• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!

    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్  చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.

    7:11PM

    టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు.  తెలుగులో మంచి విజయం సాధించింది.

    ఒకే ఒక జీవితం

    తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

    Disco Raja

    సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి… చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.

    Mark Antony

    టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు.

    Krrish 3

    సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్‌ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది.

    Robo 2.o

    సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు.

    Robo 

    రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే  ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది.

    24

    టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు.

    Skylab

    సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.

    Srivalli

    బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా ‘శ్రీవల్లి’ సినిమా రూపొందింది. 

    Taxiwaala

    ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది.  మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే ‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.

    Tik Tik Tik

    సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో  జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు.

    Chandamama Lo Amrutham

    చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.

    Yuganiki Okkadu

    తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు.

    ఆదిత్య 369

    తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.

    Kalki 2898 AD

    సైన్స్‌ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.  కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024  సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv