Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ

    Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ

    December 7, 2024
    allu arjun

    Courtesy Twitter: Trends Allu Arjun

    పాన్ ఇండియా లెవల్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచిన పుష్ప 2  సినిమా సక్సెస్ మీట్‌లో హీరో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “సినిమా విజయానికి ప్రధాన కారకులు దర్శకుడు. నాకు పేరు వచ్చినా, ఇతర నటీనటులు గుర్తింపు పొందినా ఆ క్రెడిట్ మొత్తం సుకుమార్‌కు చెందుతుంది. నా పాత్రకు ఎంత ప్రశంసలు వచ్చినా, అవన్నీ ఆయన చేసిన డిజైన్ వల్లనే సాధ్యమయ్యాయి,” అని చెప్పుకొచ్చారు.

    ఆయన మరింత ఆసక్తికరంగా మాట్లాడుతూ, “ఈ రోజు ఇక్కడ నేను ఉండగలగడం సుకుమార్ గారి ప్రేమ కారణం. ఇంతకంటే నేను మరేం చెప్పగలను? డార్లింగ్” అంటూ సుకుమార్‌ను ప్రశంసించారు. ఇక తన ప్రసంగంలో అల్లు అర్జున్, “నాకు సినిమా కలెక్షన్ల గురించిపెద్దగా నంబర్లు గుర్తులేవు. కానీ ఈ సినిమా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు.

    పవన్ కళ్యాణ్ మామయ్యకు కృతజ్ఞతలు

    అల్లు అర్జున్ తన ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, “మా సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారికీ ప్రత్యేక కృతజ్ఞతలు,” అని అన్నారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అభినందనలు తెలిపారు. “సినీ పరిశ్రమపై మీ ప్రేమ ఎప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది,” అని కొనియాడారు.

    ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రస్తావిస్తూ, “ఈ ప్రత్యేక జీవోకి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. పర్సనల్‌గా కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్యూ సో మచ్!” అంటూ చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలతో కొన్ని రోజులుగా అల్లు Vs మెగా ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్‌కు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

    ఇది వివాదం! 

    గత కొంతకాలంగా అల్లు అర్జున్ అభిమానులు – పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఓ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని కోరగా, “చెప్పను బ్రదర్,” అని చెప్పిన అల్లు అర్జున్ వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఇక ఇటీవలే ఏపీ  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి పర్సనల్‌గా వెళ్లి అల్లు అర్జున్  మద్దతు ఇవ్వడంతో ఈ వివాదం మరింత పెరిగింది.

    ఫ్యాన్స్‌కు బన్నీ సందేశం

    అయితే ఇప్పుడు సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ పేరు స్పెషల్‌గా ప్రస్తావిస్తూ “కళ్యాణ్ బాబాయ్” అని చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్స్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలకు తావులేదనే విషయాన్ని అభిమానుల్లోకి స్పష్టంగా తీసుకెళ్తుందని  పలువురు అభిప్రాయపడుతున్నారు.

    సోషల్ మీడియాలో కొన్ని మాటల వలన అభిమానుల మధ్య వివాదాలు ఎక్కువయ్యాయి. కానీ ఈ సక్సెస్ మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు అభిమానుల మనసును దోచుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినిమా టీమ్‌కి, తన ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు చెప్పిన అల్లు అర్జున్, టికెట్ ధరల పెంపు నిర్ణయంపై కూడా అభినందనలు తెలిపారు.

    అల్లు అర్జున్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య వివాదాలకు ఎప్పటికైనా ముగింపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బన్నీ చేసిన కామెంట్లు అభిమానుల మధ్య చర్చకు దారి తీసి వివాదాలు తగ్గుతాయని అంతా ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే, పుష్ప విజయాన్ని మించిపోయేలా బన్నీ మాటలు అభిమానుల హృదయాలను దోచుకున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version