ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno భారతీయ మార్కెట్లో సరికొత్త బడ్జెట్ మెుబైల్‌ను లాంచ్ చేసింది. Tecno Spark 20C పేరుతో ఈ మెుబైల్‌ను విడుదల చేసింది. వాస్తవానికి గతేడాది నవంబర్లోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో విడుదలైంది. వినియోగదారుల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ రావడంతో ఈ ఫోన్‌పై భారత టెక్ ప్రియుల దృష్టి పడింది. తక్కువ బడ్జెట్లో అడ్వాన్స్డ్ ఫోన్‌ను కొనాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది టెక్నో వర్గాలు వెల్లడించాయి. ఖరీదైన ఫోన్లో ఉండే ఫీచర్లు అన్ని ఇందులో ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ధర, ఫీచర్లు తదితర అంశాలపై ఓ లుక్కేద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ Tecno Spark 20C మెుబైల్.. 6.56 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో లాంచ్ అయ్యింది. దీనికి 720×1,612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13 ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Helio G36 SoC ప్రొసెసర్‌పై పని చేస్తుంది.
ర్యామ్ & స్టోరేజ్
Tecno Spark 20C డివైజ్ 8GB RAMతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB వర్చువల్ ర్యామ్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16GB వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా
ఈ టెక్నో మెుబైల్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED Flash ఉంది. ఈ కెమెరా ద్వారా 1080P టైమ్ ల్యాప్స్ వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి.
బిగ్ బ్యాటరీ
ఈ Tecno Spark 20Cలో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 50 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది.
కనెక్టివిటీ ఫీచర్లు
Tecno Spark 20C మెుబైల్.. 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయదు. డ్యూయల్ సిమ్, 4G, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టిటివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే IPX 2 రేటింగ్, డ్యూయల్ DTS స్టీరియో స్పీకర్స్, హైపర్ఇంజిన్ 2.0 ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
ఈ టెక్నో మెుబైల్ నాలుగు కలర్ వేరింయట్లను కలిగి ఉంది. ఆల్పెన్‌గ్లో గోల్డ్ (Alpenglow Gold), మిస్టరీ వైట్ (Mystery White), గ్రావిటీ బ్లాక్ (Gravity Black), మ్యాజిక్ స్కిన్ (Magic Skin colours) రంగుల్లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు.
ధర ఎంతంటే?
Tecno Spark 20C మెుబైల్ నిన్ననే భారత మార్కెట్లో లాంచ్ కాాగా.. దీని సేల్స్ మార్చి 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి (Tecno Spark 20C sale Date) ప్రారంభం కానుంది. ఈ మెుబైల్ 8GB RAM +128GB ROM ధరను కంపెనీ రూ.8,999గా నిర్ణయించింది. లాంచ్ ఆఫర్ కింద సంస్థ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!