• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాబర్‌ వైపు కావాలని బాల్ విసరలేదు: అమీర్

    పాకిస్థాన్‌ ప్రీమియర్ లీగ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం వైపు బాల్ [విసిరిన](url) సంఘటనపై పేసర్ మహ్మద్ అమీర్ స్పందించాడు. “ అది ఆట రసవత్తరంగా ఉన్నప్పుడు జరిగింది. వ్యక్తిగతంగా తీసుకోవటానికి ఏమి లేదు. బాబర్‌పై కావాలని చేసింది కాదు. మైదానంలో బౌలర్లు కాస్త దూకుడుగా ఉండాలి. అప్పుడే మంచి ఆటతీరు కనబర్చగలం. నేను ఆ మ్యాచ్‌లో ఒత్తిడిలో ఉన్నాను. అది ఈ లీగ్‌ ప్రత్యేకత. ఇది మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది” అన్నాడు. కరాచీ, పెషావర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అమీర్‌ ప్రవర్తనపై కాస్త విమర్శలు … Read more

    కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ సూపర్ [క్యాచ్](url) పట్టాడు. జడేజా బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవటంతో కేఎల్ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న ఖవాజా సూపర్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది. 125 బంతులు ఆడిన అతడు 81 పరుగులు చేశాడు. కీలక సమయంలో స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పిన రాహుల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ … Read more

    హీరోకు ముద్దుపెట్టబోయిన ఫ్యాన్

    బాలీవుడ్ హీరో ఆదిత్యా రాయ్ కపూర్‌కి ఊహించని సంఘటన ఎదురయ్యింది. అతడితో ఫొటో దిగేందుకు వచ్చిన మహిళ ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. నైట్‌ మేనేజర్ వెబ్‌ సిరీస్‌లో నటించిన ఆదిత్యా స్క్రీనింగ్ అనంతరం ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. పలువురు ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని సెల్ఫీ అడిగింది. ఫొటో తీసుకున్న తర్వాత కౌగిలించుకొని ముద్దు పెట్టడానికి ప్రయత్నించింది. షాక్ తిన్న రాయ్ నవ్వుతూనే ఆమెను ఆపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. https://www.instagram.com/p/CosRJC9IFUk/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again Screengrab Instagram:varindertchawla Screengrab … Read more

    పెంపుడు కుక్కలతో ఉల్లాసంగా గడిపిన సచిన్

    క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ తన పెంపుడు కుక్కలతో సమయాన్ని ఆస్వాదించాడు. రెండు శునకాలతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపాడు. ఇవి లేకుండా ఇళ్లు అసలు ఇళ్లులా ఉండదంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇన్‌స్టా గ్రామ్‌లో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి సచిన్ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. తనకు సంబంధించిన వీడియోలన్నీ అభిమానులతో పంచుకుంటారు. https://www.instagram.com/reel/CorujdRARe3/?utm_source=ig_embed&ig_rid=ca618c94-1136-48af-9e98-ef9665ad4393 Screengrab Instagram:sachintendulkar Screengrab Instagram:sachintendulkar

    గౌరి జి. కిషన్ లుక్స్ అదుర్స్‌

    టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ గౌరి జి. కిషన్‌ అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం సంతోష్‌ శోభన్ హీరోగా తెరకెక్కిన శ్రేదేవి శోభన్‌బాబు చిత్రంలో నటించింది. సినిమాకు ప్రశాంత్ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మించారు. చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ముచ్చటించే ముందు గౌరి జి. కిషన్ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. Screengrab Twitter:shreyasgroup Screengrab Twitter:shreyasgroup Screengrab Twitter:shreyasgroup Screengrab Twitter:shreyasgroup

    రానా నాయుడు ట్రైలర్ విడుదల

    వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలవుతున్న ఈ సిరీస్‌కు సంబంధించిన [ట్రైలర్](url) విడుదల అయ్యింది. ముంబయిలో ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుండగా… వెంకీమామ లుక్ ఆకట్టుకుంటోంది. రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ మార్చి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇద్దరు టాప్‌ హీరోస్‌ ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. Rana and Venky Mama dhee konte choodalanna, ee feeling Rana Naidu vasthe kaani thaggela ledhu! … Read more

    కోహ్లీ, ధోని ఫ్రెండ్‌షిప్‌ వీడియో వైరల్

    బీసీసీఐ సెలెక్టర్ చేతన శర్మ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన వేళ రన్‌ మెషిన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోహ్లీకి మద్దతుగా నిలిచిన వీడియో చక్కర్లు కొడుతోంది. 2014 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉంటాడు. విజయానికి కూడా అంతే అవసరం ఉండటంతో స్టైకింగ్‌లో ఉన్న ధోని బాల్‌ను డిఫెండ్ చేస్తాడు. అది చూసి కోహ్లీ ఎందుకు ఇలా చేశావనే విధంగా నవ్వుతాడు. … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి లవ్ ట్రాక్

    యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర జంటగా నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి మరో సాంగ్ వచ్చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా లవ్‌ ట్రాక్‌ను విడుదల చేశారు. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే అంటూ సాగే పాట అలరిస్తోంది. హీరోయిన్ వెంట పడుతూ హీరో పాడుతున్నట్లు ఉంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. సినిమాలో మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. https://youtube.com/watch?v=EjzfkqfmUo

    ప్రేమ అంటే రొమాన్స్ కాదు: సంయుక్త

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హీరోయిన్ సంయుక్త. బీమ్లా నాయక్, బింబిసారతో హిట్ అందుకున్న ఈ అమ్మడు… ధనుష్ సార్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలను షేర్ చేసుకుంది. ప్రేమ గురించి అభిప్రాయం అడగ్గా..” విశ్వంలో ప్రతిదీ ప్రేమతో నిండి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే రొమాన్స్ అనుకుంటున్నారు. కానీ, అది తప్పు. ఎప్పటికైనా నన్ను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అని పేర్కొంది. Screengrab Twitter:iamsamyuktha Screengrab Twitter:iamsamyuktha

    ఓరి వారి నీది గాదురా పోరి అంటున్న నాని

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ప్రేమికుల రోజు సందర్భంగా సినిమాలోని బ్రేకప్ సాంగ్‌ను విడుదల చేసింది. ఓరి వారి నీది గాదురా పోరి.. ఇడిసెయ్ అంటూ సాగే ఈ విరహా గీతాన్ని శ్రీమణి రచించగా సంతోష్ నారాయణ్ అద్భుతంగా ఆలపించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. దసరా చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయికగా నటిస్తుంది. మార్చి 30న సినిమా విడుదల అవుతుంది. https://youtube.com/watch?v=2xeclPw5YBA%26t%3D128s