• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాట్‌ ఫొటోస్‌తో సెగలు పుట్టిస్తున్న రష్మిక

    నేషనల్ క్రష్ రష్మిక మంధాన్న హాట్‌ ఫొటోషూట్‌తో సెగలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తుల్లో ఎద అందాలు ప్రదర్శిస్తూ ఫ్యాన్స్‌కు మత్తెక్కిస్తోంది ఈ అమ్మడు. ఇటీవల చాలా రోజుల తర్వాత ఫొటో షూట్‌లో పాల్గొంది. వివిధ యాంగిల్స్‌లో హాట్ ఫోజులిచ్చి అదరగొట్టింది రష్మిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ హాట్‌ బ్యూటీ రోజురోజుకి గ్లామర్ డోసు పెంచుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అందాల తార అల్లు అర్జున్‌తో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. Screengrab Instagram:rashmika_mandanna … Read more

    నన్ను తొక్కేయాలని చూస్తున్నారు : కిరణ్ అబ్బవరం

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డారు. “ ట్విటర్‌లో కొన్ని బ్యాచ్‌లు తయారవుతున్నాయి. నన్ను తొక్కేయాలని చూస్తున్నారు. సినిమా బాగున్నా ఫ్లాప్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ ఏం లేదు. ఇక్కడ పెద్ద పెద్దోళ్లు అంతా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీరే ఇలా చేస్తున్నారు. నన్ను మీరు ఇంటికి పంపించేద్దాం అనుకున్నా నేను వెళ్లను” అన్నారు.

    మరో వివాదంలో చిక్కుకున్న మంగ్లీ

    పాపులర్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. మహా శివరాత్రి పురస్కరించుకొని భం భం భోలే సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీకాలహస్తీలోని కాలభైరవ ఆలయంలో చిత్రీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆలయం లోపల వీడియోలు, ఫొటోలు అనుమతించ లేదు. అలాంటింది ఏకంగా గర్భగుడిలోనే మంగ్లీ అండ్ టీం షూటింగ్‌ను పూర్తి చేసింది. దీనిపై కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వారికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో చిత్రీకరించారని తెలుస్తోంది.

    నడిరోడ్డుపై కత్తులతో దాడి

    పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో [దారుణం](url) జరిగింది. 50 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏం చేయలేక పారిపోయారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడే కుప్ప కూలింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఓ హత్య కేసుకు సంబంధించి ఆమె వాంగ్మూలం చెప్పి వస్తుండగా ఘటన జరిగిందని తెలుస్తోంది. మహిళ నడుస్తూ వెళ్తుండగా వెనుక నుంచి దాడి చేశారు. ఇద్దరు పోలీసులు కారులో పారిపోయారని స్థానికులు చెబుతున్నారు. Shameful! … Read more

    26/11 ఉగ్రవాదులు లాహోర్‌లోనే ఉన్నారు కదా

    ప్రముఖ సినీ, గేయ రచయిత జావెద్ అక్తర్.. పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే [విమర్శలు ](url)చేశారు. 26/11 ఉగ్రపేలుళ్ల ఘటనకు పాల్పడిన ఉగ్రవాదాలు ఇంకా లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ ఆరోపించారు. ఇటీవల లాహోర్‌లో పర్యటించిన ఆయన భారత్, పాక్ సంబంధాలు, ముంబయి ఉగ్రదాడిని ప్రస్తావించారు. “ మేం ముంబయి వాసులం. మా నగరంలో భీభత్సం సృష్టించారో అందరికీ తెలుసు. వారు ఎక్కడ్నుంచి వచ్చిన వారో కాదు. ఇక్కడే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై భారత్ ఫిర్యాదు చేస్తే మీరు ప్రతికూలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు” అన్నారు. Javed … Read more

    ఆస్పత్రిబెడ్‌పై యువతికి తాళికట్టిన వరుడు

    [VIDEO:](url) మధ్యప్రదేశ్‌లో ఓ వివాహం సినిమా సన్నివేశాన్ని తలపించింది. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువును వివాహామాడాడు వరుడు. ఉజ్జయిని భేర్‌ఘాట్‌కు చెందిన రాజేంద్రకు జుల్వానియా వాసి శివానితో పెళ్లి నిశ్చయమయ్యింది. బంధువుల సౌకర్యార్థం ఖాండ్వాలో వివాహం జరిపించాలని నిర్ణయించారు. ఇంతలోనే వధువు ప్రమాదానికి గురై కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆమెకు అండగా నిలవాలనుకున్న వరుడు రాజేంద్ర.. ఆస్పత్రిలోనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. జనరల్ వార్డునే ఫంక్షన్‌హాల్‌లా మార్చారు. दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने … Read more

    భోళా శంకర్ లుక్ అదుర్స్

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రబృందం శివరాత్రి సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. ఇందులో చిరంజీవి తాండవం ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. చిరు సరసన తమన్నా కథానాయికగా చేస్తోంది. కీర్తి సురేశ్‌ చెల్లిగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

    వన్‌ మినట్‌ సారీ కాన్సెప్ట్‌

    అమ్మాయిలు చీరలో అందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం చాలామందికి చీరకట్టుకోవడం రావట్లేదు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ వన్ మినట్ సారీ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. భారత సంతతికి చెందిన సాషా రవిశంకర్.. గోవాలో జరిగిన ఇండియా బీచ్ ఫ్యాషన్‌ వీక్ కార్యక్రమంలో… చీరకట్టుకు సంబంధించి 14 లుక్స్‌ను ప్రదర్శించారు. “ అందరికీ అనువుగా ఉండే విధంగా ప్రత్యేకించి ప్రస్తుత జనవరేషన్ సులభంగా చీర ధరించేందుకు వన్ మినట్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. దీనివల్ల ఎవరి సహాయం లేకుండా చీరకట్టులో సిద్దం కావచ్చు … Read more

    సిగరెట్‌తో అల్లుడికి ఆహ్వానం

    [VIDEO:](url) పెళ్లిలో సంప్రదాయాలు పాటించడం సహజం. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలను కూడా కొనసాగిస్తుంటారు. ఇక పెళ్లి కుమారుడిని సాధారణంగా టపాసులు, నృత్యాలు , హారతులిచ్చి తీసుకువస్తారు. కానీ, అహ్మదాబాద్‌లో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వివాహ వేడుకలో పెళ్లి కుమారుడికి సిగరెట్ ఇచ్చి దాన్ని వెలిగించి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. ఇదెక్కడి ఆచారం అంటూ కామెంట్ చేస్తున్నారు. https://www.instagram.com/reel/CoWXyUPDIOr/?utm_source=ig_embed&ig_rid=4a217fb8-9d59-4a6b-b807-31164b56d355 Screengrab Instagram: Joohi K Patel Screengrab Instagram: Joohi K … Read more

    నా కొడుకుని చూసి గర్వ పడుతున్నా: కేటీఆర్‌

    కేటీఆర్ తనయుడు హిమాన్షు ఇటీవల వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తన టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం తన తాతయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా యూట్యూబ్‌లో ఓ కవర్‌ సాంగ్‌ను విడుదల చేశారు. గోల్డెన్ అవర్ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదిక ద్వారా పంచుకున్నారు. తన కుమారుడు చేసిన పని పట్ల గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ పాట నాకు నచ్చిందని.. మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.