• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లుక్స్‌తోనే మతి పోగొడుతున్న అనికా

    తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఓ హీరోయిన్ హాట్ టాపిక్. బుట్టబొమ్మ ద్వారా హీరోయిన్‌గా మారిన అనికా సురేంద్రన్‌ సూపర్‌ లుక్‌లో అదరగొడుతోంది. కుర్రాళ్ల మతి పోగెట్టేలా లుక్స్‌తోనే ఆకట్టుకుంటోంది అమ్మడు. తమిళ్‌ సినిమాల్లో నటించిన అనికా… ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగులో నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ చిత్రంలోనూ కీలకమైన పాత్రలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. Screengrab Instagram:anikharamachandran Screengrab Instagram:anikharamachandran

    బైక్‌పై జంట రొమాన్స్‌, ఈసారి?

    బైక్‌పై రొమాన్స్‌ చేస్తున్న జంటలు పెరిగిపోతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అజ్మీర్‌లోని రీజనల్ కాలేజ్‌ క్రాస్ రోడ్స్ నుంచి నౌసూర్ వ్యాలీ రోడ్డు మధ్య ఓ ప్రేమ జంట ద్విచక్రవాహనంపై వెళుతూ రొమాన్స్ చేసుకున్నారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు కౌగిలించుకుని కూర్చుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. अजमेर में बाइक पर दिखी अश्लीलता,आशिकों ने लांगी बेशर्मी की हदेंपुष्कर रोड का … Read more

    బుడతడి వీడియో వైరల్

    సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఓ బుడతడి వీడియో వైరల్ అయ్యింది. పక్షులకు గిన్నెలోని ఆహారాన్ని తీసి వాటికి తినిపిస్తున్నాడు. పక్షులు కూడా ఎలాంటి భయం లేకుండా తినడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ప్రపంచంలో తాము ఒంటరిగా ఉన్నామని భావించే వారికి దయ ఆశను ఇస్తుందంటూ వాలా అప్షర్ పోస్ట్ చేశాడు. “Kindness is giving hope to those who think they are all alone in this world.” pic.twitter.com/NjlZjvxGG1 — Vala Afshar (@ValaAfshar) February 5, 2023 Screengrab Twitter:ValaAfshar … Read more

    రష్మిక మందన్నా పోస్ట్ వైరల్

    హీరోయిన్ రష్మిక మందాన్న సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. “ అందరూ ఆనందంగా ఉండండి. ఆశలు వదులుకోవద్దు. మీకు సంతోషం, శాంతి వాటంతటవే వస్తాయి. ప్రతికూలత భావాలకు జీవితం చాలా చిన్నది” అని పోస్ట్ పెట్టింది. ఇటీవల హిందీ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ… పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. ఆమెకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం వరుస వెకేషన్లతో బిజీగా ఉంది. Screengrab Twitter:rashmikamandhanna Courtesy Instagram:RashmikaMandanna

    తారక్ సినిమాలో జాన్వీ కపూర్ !

    కొరటాల శివ సినిమా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన వేళ హీరయిన్ గురించి చర్చ జరుగుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.ప్రాజెక్టుపై సంతకం చేసిందని సమాచారం. మిగతా చిత్రాలకంటే ఎన్టీఆర్‌ 30పైనే ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. డేట్స్ కూడా ఎక్కువగా కేటాయించిందని వినికిడి. మార్చిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా తెరకెక్కించనున్నారు. మెుదట్లోనే లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు. Courtesy Twitter:janvi kapoor Screengrab Instagram:

    అందాల అషికా రంగనాథ్

    అమిగోస్‌లో కల్యాణ్ రామ్ సరసన నటించిన అషికా రంగనాథ్‌ కేవలం ఒక్క పాటతో ఫేమస్ అయిపోయింది. 2016లో కన్నడ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పలుచని చీరకట్టులో అందచందాలు ప్రదర్శిస్తూ యువతను ఆకర్షించింది భామ. ప్రస్తుతం ఆమెకు పెరుగుతున్న ఇమేజ్‌ చూస్తే తెలుగులో వరుసగా ఆఫర్లు కొట్టేస్తుంది అనే చెప్పాలి. అమిగోస్ చిత్రం కనుక హిట్ సాధిస్తే అషికాకు తిరుగుండదు. Screengrab Instagram:ashikaranganath Screengrab Instagram:ashikaranganath Screengrab Instagram:ashikaranganath

    నారాయణ మూర్తిని ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం

    ఆర్ నారాయణ మూర్తి ప్రజా దర్శకుడని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. పీపుల్‌ స్టార్ తెరకెక్కించిన యూనివర్సిటీ అనే చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో నారాయణ మూర్తిని పొగుడుతూనే ఆయన్ని ఇమిటేట్ చేశారు. “ ఆయన సినిమాలో నటిస్తానని చాలాసార్లు చెప్పాను. ఏదైనా పాత్ర ఉంటే రెండ్రోజులు చేసి వెళతాను అన్నాను. రెమ్యూనరేషన్ అడగలేదు. కానీ, అడిగిన ప్రతిసారి మీరు పెద్ద స్టార్, సూపర్ యాక్టర్ అంటాడు. అంతేకానీ అవకాశం ఇవ్వలేదు” అన్నారు.

    బ్యాంకు ఉద్యోగిపై దాడి

    గుజరాత్‌లో ఓ బ్యాంకు అధికారిపై ఖాతాదారుడు దాడి చేశాడు. నడియాడ్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. లోన్ విషయంలో సమస్య రావటంతో కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది. #WATCH | An employee of the Bank of India, Nadiad branch was thrashed by a customer over the issue of a bank … Read more

    LIVE: తెలంగాణ బడ్జెట్‌

    2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రవేశ పెడుతున్నారు. రూ. 2,90,396 కోట్లతో ఆర్థిక పద్దు ప్రవేశపెట్టారు. ఆయిల్‌ పామ్ సాగుకి ప్రోత్సాహకాలు ప్రకటించారు.

    పులి, సింహం మధ్యలో క్రిష్

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌స్టార్‌ రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో దూసుకెళ్తోంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల గురించి బాలయ్య సూటి ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా అతిథిగా వచ్చాడు. తమ ఇద్దరిలో కనిపించిన తేడా ఏంటి అని ప్రశ్నించగా… పులి, సింహం మధ్యలో నా తల ఉందంటూ చమత్కరించాడు. ఏపీ సర్కారుపై, అధికారులపై జనసేనాని విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది.