• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kia Seltos 2024: హుండాయ్‌ క్రెటా కారుకు గట్టి పోటీ ఇస్తుందా? ఫీచర్లలో ఏ కారుది పైచేయి?

    దేశంలోని ప్రముఖ కార్ల కంపెనీల్లో కియా (Kia) ఒకటి. ఆ కంపెనీ కార్లకు వాహన ప్రియుల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్‌ ‘కియా సెల్టోస్‌ 2024’ (Kia Seltos 2024) పేరుతో కొత్త ఎస్‌యూవీని మార్కెట్‌లోకి విడుదల చేసింది. డీజిల్‌ వెర్షన్‌లో దీన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Hyundai Creta 2024 కారుకు పోటీగా (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) ఈ కారును లాంచ్‌ చేసినట్లు ఆటోమెుబైల్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హుండాయ్‌ క్రెటాను తలదన్నే అత్యాధునిక ఫీచర్లు ‘కియా సెల్టోస్‌ 2024’లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతా? నయా కియా కారులో ఉన్న ఫీచర్లు ఏంటి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    ఇంజిన్‌ సామర్థ్యం

    Hyundai Creta కారు 1497cc ఇంజిన్‌ కలిగి ఉండగా.. KIA Seltos 2024 ఎస్‌యూవీ 1493cc ఇంజిన్‌తో లాంచ్‌ అయ్యింది. హుండాయ్‌ కారు 113.18 bhp @ 6300 rpm పవర్‌ను జనరేట్‌ చేస్తూ కియా 114.41 bhp @ 4000 rpm పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. హుండాయ్‌ పెట్రోల్‌ రన్‌ అయితే కియా డీజిట్‌లో పని చేస్తుంది. 

     6 స్పీడ్ గేర్‌బాక్స్‌

    కొత్త కియా సెల్టోస్‌ (Kia Seltos 2024) HTE, HTK, HTK+, HTX, HTX+తో వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. ఈ మోడల్స్‌ను కస్టమర్లు 6 స్పీడ్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేసుకోవచ్చు. Hyundai Creta 2024 కారు సైతం E, EX, E Diesel, S, Ex Diesel మోడల్స్‌లో లాంచ్‌ అయ్యింది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. 

    స్పీడ్‌ & మైలేజ్‌

    Hyundai Creta కారు (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) లీటర్‌కు 17.4 kmpl మైలేజ్‌ను ఇస్తే.. KIA Seltos 21 kmpl అందిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. BS6 నిబంధనల ప్రకారం హుండాయ్‌ కారు ఇంజిన్‌ తయారు కాగా.. కియా ఇంకాస్త అప్‌డేట్‌గా BS6 Phase 2 నిబంధనలతో వచ్చింది. హుండాయ్‌ క్రెటా కారులో గరిష్టంగా 195 kmph వేగంతో దూసుకెళ్లవచ్చు. అయితే కియా సెల్టోస్‌ గరిష్ట వేగం మాత్రం 167 kmphగా ఉంది. 

    సేఫ్టీ ఫీచర్లు

    కొత్త కియా సెల్టోస్‌లో 32 సేఫ్టీ ఫీచర్లను సంస్థ (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) అందిస్తోంది. కాగా అన్ని వేరియంట్లలో 15 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌ ఫీచర్లుగా వస్తాయి. 17 లెవెల్-2 ADAS టెక్‌ని చేర్చడం వలన సెల్టోస్ వాహన భద్రతలో మరింత ప్రాధాన్యతనిస్తోంది. అటు హుండాయ్‌ క్రెటాలోనూ రక్షణాత్మక ఫీచర్లు ఉన్నాయి. హుండాయ్‌ క్రెటా కారు 6 ఎయిర్‌ బ్యాగ్స్‌ను కలిగి ఉండగా.. కియా సెల్టోస్‌ సైతం ఆరు ఎయిర్‌ బ్యాగ్స్‌ సేఫ్టీతో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. 

    లగ్జరీ ఫీచర్లు

    కియా సెల్టోస్ కారులో లగ్జరీ ఫీచర్ల ప్యాక్‌ (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) ఉంది. 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో పాటు అదే సైజ్‌లో HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను కారు కలిగి ఉంది. అంతే కాకుండా క్యాబిన్‌లో డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్‌, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌లు ఇందులో చెప్పుకోదగినవి. 360 డిగ్రీ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్‌ ఫీచర్లతో కియా కారు లాంచ్ అయ్యింది. కియాలోని లగ్జరీ ఫీచర్లతో పోలిస్తే హ్యాండాయ్‌ కాస్త వెనకబడిందని ఆటోమెుబైల్‌ వర్గాలు చెబుతున్నాయి. 

    సీటింగ్ అరేంజ్‌మెంట్‌

    హుండాయ్‌, కియా కంపెనీకి చెందిన ఈ రెండు ఎస్‌యూవీ కార్లు లోపల భాగంలో ఐదు సీట్లను కలిగి ఉన్నాయి. డిక్కితో కలిపి ఐదు డోర్లను వీటికి అందించారు. ఈ కార్ల ఫ్యుయల్‌ ఇంజిన్ సామర్థ్యం 50 లీటర్లుగా ఉంది. ఇక Hyundai Creta కారు ఫ్రంట్‌ సైడ్‌ 205/65 R16, వెనకవైపు 205/65 R16 సైజ్‌ టైర్లను కలిగి ఉంది. అటు కియా సెల్టోస్‌ కారు సైతం ముందు వైపు 205 / 65 R16, వెనక భాగంలో 205 / 65 R16 సైజ్ టైర్లతో లాంచ్‌ అయ్యాయి.

    ధర ఎంతంటే?

    Kia Seltos 2024 కారు (Hyundai Creta 2024 vs KIA Seltos 2024) ధర వేరియంట్లను బట్టి రూ.11,99,900 నుంచి రూ.18,27,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారును సంస్థ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందిస్తోంది. Hyundai Creta కారు సైతం మోడల్‌ను బట్టి రూ.10.97 – 20.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య పలుకుతోంది. వీటిని మీ దగ్గరలోని ఆయా కంపెనీల షోరూమ్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv