• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిర్మాతపై బాలీవుడ్ నటి సంచలన ఆరోపణలు

    ప్రముఖ నిర్మాతపై బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ సంచలన [ఆరోపణలు](url) చేశారు. తనను తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశాడని వెల్లడించారు. “ నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను. అంతలోనే నా పరిస్థితులు మారిపోయాయి. అతను నన్ను దుర్భాషలాడాడు. నా ముఖం, ప్రైవేటు భాగాలపై కొట్టాడు. నా ఫోన్‌ లాక్కొని బలవంతం చేశాడు. నటన మానేయాలని 14 నెలలుగా చిత్ర హింసలు పెట్టాడు. నన్ను ఎవ్వరితోనూ మాట్లాడకుండా చేశాడు. చివరికి పారిపోయి వచ్చాను” అని పేర్కొన్నారు. https://www.instagram.com/reel/CoCUfkZNUPJ/?utm_source=ig_embed&ig_rid=3fe4d192-1a4c-471a-85d7-19adbdc5ee10 Screengrab Instagram:florasaini

    సిక్సులతో విరుచుకుపడుతున్న ధోని

    [VIDEO:](url) ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఎలాగైనా రాణించాలని మహేంద్ర సింగ్ ధోని భావిస్తున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టిన మహీ… మరింత వేగవంతం చేశాడు. సీజన్ ప్రారంభం కావటానికి చాలా సమయం ఉన్నప్పటికీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు ధోని. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో స్పిన్ బౌలింగ్‌లో సిక్సులు కొడుతున్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఈసారి జట్టును గెలిపించేందుకు వ్యూహాలకు పదునుపెట్టాడు. MS Dhoni smashing 6s during today’s practice session! … Read more

    జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు

    గొడవలకు దిగటంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రస్తుతం మరో వీడియో కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. నడిరోడ్డుపై వారు గొడవకు దిగగా… అబ్బాయిలు చుట్టూ నిల్చొని ఎంకరేజ్ చేస్తున్నారు. చుట్టు పక్కన ఉన్నవాళ్లు వారిని ఆపటానికి కనీసం ప్రయత్నించలేదు. దీనిపై చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke … Read more

    సరికొత్తగా గూగుల్ డూడుల్

    [VIDEO:](url) గూగుల్‌ పేజ్‌లో ఇవాళ సరికొత్త డూడుల్ ప్రత్యక్షమయ్యింది. హోమ్ పేజ్‌లో పర్ఫెక్ట్‌ బబుల్ టీ తయారు చేయడం ఎలా అనే ఓ ఆటను ఉంచింది. ఇందులో డూడుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. థాయ్‌లాండ్‌ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ బబుల్ టీ ఫేమస్. ప్రస్తుతం ఈ టీకి చాలా గుర్తింపు లభించింది. 2020లో ఇదే రోజున బబుల్ టీని ప్రమోట్ చేస్తూ గూగుల్ డూడుల్‌ను పెట్టింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ డూడుల్‌లో ఓ గేమ్‌ను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ అవుతోంది. … Read more

    వినరో భాగ్యము విష్ణు కథ నుంచి పాట విడుదల

    టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం నుంచి లిరికల్ సాంగ్ విడుదల అయ్యింది. దర్శనా అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. కిరణ్ సరసన కశ్మీరా నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక పాటలు కూడా అలరిస్తుండటంతో సినిమా విజయంపై చిత్రబృందం నమ్మకంతో ఉంది.

    నాని దసరా టీజర్

    నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న దసరా టీజర్ విడుదలయ్యింది. వివిధ భాషల్లో హీరోలు ధనుష్, దుల్కర్ సల్మాన్‌, రక్షిత్ శెట్టి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఇప్పటికే విడుదలైన నాని మాస్‌ లుక్ ఆకట్టుకుంది. టీజర్‌లో మందుబాటిళ్లను నాని నడుముకు కట్టుకొని వస్తుండటం వంటి అంశాలు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సినిమాను మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఐ లవ్ నాగ చైతన్య: దివ్యాంక కౌశిక్‌

    సమంతతో విడిపోయిన తర్వాత హీరో నాగ చైతన్యకు సంబంధించి ఏదో ఒక రూమర్ చక్కర్లు కొడుతూనే ఉంది. చైతూ మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తో డేట్‌లో ఉన్నాడని.. త్వరలో పెళ్లి చేసుకుంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ ఐ లవ్ నాగ చైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ, మేము పెళ్లి చేసుకుంటామన్న వార్తల్లో నిజం లేదు. తను నాకు అవకాశాలు ఇప్పించాడనేది కూడా నిజం కాదు” అన్నారు. Screengrab … Read more

    జర్నలిస్టును చెట్టుకు కట్టేసి కొట్టారు

    మధ్యప్రదేశ్‌లో అమానవీయ [ఘటన](url) జరిగింది. ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ప్రకాశ్ యాదవ్ అనే జర్నలిస్టు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్తుండగా కొందరు అడ్డుకున్నారు. జనవరి 1న జరిగిన ఏదో సంఘటన గురించి ప్రస్తావిస్తుండగా మరొకరు వచ్చి అతడిని తిట్టారు. ఈ క్రమంలో మాటామాటాపెరిగింది. ఈలోగా మరికొందరు చేరుకొని జర్నలిస్టును చెట్టుకు కట్టేసి చితకబాదారు. Madhya Pradesh again embarrassed In Narmadapuram, a journalist was tied to a … Read more

    యూఎస్‌ పోలీసుల తీరుపై ఆగ్రహజ్వాల

    [VIDEO:](url) అగ్రరాజ్యంలో పోలీసుల తీరుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడిపై హింసాత్మకంగా ప్రవర్తించడంతో అతడు చనిపోయాడు. టైర్ నికోల్స్ అనే వ్యక్తిని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో పోలీసులు ఆపి చితకబాదారు. అతడిని వాహనంలో నుంచి నేలపైకి లాగారు. నికోల్స్ చేతులు విరగ్గొట్టమని ఒకరు ఆదేశించారు. పెప్పర్‌స్ప్రే, కరెంట్ షాక్ ఇచ్చారు. అమ్మా అని కేకలు పెట్టినా వదలకుండా విరపరీతంగా కొట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ?The ?? US Police needs to stop killing Black People! … Read more

    పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.