ప్రస్తుతం మూడు రకాల ప్రింటర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంక్‌జెట్ (Inkjet), లేజర్ (Laser), డెస్క్‌జెట్ (Deskjet) అనే మూడు కేటగిరీల్లో ప్రింటర్లు లభిస్తున్నాయి. వీటిలో ఇంక్‌జెట్ ప్రింటర్లు నాణ్యమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి హై క్వాలిటీ కలర్ ప్రింట్స్‌ను అందిస్తాయి. అంతేగాక బొమ్మలు, గ్రాఫ్స్, డాక్యుమెంట్ వివరాలను స్పష్టంగా ముద్రిస్తాయి. ప్రస్తుతం అనేక రకాల ఇంక్‌జెట్ ప్రింటర్లు లభిస్తుండగా.. వాటిలో అత్యుత్తమమైన హెచ్‌పీ ఇంక్‌జెట్ (HP Inkjet) ప్రింటర్లను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. కొత్తగా ఇంక్‌జెట్ ప్రింటర్లు కొనాలని భావిస్తున్న వారు వీటిని ట్రై చేయవచ్చు.
HP Ink Tank
HP కంపెనీ తయారు చేసిన ఈ ప్రింటర్ నాణ్యమైన కాపీలను అందిస్తుంది. HP యాప్ సాయంతో ఎక్కడి నుంచైన ఈ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు. అమెజాన్‌లో ఇది 8% డిస్కౌంట్‌తో రూ.17,390 లభిస్తోంది.
HP Smart Tank 210
ఇది సింగిల్ ఫంక్షన్ వైఫై కలర్ ప్రింటర్. దీని ద్వారా బ్లాక్ & వైట్ ప్రింట్‌లను కూడా తీసుకోవచ్చు. HP యాప్ ద్వారా ఈ ప్రింటర్‌ను కంట్రోల్ చేయవచ్చు. దీని అసలు ధర రూ.13,599. కానీ అమెజాన్ 26% డిస్కౌంట్‌తో రూ.9,999లకు దీనిని ఆఫర్ చేస్తోంది.
HP Smart Tank 580
ప్రింట్, స్కాన్, కాపీ అనే మూడు విధానాలపై ఆధారపడి ఈ ప్రింటర్ వర్క్ చేస్తుంది. దీని ద్వారా పుస్తకాన్ని సైతం స్కాన్ చేసుకోవచ్చు. అంతేగాక మెుబైల్ ఫాక్స్‌కు కూడా ఈ ప్రింటర్ సపోర్ట్ చేస్తుంది. ఇది 16% రాయితీతో రూ.15,799 అందుబాటులో ఉంది.
HP Smart 525
ఈ ప్రింటర్‌ను ఇల్లు, ఆఫీసులలో వినియోగించవచ్చు. దీని సాయంతో స్పష్టమైన కలర్ ప్రింట్స్‌ను తీసుకోవచ్చు. స్కాన్ చేసిన డాక్యుమెంట్ వివరాలను టెక్స్ట్ రూపంలో భద్రపరుచుకోవచ్చు. ఈ ప్రింటర్ 18% రాయితీతో రూ.12,000 లభిస్తోంది.
HP Smart tank 529
ఈ ప్రింటర్‌ను USB కేబుల్ ద్వారా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫీసు, హోమ్, హోటల్స్ ఇలా ఎక్కడైన ఈ ఇంక్‌జెట్ ప్రింటర్‌ను తేలిగ్గా వినియోగించవచ్చు. ఇది 26% డిస్కౌంట్‌తో రూ.10,799 అందుబాటులో ఉంది.
HP Smart Tank 675
ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్‌గా పనిచేస్తుంది. మెుబైల్ ద్వారా ప్రింటింగ్‌కు అనుమతిస్తుంది. అంతేగాక ఈ ప్రింటర్‌తో రెండు వైపులా ప్రింట్ తీసుకోవచ్చు. ఇది 15 శాతం డిస్కౌంట్‌తో రూ.18,499లకు అమెజాన్‌లో సేల్ అవుతోంది.
HP Smart Tank 520
HP ఇంక్‌జెట్ ప్రింటర్లలో ఈ ప్రింటర్‌కు కూడా మంచి గుడ్‌విల్ ఉంది. యూజర్లు ఈ ప్రింటర్ వినియోగంపై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. దీని అసలు ధర రూ.15,980. అమెజాన్ దీనిపై 19% రాయితీ ప్రకటించింది. రూ.12,999లకు ఈ ప్రింటర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!