ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి కళ్లు చెదిరే ఆఫర్లను అందించడానికి అమెజాన్ సిద్ధమైంది. అక్టోబర్ 8 నుంచి ప్రారంభమయ్యే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఊహించని డిస్కౌంట్లతో మెుబైల్ ఫోన్లు, గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులను అందించనుంది. అయితే స్మార్ట్‌టీవీలపై ఈ సేల్కు ముందే భారీ రాయితీలను అమెజాన్ ప్రకటించింది. దసరాకు ముందు కొత్త టీవీని తమ ఇంటికి తీసుకెళ్లాలని భావిస్తున్న వారికి ఇది చక్కటి అవకాశం. తక్కువ బడ్జెట్లో అడ్వాన్స్డ్ స్మార్ట్‌టీవీలను పొందే ఛాన్స్ అమెజాన్ రూపంలో మీ ముందుకు వచ్చింది. భారీ డిస్కౌంట్‌తో వస్తోన్న స్మార్ట్‌టీవీలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Sony Bravia (32 inches) HD TV
Sony కంపెనీకి చెందిన స్మార్ట్‌టీవీలకు మార్కెట్లో మంచి గుడ్‌విల్ ఉంది. Sony Bravia (32 inches) HD TV టీవీని అమెజాన్ తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 34,900. కానీ, అమెజాన్‌లో దీన్ని రూ. 25,990 పొందవచ్చు. రెండు సంవత్సరాల వారంటీని టీవీ కలిగి ఉంది.
LG HD Ready Smart LED TV
LG నుంచి కూడా క్వాలిటీ స్మార్ట్‌టీవీలు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. 32 అంగుళాల వేరియంట్లో LG టీవీ కోరుకునే వారికి LG HD Ready Smart LED TV మంచి ఆప్షన్. దీని అసలు ధర రూ.21,990 కాగా అమెజాన్ దీనిపై 39% డిస్కౌంట్ ప్రకటించింది. దీని వల్ల ఈ టీవీని రూ.13,490లకే దక్కించుకోవచ్చు.
LG Smart TV (Ceramic Black)
LG నుంచి మరో టీవీ కూడా అమెజాన్‌లో తక్కువ ధరకే లభిస్తోంది. ఈ LG Smart TV (Ceramic Black స్మార్ట్ టీవీ అసలు ధర రూ.23,990. దీనిని అమెజాన్ రూ.15,990కు ఆఫర్ చేస్తోంది.
Redmi Android 11 Series
గత కొంత కాలంగా రెడ్మీ కూడా మంచి స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తోంది. రూ.11 వేలు మీ బడ్జెట్ అయితే Redmi Android 11 Series టీవీని ట్రై చేయవచ్చు. దీని అసలు ధర రూ. 24,999. కానీ అమెజాన్ దీనిపై 58% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.10,499కే అందుబాటులోకి వచ్చింది.
Redmi Android 11 Series FHD TV
రెడ్మీ నుంచి 43 అంగుళాల టీవీ కూడా తక్కువ ధరకే లభిస్తోంది. Redmi Android 11 Series FHD TV అసలు ధర రూ. 34,999. అమెజాన్ దీనిపై 46% రాయితీ ఇస్తోంది. దీంతో ఈ టీవీని రూ.18,999 పొందవచ్చు.
Sony Bravia (43 inches) 4K Ultra HD
సోనీ కంపెనీకి చెందిన Sony Bravia 108 cm (43 inches) 4K Ultra HD టీవీపై కూడా భారీ డిస్కౌంట్ ఇస్తోంది. రూ.69,900గా ఉన్న ఈ టీవీని రూ. 41,990 అందిస్తోంది.
LG (43 inches) 4K Ultra HD
LG కంపెనీకి చెందిన LG (43 inches) 4K Ultra HD కూడా అసలు ధరతో పోలిస్తే తక్కువ ధరకే అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీ ఒరిజినల్ ప్రైస్ రూ.49,990. అమెజాన్ దీనిపై 34% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ స్మార్ట్‌టీవీ రూ.32,990 లభిస్తోంది.
LG (55 inches) 4K UHD TV
మీరు LG కంపెనీకి చెందిన పెద్ద టీవీ కోరుకుంటే LG (55 inches) 4K UHD TV ట్రై చేయవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ ఒరిజినల్ ప్రైస్ రూ.79,990. అమెజాన్ దీనిని 46% డిస్కౌంట్‌తో రూ.42,990కు అందిస్తోంది.
Samsung (43 inches) Crystal iSmart 4K
శాంసంగ్ టీవీలపై కూడా అమెజాన్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా Samsung (43 inches) Crystal iSmart 4K టీవీపై బెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.52,900 టీవీని అమెజాన్ రూ.32,990 ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డీ స్క్రీన్‌ను కలిగింది. దీనిపై 12 నెలల వరకూ NO Cost EMI ఆప్షన్ కూడా ఉంది.
Samsung (55 inches) Crystal iSmart 4K
శాంసంగ్ నుంచి 55 inches అంగుళాల 4K టీవీపై కూడా అమెజాన్‌లో మంచి ఆఫర్ లభిస్తోంది. Samsung (55 inches) Crystal iSmart 4K ఒరిజిన్ ప్రైస్ రూ.64,900 కానీ అమెజాన్ దీనిని రూ. 47,490 అందిస్తోంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం