ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్ నడుస్తోంది. ఇందులో ప్రముఖ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి స్మార్ట్‌వాచ్ తీసుకోవాలని భావిస్తున్న వారికి ఇదే మంచి ఛాన్స్. మీకు నచ్చిన కంపెనీల వాచ్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లపై ఉన్న టాప్ 10 డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Amazfit Pop 3S Smartwatch
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో Amazfit Pop 3S Smartwatch భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ అసలు ధర రూ.5,999 కాగా, అమెజాన్ దీనిపై 50 శాతం రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ వాచ్ రూ. 2,999 లభిస్తోంది. ఈ అమెజ్‌ఫిట్ వాచ్ 1.96 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెన్స్, 12 రోజుల బ్యాటరీ లైఫ్, 100 వాచ్ ఫేసెస్, 100 స్పోర్ట్స్ మోడ్స్ కలిగి ఉంది.
Noise ColorFit Ultra 3
అమెజాన్‌లో భారీ రాయితీతో లభిస్తోన్న మరో వాచ్ Noise ColorFit Ultra 3. ఈ వాచ్ 1.96 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, గెస్టర్ కంట్రోల్ ఫీచర్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.7,999. కానీ అమెజాన్ దీనిని 69% డిస్కౌంట్‌తో 2,499కే అందిస్తోంది.
OnePlus Nord Watch
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌వాచ్ కొనాలని భావించే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే ఈ వాచ్‌పై అమెజాన్ 43% డిస్కౌంట్ అందిస్తోంది. దీని వల్ల రూ.6,999 ఉన్న స్మార్ట్‌వాచ్ రూ.3,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ 1.78 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, 105 ఫిట్నెస్ మోడ్, వివిద రకాల హెల్త్ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ను కూడా ఈ వాచ్ అందిస్తుంది.
boAt Xtend Plus Smartwatch
రూ. 2వేల లోపు మంచి స్మార్ట్‌వాచ్ కోరుకునే వారు boAt Xtend Plus పరిశీలించవచ్చు. ఈ వాచ్ అసలు ధర రూ.8,999 కాగా, అమెజాన్ దీనిపై ఏకంగా 78% రాయితీ ఇస్తోంది. ఫలితంగా ఈ వాచ్‌ను రూ.1,999 పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 1.78 అంగుళా AMOLED స్క్రీన్, ఆల్వేస్ ఆన్ మోడ్ (Always on mode), 100+ స్పోర్ట్స్ మోడ్స్ ఫీచర్లను కలిగి ఉంది.
Fire-Boltt Phoenix
అమెజాన్‌లో భారీ రాయితీతో వచ్చిన వాచ్ Fire-Boltt Phoenix. ఇది 85% రాయితీతో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ. 12,999. కానీ ఇది రూ.1,999కే సేల్కు వచ్చింది. ఈ వాచ్ 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే, 700 nits brightnessను కలిగి ఉంది. మూడు గంటల్లోనే వాచ్ ఫుల్‌ఛార్జింగ్ అవుతుంది.
Redmi Watch 3 Active
తక్కువ బడ్జెట్లో అడ్వాన్స్డ్ స్మార్ట్‌వాచ్‌లను అందిస్తున్న టెక్ కంపెనీ ‘రెడ్మీ’. ఈ చైనీస్ సంస్థ రిలీజ్ చేసిన Redmi Watch 3 Active అమెజాన్ సేల్‌లో తక్కువకే లభిస్తోంది. దీని అసలు ధర రూ. 5,999. కానీ అమెజాన్ దీన్ని సగం ధరకే అంటే రూ.2,599కే అందిస్తోంది. ఈ వాచ్ 1.83 అంగుళాల లార్జ్ డిస్ప్లేతో పాటు మెటల్ ఫినిష్ను కలిగి ఉంది. 12 రోజుల బ్యాటరీ లైఫ్ ఈ వాచ్ సొంతం.
Amazfit GTS 4 Mini
అమెజ్‌ఫిట్ నుంచి మరో స్మార్ట్‌వాచ్ కూడా మంచి డిస్కౌంట్‌తో అమెజాన్ సేల్‌లో లభిస్తోంది. Amazfit GTS 4 Mini స్మార్ట్‌వాచ్ రూ.7,999కే అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ అసలు ధర రూ.10,999 కావడం గమనార్హం. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే ఇది 1.65 అంగుళాల డిస్ప్లే, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 15 రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. దీనికి Alexa వాయిస్ అసిస్టెన్స్ సపోర్ట్‌ను అందించారు.
boAt Ultima Chronos
ఈ స్మార్ట్‌వాచ్‌ను కూడా అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో దక్కించుకోవచ్చు. ఇది 78% రాయితీతో రూ.1,999కే లభిస్తోంది. ఈ వాచ్ 1.96 అంగుళాల AMOLED స్క్రీన్ కలిగి ఉంది. అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్, ఫిట్నెస్ ట్రాకర్స్, స్ట్రెస్ & స్లీప్ మేనేజ్మెంట్, 650 nits పీక్ బ్రైట్నెస్ ఫీచర్లను కలిగి ఉంది.
Noise Nova
నాయిస్ కంపెనీకి చెందిన స్మార్ట్‌వాచ్ కూడా అమెజాన్ బెస్ట్ డీల్స్‌లో ఉంది. రూ.7,999 విలువైన Noise Nova స్మార్ట్‌వాచ్‌ను అమెజాన్ రూ.2,499 అందిస్తోంది. ఈ వాచ్ 1.46 అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ (Bluetooth calling), 10 రోజుల బ్యాటరీ లైఫ్ ఫీచర్లను కలిగి ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!