నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, సత్తన్న తదితరులు
దర్శకత్వం : కేవీఆర్ మహేంద్ర
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
నిర్మాత : పాయల్ సరాఫ్
నిర్మాణ సంస్థ : పీఆర్ ఫిల్మ్స్
విడుదల తేదీ: ఏప్రిల్ 5, 2024
కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా?
కథేంటి
రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్ మీనాక్షి గోస్వామితో అతడి లవ్ ట్రాక్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే?
హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్ కూడా పెద్ద సింక్ కాలేదు. హీరోయిన్ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు.
ప్లస్ పాయింట్స్
- వైవా హర్ష కామెడీ
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
- రొటిన్ స్టోరీ
- సందర్భానుసారంగా లేని సీన్లు
- సంగీతం
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!