ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్. మరో కొత్త గెలాక్సీ మెుబైల్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24) పేరుతో నయా సిరీస్‌ను జనవరిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. టెక్ ప్రియులను ఆకర్షించే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు గెలాక్సీ ఎస్24 మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ లీకైన ఫీచర్లు ఏంటి? ఫోన్ ధర ఎంత? వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
వేరియంట్లు
శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఎస్24 లైనప్‌లో మూడు మోడళ్లను పరిచయం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గెలాక్సీ S24తో పాటు S24+ S24 అల్ట్రా వేరియంట్లలో ఈ సిరీస్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఫోన్ స్క్రీన్
Galaxy S24 వేరియంట్ 6.2 అంగుళాల AMOLED 2X FHD+ స్క్రీన్‌తో రానుంది. Galaxy S24+, Galaxy S24 Ultra మోడల్స్ వరుసగా 6.7, 6.8 అంగుళాల AMOLED 2X quad-HD+ డిస్ప్లేతో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మెుబైల్స్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రొసెసర్, Android 14 ఆధారిత Samsung’s One UI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై వర్క్ చేయనున్నాయి.
బ్యాటరీ సామర్థ్యం
Samsung Galaxy S24 సిరీస్‌లోని మూడు వేరియంట్లు మూడు రకాల బ్యాటరీలతో రాబోతున్నట్లు సమాచారం. Galaxy S24 మోడల్ 4,000mAh బ్యాటరీతో రానుండగా Galaxy S24+, Galaxy S24 Ultra వేరియంట్లు వరుసగా 4,900mAh, 5,000mAh బ్యాటరీలతో వస్తున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది.
ర్యామ్ స్టోరేజ్
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 మోడల్ 8GB RAM / 128GB or 256GB స్టోరేజీతో రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే గెలాక్సీ S24+ వేరియంట్ 12GB RAM / 256GB లేదా 512GB స్టోరేజీతో వస్తుందని అంటున్నారు.
కెమెరా
Galaxy S24 సిరీస్‌లో కెమెరా ఫీచర్ల విషయంలో సరైన స్పష్టత లేదు. అయితే సిరీస్‌లోని బేసిక్ మోడల్ 50MP ప్రైమరీ కెమెరాతో రాబోతున్నట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Galaxy S24 Ultra వేరియంట్ ఏకంగా 200MP ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. దీనిపై లాంచింగ్ రోజున స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
కలర్ ఆప్షన్స్
Galaxy S24 సిరీస్ మెుత్తం నాలుగు రంగుల్లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. నలుపు (black), గ్రే (grey), వైలెట్ (violet), పసుపు (yellow) కలర్ ఆప్షన్స్‌లో ఫోన్ లభించనుంది.
ధర ఎంతంటే?
జనవరి 17న జరగనున్న శాంసంగ్ లాంచింగ్ ఈవెంట్లో Samsung Galaxy S24 సిరీస్ విడుదల కానుంది. ఆ రోజే ధర, ఫీచర్లపై స్పష్టత రానుంది. అయితే ‘గెలాక్సీ S24’ సిరీస్‌లో ప్రారంభ వేరియంట్ ధర రూ.85,990 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం