సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్లో ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
‘కేరాఫ్ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
బూట్‌కట్ బాలరాజు
బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.
ధీర
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్ హీరోగా నటించిన లక్ష్ చదలవాడ ఈ వారం ‘ధీర’ (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.
హ్యాపీ ఎండింగ్
యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా కౌశిక్ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’ (Happy Ending). యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
మిస్ పర్ఫెక్ట్
మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్ వెబ్‌సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’ (Miss Perfect). బిగ్‌బాస్ విజేత అభిజీత్ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్ ఖండేరావ్ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.
సైంధవ్
వెంకటేశ్ లేటెస్ట్ చిత్రం ‘సైంధవ్’ (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది.
Title | Category | Language | Platform | Release Date |
Mighty Bheem Play Time | Series | English | Netflix | Jan 29 |
The Greatest Night In Pop | Movie | English | Netflix | Jan 29 |
Jack Whitehall: Settle Down | Movie | English | Netflix | Jan 30 |
NASCAR: Full Speed | Series | English | Netflix | Jan 30 |
Alexander: The Making of a God | Series | English | Netflix | Jan 31 |
Baby Bandito | Series | English | Netflix | Jan 31 |
Let’s Talk About CHU | Series | English | Netflix | Feb 2 |
Marichi | Movie | Kannada | Amazon Prime | Jan 29 |
Mr. & Mrs. Smith | Series | English | Amazon Prime | Feb 2 |
Saindhav | Movie | Telugu | Amazon Prime | Feb 2 (Rumor) |
Koier | Series | English | Disney+HotStar | Jan 31 |
Miss Perfect | Series | Telugu | Disney+HotStar | Feb 2 |
Self | Movie | English | Disney+HotStar | Feb 2 |
Asedio | Movie | Spanish/English | Book My Show | Jan 30 |
In The No | Series | English | Jio Cinema | Jan 29 |