ప్రముఖ టెక్ కంపెనీ ఐటెల్ (Itel).. స్మార్ట్ఫోన్లతో పాటు ఫీచర్ మెుబైల్స్‌ను తయారు చేస్తూ భారత్‌లో మంచి గుర్తింపు సంపాదించింది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఫోన్లను లాంచ్ చేస్తుండటంతో ఐటెల్ మెుబైల్స్‌పై టెక్ ప్రియు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ మార్కెట్లో సరికొత్త ఎంట్రీ లెవెల్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. itel P55T పేరుతో నిన్న (ఫిబ్రవరి 28) కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్) తో వచ్చిన ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ itel P55T కావడం విశేషం. అయితే రీసెంట్గా ఈ మెుబైల్ ప్రైస్ రేంజ్‌లోనే Tecno Spark 20C లాంచ్ అయ్యింది. ఫీచర్ల ప్రకారం ఈ రెండు పోన్లలో ఏది బెటరో ఇప్పుడు పరిశీలిద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ itel P55T మెుబైల్.. 6.56 అంగుళాల HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంది. దీనికి 720 x 1,640 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్‌ను అందించారు. అలాగే డైనమిక్ బార్ నోటిఫికేషన్స్ ఫీచర్ కూడా ఈ ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ 14 (గో ఎడిషన్), Unisoc T606 SoC ప్రొసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. అటు Tecno Spark 20C మెుబైల్.. 6.56 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో లాంచ్ అయ్యింది. దీనికి 720×1,612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480 నిట్స్ బ్రైట్నెస్ అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13 ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Helio G36 SoC ప్రొసెసర్‌పై పని చేస్తుంది. స్క్రీన్ సైజ్ పరంగా ఈ రెండు మెుబైల్స్ ఒకటే అయినా.. అడ్వాన్స్డ్ OSతో Itel P55T కాస్త బెటర్‌గా కనిపిస్తోంది.
ర్యామ్ & స్టోరేజీ
Itel P55T డివైజ్.. 4GB RAMతో వచ్చింది. డైనమిక్ ఫీచర్ కింద ఈ 4GB RAMను 8GB వరకూ వర్చువల్ పెంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. ఇక ఈ మెుబైల్ 128GB స్టోరేజీని కలిగి ఉంది. microSD కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకునే వీలుంది. అటు Tecno Spark 20C డివైజ్ 8GB RAMతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8GB వర్చువల్ ర్యామ్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16GB వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. మెమొరీ కార్డ్ సాయంతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
కెమెరా
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో భారత్‌లో అడుగుపెట్టింది. ఇందులో 50MP ప్రైమరి కెమెరా, AI సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED Flash ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ Tecno Spark 20C మెుబైల్లోనూ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED Flash ఉంది. ఈ కెమెరా ద్వారా 1080P టైమ్ ల్యాప్స్ వీడియోలను రికార్డు చేయవచ్చు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్లో 8MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. కెమెరా క్వాలిటీ పరంగా ఈ రెండు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి.
బ్యాటరీ
Itel P55Tలో పవర్ బ్యాకప్ కోసం 6,000 mAh భారీ బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా మెుబైల్‌ను ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. సాధారణ యూజింగ్ ద్వారా 145 రోజుల బ్యాటరీ లైఫ్ పొందవచ్చని పేర్కొన్నాయి. ఇక చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ కోసం ఈ ఐటెల్ ఫోన్లో USB Type-C పోర్ట్ ఇచ్చారు. మరోవైపు Tecno Spark 20Cలో పవర్ బ్యాకప్ కోసం 5,000 mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 50 నిమిషాల్లో ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. బ్యాటరీ పరంగా చూస్తే Itel P55T బెస్ట్ ఛాయిస్లాగా కనిపిస్తోంది.
కనెక్టివిటీ ఫీచర్
ఈ మెుబైల్ 4G నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్టు చేస్తుంది. ఇందులో Wi-Fi 802.11 ac/a/b/g/n, Bluetooth, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ-దిక్సూచి, గైరోస్కోప్, భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్‌కు అందించారు. అటు Tecno Spark 20C మెుబైల్ కూడా 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయదు. డ్యూయల్ సిమ్, 4G, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టిటివిటీ ఫీచర్లను ఇదీ కలిగి ఉంది. అలాగే IPX 2 రేటింగ్, డ్యూయల్ DTS స్టీరియో స్పీకర్స్, హైపర్ఇంజిన్ 2.0 ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
Itel P55T మెుత్తం మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. బ్రిలియంట్ గోల్డ్ (Brilliant Gold), అరోరా బ్లూ (Arora Blue), ఆస్ట్రల్ బ్లాక్ (Astral Black) కలర్ ఆప్షన్స్‌లో మెుబైల్‌ను పొందవచ్చు. ఈ Tecno Spark 20C మెుబైల్ నాలుగు కలర్ వేరియంట్లను కలిగి ఉంది. ఆల్పెన్‌గ్లో గోల్డ్ (Alpenglow Gold), మిస్టరీ వైట్ (Mystery White), గ్రావిటీ బ్లాక్ (Gravity Black), మ్యాజిక్ స్కిన్ (Magic Skin colours) రంగుల్లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు. కలర్స్ పరంగా చూస్తే టెక్నో మెుబైల్ ఆకట్టుకుంటోంది.
ధర ఎంతంటే?
itel P55T మెుబైల్ (4GB RAM + 128GB) ధరను కంపెనీ రూ.8,199గా నిర్ణయించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‌లోకి వచ్చింది. పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. Tecno Spark 20C మెుబైల్ రెండ్రోజుల క్రితం భారత మార్కెట్లో లాంచ్ కాాగా.. దీని సేల్స్ మార్చి 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి (Tecno Spark 20C sale Date) ప్రారంభం కానుంది. ఈ మెుబైల్ 8GB RAM +128GB ROM ధరను కంపెనీ రూ.8,999గా నిర్ణయించింది. లాంచ్ ఆఫర్ కింద సంస్థ రూ.1000 తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7,999కే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఏది కొంటే బెటర్!
బడ్జెట్, ఫీచర్లు పరంగా చూస్తే రెండు ఫోన్లు సమానంగానే ఉన్నాయి. అయితే OS, ప్రొసెసర్ పరంగా చూస్తే తాజాగా వచ్చిన Itel P55T బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. Tecno Spark 20C మెుబైల్‌తో పోలిస్తే ఇందులో బ్యాటరీ సామర్థ్యం కూడా ఎక్కువే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!