• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికే విడుదలైన అమిగోస్ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. డోపుల్ గ్యాంగర్‌ అనే కథాంశంతో సినిమాను రూపొందించారు. ముగ్గురు ఒకేలా ఉంటారు కానీ, కవలలు కాదు.

    విజయ్‌ చిత్రానికి సరికొత్త టైటిల్‌

    దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం టైటిల్ ఖరారయ్యింది. తన సినిమాటిక్‌ యూనివర్స్‌లో మాస్టర్‌ తర్వాత విజయ్‌తో తెరకెక్కిస్తున్న చిత్రానికి దర్శకుడు ఎవ్వరూ ఊహించని టైటిల్‌ పెట్టాడు. సినిమాకు లియో: బ్లడీ స్వీట్‌ అనే పేరు ప్రకటించారు. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి అక్టోబర్ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా కొత్త టైటిల్ ప్రకటించి సర్‌ప్రైజ్‌ చేసిన చిత్రబృందం వీడియో కూడా విడుదల చేసింది.

    కల్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్

    కల్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయ్యింది. ఇందులో కల్యాణ్ రామ్ త్రిపాత్రిభినయం చేస్తుండగా… ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అభిమానులు అంచనాలు తగ్గట్లుగానే రూపొందించారు. డోపుల్ గ్యాంగర్ నేపథ్యంలో సాగే కథతో మరోసారి హిట్‌ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. డోపుల్ గ్యాంగర్ అంటే ఒకే పోలికతో ఉండే వ్యక్తులు.. కానీ, కవలలు కాదు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మించింది.

    పొట్టిగౌనులో ఇషా రెబ్బా

    టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరు ఇషా రెబ్బా. ఈ అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్‌ పిక్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది ఈ చిన్నది. ఇప్పుడు మరోసారి పొట్టిగౌనులో ఫొటోలు దిగి పంచుకుంది. చీరకట్టైనా, ఫ్యాన్సీ లుక్ అయినా తన అందం మాత్రం తగ్గదని చెప్పకనే చెబుతోంది ఇషా. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. Screengrab Instagram:yourseesha

    హనుమ విహారి రివర్స్ స్లాప్‌

    రంజీ ట్రోఫీలో గాయం తగిలినా జట్టుకోసం ఒంటి చేత్తో బ్యాటింగ్‌కు దిగిన హనుమ విహారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి పోరాట పటిమ గురించి చాలామందే ప్రస్తావించారు. ఆ మ్యాచ్‌లో విహారి ఆడిన ఓ షాట్‌ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాయం తగిలిన చేతికి బాల్‌ తగలకుండా సింగిల్‌ హ్యాండ్‌తో రివర్స్‌ స్వీప్‌ ఆడాడు. దీనికి దినేశ్ కార్తీక్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. అతడి రివర్స్ స్వీప్‌ కాదు రివర్స్‌ స్లాప్‌ అని పేరు పెట్టాడు. thepraneetc23

    యశ్ ఇంటి ముందు ఫ్యాన్స్ బారులు

    కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇంటిముందు [ఫ్యాన్స్](url) బారులు తీరారు. అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని నిరాశ పరచొద్దని భావించిన యశ్.. ప్రతి ఒక్కరితో ఓపికగా ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కన్నడ సూపర్‌ స్టార్ ఇప్పటివరకు కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. జనవరి 8న తన పుట్టినరోజు కూడా ఎలాంటి అప్డేట్‌ లేదు. అప్పుడు విదేశాల్లో ఉండగా.. తిరిగి రావటంతో ఫ్యాన్స్ తరలివచ్చారు. Fans Came to Meet … Read more

    కీర్తి సురేశ్‌ డ్రెస్సింగ్‌పై ట్రోల్స్‌

    దర్శకుడు వెంకీ అట్లూరి వివాహ వేడుకలో తళుక్కున మెరిసిన కీర్తి సురేశ్‌పై ట్రోల్స్‌ విపరీతంగా వస్తున్నాయి. ఆమె ధరించి దుస్తులపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఇంద్రధనస్సు నేలకు తెచ్చిందంటూ పొగుడ్తుండగా.. మరికొందరు డ్రెస్‌ సెన్స్ లేదంటూ విమర్శిస్తున్నారు. టెంట్‌ను డ్రెస్‌గా కుట్టించుకున్నావా అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఇంకొందరైతే షామియానా లెహంగా అని, అవకాశాల్లేక ఇలాంటి డ్రెస్సులు ధరిస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. Screengrab Instagram:keerthisuresh Screengrab Instagram:keerthisuresh

    లోకేశ్ పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

    తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన [యువగళం](url) పాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ ప్రచార రథాన్ని పోలీసులు సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి లోకేశ్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. లోకేశ్ ఉపయోగిస్తున్న వాహనానికి అనుమతి లేదని సీజ్ చేసిన పోలీసులు.. స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహించిన తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. కాసేపటి తర్వాత పోలీసులు రథాన్ని విడిచిపెట్టారు. ప్రచార వాహనాలను సీజ్ చేయటంతో పోలీసులను ప్రశ్నించిన … Read more

    మంచుతుపాను బీభత్సం, ఇద్దరు మృతి

    [VIDEO:](url) జమ్ము కశ్మీర్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. గుల్మర్గ్‌ ప్రాంతంలో ఒక్కసారిగా కమ్మేయటంతో ఇద్దరు విదేశీయులు మృతిచెందారు. మరో 19 మందిని సురక్షితంగా కాపాడారు. మంచు కమ్మేస్తున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ఇటీవల తరచుగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న బారాముల్లా పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 19 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. Sad to learn about the #Avalanche that hit the #Gulmarg skiing resort. … Read more

    కేసీఆర్‌, కేటీఆర్‌కు సింగర్ శ్రీరామచంద్ర విన్నపం

    ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఓ ప్రజాప్రతినిధి తీరుపట్ల [అసహనం](url) వ్యక్తం చేశాడు. ఓ పొలిటిషన్ వల్ల తన ఫ్లైట్‌ మిస్సయిందనిపేర్కొన్నాడు. ఇలాంటివి జరగకుండా చూడాలని సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను కోరాడు. “ ఓ ఈవెంట్‌ కోసం నేను గోవా వెళ్లాలి. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే దారిలో పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ బ్లాక్ చేశారు. పొలిటిషన్‌ కోసం రోడ్డు బ్లాక్ చేశారు. అందరిని కింద నుంచి పంపించడంతో ఆలస్యం అయింది. నాతో పాటు 15 మంది ఫ్లైట్ మిస్సయ్యారు. వీటి గురించి ఆలోచించాలి” అన్నాడు. 15 … Read more