అల్లరి నరేశ్ జూన్ 30, 1982న మద్రాసులో జన్మించాడు. ఆయన తండ్రి ప్రముఖ దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. వారి సొంత గ్రామం పశ్చిమగోవావరి జిల్లా, కోరుమామిడి . అల్లరి నరేశ్ సోదరుడు ఆర్యన్ రాజేశ్. ఆయన కూడా గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు. నరేశ్ ప్రాథమిక విద్యాబ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. నరేశ్ తండ్రితో పాటు షూటింగ్‌లకు వెళ్లి సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్లతో కలిసి పనిచేసేవాడు. ఈవీవీ మొదట రాజేశ్‌ను హీరోగా నరేశ్‌ను దర్శకుడిగా చేయాలనకున్నాడు. కానీ అల్లరి నరేశ్‌కు హీరో కావాలని కోరిక ఉండేది.
సినిమా కెరీర్
ఈవీవీ నిర్మాతగా వ్యవహరించిన చాలాబాగుంది సినిమా ఫంక్షన్‌కు వచ్చిన అమితాబ్ అల్లరి నరేశ్‌ను చూసి చాలా హైట్ ఉన్నాడు. హీరోను చేయండి అని ఈవీవికి చెప్పాడట. ఇక అప్పటినుంచి హీరో కావాలనే కోరిక బలపడిందట. 2002లో రవిబాబు మొదటిసారి దర్శకత్వం వహించిన సినిమాలో అల్లరి నరేశ్‌ను హీరోగా పెట్టి అల్లరి సినిమా చేశాడు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత నరేశ్ పేరు అల్లరి నరేశ్‌గా మారిపోయింది. అదే ఏడాది తొట్టిగ్యాంగ్, దనలక్ష్మీ ఐలవ్యూ సినిమాలు కూడా సక్సెస్ కావడంతో నరేశ్ హ్యాట్రిక్ కొట్టాడు.
వైఫల్యాలు
2004లో నేను సినిమాలో సైకో ప్రేమికుడి పాత్రలో నటించాడు. అది విజయం సాధించలేదు. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మూడు నెలలు ఎవరితో మాట్లాడలేదట. తన తండ్రి ఈవీవీ ఇచ్చిన మోటివేషన్‌తో 2005లో నువ్వంటే నాకిష్టం సినిమా చేశాడు. కానీ అదికూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన డేంజర్, పార్టీ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
విజయాలు
2007 లో ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన కితకితతలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది రూ.80 లక్షలతో సినిమా తీస్తే రూ. 8 కోట్లులాభం వచ్చిందట. ఆ తర్వాత గోపీ గోడమీద పిల్లి, సుందరకాండ, సీమశాస్త్రి , పెళ్లయింది కానీ వంటి వరుస సినిమాలతో కామెడీ హీరోగా జూనియర్ రాజేంద్రప్రసాద్ అనే పేరు తెచ్చుకున్నాడు. క్రిష్ గమ్యం నరేశ్ గమ్యాన్ని మార్చేసింది. ఆ సినిమాలో గాలిశీనుగా నరేశ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. గమ్యం సినిమాకుగాను నంది అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించాడు. ఆ తర్వాత శంభో శివ శంభో, నాంది వంటి సినిమాలు అల్లరి నరేశ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు
2008లో ఒకే ఏడాదిలో మొత్తం 8 సినిమాలు చేశాడు. 2010 లో 7 సినిమాలు, 2011లో 5 సనిమాలు ఇలా తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. ఇంత తక్కువ కాలంలో అన్ని సినిమాలు అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణ లాంటి వాళ్లు చేసే ఈ జనరేషన్ నరేశ్ మాత్రమే చేయగలిగాడు.
తండ్రి దర్శకత్వంలో నటించిన సినిమాలు
అల్లరి నరేశ్ తన తండ్రి ఈవీవీ సత్యనారణయణ దర్శకత్వంలో కితకితతలు, కత్తి కాంతారావు, బెండు అప్పారావు, ఫిట్టింగ్ మాస్టర్, అత్తిలి సత్తిబాబు, పెళ్లయింది కానీ, నువ్వంటే నాకిష్టం, మా అల్లుడు వెరీగుడ్, తొట్టి గ్యాంగ్ వంటి 9 సినిమాలు చేస్తే అందులో 7 సినిమాలు సక్సెస్ సాధించాయి.
గుర్తుండిపోయే సినిమాలు
- గమ్యం
- శంభో శివ శంబో
- నాంది
- అల్లరి
- కితకితతలు
వివాహం
2015లో విరూపను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక పాప ఉంది. తన తండ్రి పేరు కలిసొచ్చేలా ఆమెకు ఇవికా అనే పేరు పెట్టారు.
#NARESH59
ప్రస్తుతం అల్లరి నరేశ్ 59వ సినిమా ఇట్లు మారేడుమల్లి ప్రజానీకంలో నటిస్తున్నాడు. ఆనంది హీరోయిన్గా నటిస్తుంది. ఈ పొలిటికల్ డ్రామాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. జీ స్టూడియోస్, హాస్మ మూవీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Celebrities Featured Articles
Vijay Devarakonda: ‘ప్రేమిస్తే బాధ భరించాల్సిందే’.. విజయ్ కామెంట్స్ రష్మిక గురించేనా?