ప్రపంచ మెుబైల్ రంగంలో ప్రస్తుతం 5G ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ మెుబైల్ సంస్థలు సరికొత్త 5G మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. అయితే 4G ఫోన్లతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు అతి తక్కువ ధరకే 5G మెుబైల్‌ను అందించేందుకు రిలయన్స్ సంస్థ సిద్ధమైంది. గూగుల్‌తో కలిసి బడ్జెట్లో జియో ఫోన్ 5G (Jio Phone 5G) ఫోన్‌ను తీసుకువస్తోంది. ఆగస్టు 28న జరిగే 46వ జియో వార్షిక సమావేశం (46th Annual General Meeting)లో దీనిని లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జియో ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ స్క్రీన్
Jio Phone 5G 6.5 అంగుళాల IPS LCD HD+ డిస్ప్లేతో రానుంది. ఇది 1600 x 720 pixels రిజల్యూషన్‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 480 chipsetతో ఇది పనిచేయనుంది
.
కెమెరా క్వాలిటీ
జియో ఫోన్ 5G మెుబైల్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 13 మెగాపిక్సెల్ క్లారిటీతో ఏఐ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాతో ఫోన్ రానుంది. ఇక ఫ్రంట్ సైడ్ 8MP కెమెరాను ఫిక్స్ చేశారు.
స్టోరేజ్ సామర్థ్యం
Jio Phone 5G ఒకే వేరియంట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 4GB RAMతో పాటు 32GB ఇంటర్నల్ మెమొరీ ఇందులో ఉండనుంది. MicroSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది.
ఫోన్ బ్యాటరీ
Jio Phone 5Gను పవర్ఫుల్ బ్యాటరీతో తీసుకురానున్నారు. 5,000mAh బ్యాటరీతో ఈ ఫోన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 18W ఫాస్ట్ చార్జింగ్కు సపోర్టు చేయనుంది. దీని ద్వారా ఫోన్‌ను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.
కలర్స్
Jio Phone 5G కలర్స్‌పై అధికారిక సమాచారం లేదు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రచార చిత్రాల్లో ఈ మెుబైల్ బ్లాక్ కలర్లో కనిపిస్తోంది. ఫైబర్ ప్లాస్టిక్‌తో బాడీని తయారు చేశారు. వెనుకవైపు జియో ట్యాగ్ కూడా కనిపిస్తోంది.
ధర ఎంతంటే?
Jio Phone 5G ధరపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆగస్టు 28న దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ ఫోన్ రూ.10,000 లోపే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. అదే నిజమైతే 5G మెుబైల్స్‌లో ఇది ఓ విప్లవం తీసుకువచ్చే అవకాశం ఉంది.