నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు
దర్శకుడు: రాహుల్ సదాశివన్
సంగీత దర్శకులు: క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రాఫర్: షెహనాద్ జలాల్
ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్. శశికాంత్
విడుదల తేదీ: ఫిబ్రవరి 23, 2024
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో రాహుల్ సదాశివన్ రూపొందించిన డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘భ్రమయుగం‘. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని రిలీజ్ చేసింది. అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలకపాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
తేవన్ (అర్జున్ అశోకన్) (Bramayugam Review In Telugu) ఒక మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ.. ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ ఓ వంటవాడు (సిద్ధార్థ్ భరతన్)తో పాటు ఆ ఇంటి యజమాని కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) మాత్రమే ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథికి కుడుమోన్ బాగా ఆదరిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించవు. అసలు తేవన్ ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు? కుడుమోన్ పొట్టి ఎవరు ? అడవిలో పాడుబడ్డ భవంతిలో ఏం చేస్తున్నాడు? తేవన్ ఆ భవంతి నుంచి తప్పించుకున్నాడా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
మలయాళ మెగాస్టార్ మమ్మూటి (Bramayugam Review In Telugu).. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. కుడుమోన్ పొట్టి మిస్టీరియస్ పాత్రలో అద్బుత నటన కనబరిచాడు. మంత్ర శక్తులను గుప్పిట్లోపెట్టుకొని తక్కువ కులం వాళ్లను కిరాతకంగా చంపే ఓ దుష్టుడి పాత్రలో జీవించాడు. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక తేవన్‌గా అర్జున్ అశోకన్, వంట మనిషిగా సిద్దార్థ్ భరతన్ పోటీ పడి నటించారు. తెరపైన ముగ్గురు ఎవరికి వారే తమ ప్రతిభను చాటుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భ్రమయుగం మూవీ ప్రారంభం నుంచే చాలా ఇంటెన్స్‌తో, హై ఎనర్జీతో మెుదలవుతుంది. ఓపెనింగ్ మిస్ అయితే కథకు కనెక్ట్ కావడానికి చాలా ఇబ్బంది పడాల్సిందే. దర్శకుడు రాహుల్ సదాశివన్ రాసుకొన్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. మూడు పాత్రలు ఒకరిని మరోకరు చీట్ చేసుకొనే విధానాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా డైరెక్టర్ తెరకెక్కించారు. ఇక సెకండాఫ్‌లో అఖండ జ్యోతిని ఆరిపేయడం తర్వాత జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్‌గా, భయానకంగా ఉంటాయి. సినిమాను చివరి ఫ్రేమ్ వరకు నడిపించిన తీరు దర్శకుడు రాహుల్ సదాశివన్ ప్రతిభకు అద్దం పట్టింది. అయితే స్లోగా ఒకే పాయింట్‌తో కథ సాగడం.. కమర్షియల్ వాల్యూస్‌కు దూరంగా ఉండటం ఓ మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భ్రమయుగం సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి ప్రధాన బలంగా మారింది. యాక్టర్ల నటనకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో సన్నివేశాలు హై రేంజ్లో ఎలివేట్ అయ్యాయి. సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్ సినిమా మొత్తాన్ని బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించారు. ప్రతీ ఫ్రేమ్ చాలా అద్బుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. సౌండ్ డిజైన్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంలో సాయపడ్డాయి.
ప్లస్ పాయింట్స్
- కథ, స్క్రీన్‌ప్లే
- నటీనటులు
- సంగీతం
- కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
- స్లోగా సాగే కథనం
- కమర్షియల్ హంగులు లేకపోవడం
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం