మార్కెట్లో ఎన్ని రకాల టీవీలు ఉన్నప్పటికీ సోనీ స్మార్ట్‌టీవీలకు ఉన్న ప్రత్యేకతే వేరు. అత్యుత్తమ స్క్రీన్ రిజల్యూషన్, అడ్వాన్స్డ్ ఫీచర్లు, నాణ్యమైన సౌండ్ క్వాలిటీ వీటి సొంతం. అందుకే ఎక్కువ మంది సోనీ టీవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక సోనీ కంపెనీకి చెందిన పెద్ద స్క్రీన్ టీవీ తీసుకుంటే థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని చాలా మంది నమ్మకం. దీనిని గుర్తించిన అమెజాన్.. రూ.50,000 పైబడిన సోనీ టీవీలపై భారీ రాయితీలను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) సేల్ ప్రారంభం కాకముందే ఈ డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Sony Bravia (43 inches) 4K UHD TV
ఈ స్మార్ట్ టీవీ 43 అంగుళాల 4K Ultra HD స్క్రీన్‌ను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఓటీటీ వేదికలకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీని అసలు ధర రూ.99,900. అమెజాన్ దీనిపై ఏకంగా 40% డిస్కౌంట్ అందిస్తోంది. ఫలితంగా ఈ టీవీని రూ.59,990కు పొందవచ్చు.
Sony Bravia (55 inches) 4K UHD
ఈ స్మార్ట్‌టీవీ 3840 x 2160 రిజల్యూషన్ ఉన్న 4K Ultra HD స్క్రీన్‌ను కలిగి ఉంది. 55 అంగుళాలు గల ఈ సోనీ టీవీకి 60 Hertz రిఫ్రెష్ రేటును అందించారు. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌ను అమర్చారు. దీని అసలు ధర రూ.1,29,900. అమెజాన్ 43% శాతం డిస్కౌంట్‌తో రూ.73,990కు దీన్ని విక్రయిస్తోంది.
Sony Bravia 108 cm 4K UHD LED
సోనీ విడుదల చేసిన టీవీలలో Sony Bravia 108 cm 4K UHD LED స్మార్ట్‌టీవీ మంచి సేల్స్‌ను కలిగి ఉంది. 55 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ టీవీకి 3840 x 2160 రిజల్యూషన్‌ను అందించారు. ఈ టీవీ అన్ని ఓటీటీ వేదికలకు సపోర్టు చేస్తుంది. దీని అసలు ధర రూ.99,900. అమెజాన్‌లో ఇది 30% డిస్కౌంట్‌తో లభిస్తోంది. రూ.70,290 ఈ సోనీ టీవీని దక్కించుకోవచ్చు.
Sony Bravia (65 inches) 4K Ultra HD
65 అంగుళాల ఈ స్మార్ట్‌టీవీకి 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ అందించారు. 60 Hertz రిఫ్రెష్ రేటుతో పాటు గేమింగ్ కన్సోల్‌ను కూడా ఇందులో ఫిక్స్ చేశారు. అన్ని స్ట్రీమింగ్ వేదికలను ఈ సోనీ టీవీలో ఎంచక్కా వీక్షించవచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.1,64,900. అమెజాన్ 45% డిస్కౌంట్ ఇస్తోంది. కాబట్టి ఈ టీవీని రూ.89,990 అందుబాటులోకి వచ్చింది.
Sony Bravia (55 inches) XR Series 4K UHD
సోనీలోని XR సిరీస్‌కు చెందిన ఈ టీవీ మంచి ఆదరణ పొందింది. ఇది 3840 x 2160 4K Ultra HD రిజల్యూషన్ కలిగి ఉంది. ఇందులో నాలుగు HDMI ports ఉన్నాయి. Dolby Atmos సౌండ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. దీని అసలు ధర రూ. 1,69,900. అమెజాన్ దీనిని రూ.96,990కే ఆఫర్ చేస్తోంది.
Sony Bravia 139 cm XR series
ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే మీరు Sony Bravia 139 cm (55 inches) XR series కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 2,49,900. అమెజాన్ దీనిని సగం ధరకే ఆఫర్ చేస్తోంది. రూ. 1,22,990కు కొనుగోలు చేసే ఛాన్స్ ఇస్తోంది.
Sony Bravia (75 inches) XR Series
సోనీ కంపెనీకి చెందిన ఈ టీవీ కూడా థియేటర్ అనుభూతిని పంచుతుంది. ఇది ఏకంగా 75 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. అమెజాన్‌లో రూ.2,16,990 అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3,79,900 కావడం గమనార్హం.
Sony Bravia (65 inches) XR Series
ఈ స్మార్ట్‌టీవీకి యూజర్ల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. 65 అంగుళాల 4K Ultra HD Smart OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఓటీటీ వేదికలు అన్నింటిని ఇందులో చూడొచ్చు. దీని ఒరిజినల్ ప్రైస్ రూ. 4,79,900. అమెజాన్ 41 శాతం రాయితీతో రూ.2,84,990 దీనిని అందిస్తోంది.
Sony Bravia 195 cm (77 inches)
సోనీ కంపెనీ రిలీజ్ చేసిన టీవీలలో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ 77 అంగుళాల 4K Ultra HD Smart OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.6,99,900. అమెజాన్ 44 శాతం డిస్కౌంట్‌తో రూ.3,89,990 అందిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!