• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులి తోక పట్టుకున్న సంతానం

    తమిళ కమెడియన్ సంతానం ఓ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇందుకు కారణం.. ఆయన ట్విటర్‌లో చేసిన పోస్టు. పడుకున్న పులి తోకను పట్టుకుని ఉన్న వీడియోను సంతానం షేర్ చేస్తూ.. ‘పులి తోక పట్టుకోవడం అంటే ఇదే కదా’ అని రాసుకొచ్చాడు. అయితే, ఇదే వీడియోలో మరో వ్యక్తి పులిని హింసిస్తున్నట్లు కనిపించింది. పులి తలపై ఓ కర్రతో కొట్టి లేపడం వీడియోలో రికార్డైంది. దీంతో సంతానంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులను ఎలా చూసుకోవాలో తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పర్యటించే సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలంటూ మరికొందరు ఘాటుగానే బదులిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv