తక్కువ బడ్జెట్లో అడ్వాన్స్డ్ మెుబైల్స్‌ను రిలీజ్ చేసే కంపెనీల్లో రెడ్మీ (Redmi) ముందు వరుసలో ఉంటుంది. ఈ చైనీస్ కంపెనీ రిలీజ్ చేసే స్మార్ట్ఫోన్లకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రెడ్మీ మరో సరికొత్త మెుబైల్‌తో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. Redmi K70 మెుబైల్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. Redmi K60 మెుబైల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా దీన్ని తీసుకొస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఫోన్ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేరియంట్స్
Redmi K70 మెుబైల్.. మెుత్తం మూడు వేరియంట్లలో రాబోతున్నట్లు సమాచారం. Redmi K70, Redmi K70e, Redmi K70 Pro పేర్లతో ఇవి గ్లోబల్ మార్కెట్లలోకి వస్తాయని తెలుస్తోంది.
ఫోన్ స్క్రీన్
ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల OLED స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. దీనికి 392 ppi పిక్సెల్ డెన్సిటి, 2K రిజల్యూషన్‌ను అందిస్తారట. ఈ మెుబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. Qualcomm Snapdragon 8 Plus Gen ప్రొసెసర్, Adreno 730 గ్రాఫిక్స్‌పై మెుబైల్ వర్క్ చేస్తుందని లీకైనా సమాచారం పేర్కొంది.
పవర్ఫుల్ బ్యాటరీ
Redmi K70 మెుబైల్‌ను 5500 mAh పవర్ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు తెలిసింది. దీనికి ఏకంగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తారని సమాచారం. దీని వల్ల మీ ఫోన్ నిమిషాల వ్యవధిలో ఫుల్ చార్జింగ్ అవుతుంది.
కెమెరా
ఈ నయా రెడ్మీ ఫోన్ అద్బుతమైన కెమెరా ఫీచర్లతో వస్తున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. 108 MP + 12 MP + 5 MP రియర్ కెమెరా సెటప్‌తో ఫోన్ రానున్నట్లు అభిప్రాయపడుతున్నాయి. నాణ్యమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 24 MP ఫ్రంట్ కెమెరాను దీనికి ఫిక్స్ చేస్తారని తెలిసింది.
ర్యామ్ & స్టోరేజ్
రెడ్మీ 70K మెుబైల్ పవర్ఫుల్ ర్యామ్‌తో రూపొందుతోంది. ఈ మెుబైల్‌ను 8 GB RAM సామర్థ్యంతో తీసుకొస్తారని సమాచారం. 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తారని లీకైన సమాచారం చెబుతోంది.
సెన్సార్స్
ఈ మెుబైల్.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (Fingerprint Sensor), లైట్ సెన్సార్ (Light sensor), ప్రొక్సిమిటి సెన్సార్ (Proximity sensor), యాక్సిలోమీటర్ (Accelerometer), కాంపస్ (Compass), గైరోస్కోప్ (Gyroscope) సెన్సార్లతో రాబోతోంది.
ధర ఎంత?
రెడ్మీ 70K మెుబైల్ ధరపై షావోమీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయాలేదు. లాంచింగ్ ఈవెంట్ పైనా స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 31,990 ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!