• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Keerthi Suresh Wedding: కీర్తి పెట్టిన ఆ హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం తెలుసా?

    స్టార్‌ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి (Keerthi Suresh Wedding) ఘనంగా జరిగింది. తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ (Antony Thattil)ను ఆమె బంధుమిత్రుల సమక్షంలో పెళ్లాడింది.

    గురువారం (డిసెంబర్‌ 12) గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం కీర్తి – ఆంటోని వివాహం జరిగింది. 

    ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. కొత్త వధూవరులను వారు ఆశీర్వదించారు. 

    పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కీర్తి సురేష్‌ స్వయంగా పంచుకుంది. దీనికి #ForTheLoveOfNyke అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చింది. 

    ఆంటోని తట్టిల్‌ తాళి (Keerthi Suresh Wedding) కడుతున్న ఫొటోను సైతం కీర్తి పంచుకుంది. మూడు ముళ్లు వేస్తున్న క్రమంలో ఆమె ఎంతో సంతోషంగా కనిపించింది. 

    ప్రస్తుతం కీర్తి సురేష్‌ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

    స్టార్ హీరోయిన్స్‌ హన్సిక, ప్రియాంక మోహన్‌, సంయుక్త, రాశిఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కీర్తి సురేష్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

    ప్రస్తుతం కీర్తి ఫొటోలతో పాటు  హ్యాష్‌ట్యాగ్‌ కూడా నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఆమె పెట్టిన #ForTheLoveOfNyke హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం ఏంటా అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. 

    హ్యాష్‌ట్యాగ్‌లోని చివరి పదం ‘Nyke’ అని ఉంది. దీని ప్రకారం భర్త అంటోనీ ఇంగ్లీషులో ‘NY’తో ముగుస్తుంది. అలాగే కీర్తి పేరు ‘KE’తో మెుదలవుతుంది. ఈ రెండిటిని కలిపి ‘Nyke’ అని పెట్టి ఉండొచ్చని సమాచారం. 

    లేదంటే అంటోనిని ముద్దుగా నైక్‌ (Nyke) అని కీర్తి పిలుస్తుండొచ్చని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం #ForTheLoveOfNyke హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. 

    ఇదిలా ఉంటే కీర్తి సురేశ్‌ – ఆంటోనీ (Keerthi Suresh – Antony Thattil Wedding) దాదాపు 15 ఏళ్ల నుంచి స్నేహితులు. ఇదే విషయాన్ని ఇటీవల ఆమె అధికారికంగా చెప్పారు. 

    దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. 

    ఆంటోనీ (Antony Thattil)ది వ్యాపార కుటుంబం. కొచ్చి, చెన్నైలలో వ్యాపారాలున్నాయి. స్కూల్‌ డేస్‌ నుంచి కీర్తితో ఆయనకు పరిచయం ఉంది. 

    కాలేజీ రోజుల్లో ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అప్పటినుంచి ఆంటోని-కీర్తి ఒకరికొకరు ప్రేమలో ఉన్నారని కథనాలు వచ్చాయి.

    కీర్తి సురేష్‌  (Keerthi Suresh Wedding)  సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె ‘రఘుతాత’ చిత్రంతో ప్రేక్షకులను పలకించారు. ఆ మూవీ యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. 

    ప్రస్తుతం ఆమె ‘రివాల్వర్‌ రీటా’, ‘బేబీ జాన్‌’ చిత్ర పనుల్లో బిజీగా ఉంది. ‘బేబీజాన్‌’ చిత్రం ద్వారానే ఆమె తొలిసారి హిందీలో అడుగుపెట్టింది. 

    బేబీ జాన్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించాడు. క్రిస్మస్‌ కానుకగా ఈ నెల డిసెంబర్‌ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv