామ్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?