• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.

    అక్షర్ పటేల్ క్రికెట్ డాన్సింగ్‌ మూవ్స్‌

    టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్ ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. తన వివాహ వేడుకలో భాగంగా జరిగిన సంగీత్‌లో అక్షర్ డాన్స్‌తో ఇరగదీశాడు. అంతేకాదు, పాటకు తగినట్లుగా ఇందులో క్రికెట్ మూవ్స్‌ను జోడించాడు. బ్యాటింగ్ చేసి బాల్‌ను పట్టుకుంటున్నట్లుగా చేయడం చూసి అంతా చప్పట్లతో హోరెత్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వారంలో పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ తర్వాత అక్షర్‌ ఒకడు. Axar Patel got moves. Many congratulations to them! pic.twitter.com/0xJKAXX2Cc … Read more

    రొనాల్డోని వదలని మెస్సీ

    [VIDEO:](url) ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ గురించి మరోసారి చర్చ మెుదలయ్యింది. సౌదీ సూపర్‌ కప్‌ లీగ్‌లో అల్‌ నాసర్ తరఫున రొనాల్డో ఆరంగేట్రం చేశాడు. అల్ ఇతిహాద్‌తో జరిగిన సెమీస్‌లో ఆ జట్టు ఓడిపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రొనాల్డో డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తుండగా ప్రేక్షకులు మెస్సీ మెస్సీ అంటూ అరిచారు. ఈ మ్యాచ్‌లో రొనాల్డోకి రెండు గోల్స్ కొట్టే అవకాశం వచ్చినా అవతలి టీమ్ సభ్యులు అడ్డుకున్నారు. భారీ ఆఫర్‌కి రొనాల్డో సౌదీ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ? شاهد … Read more

    హంట్‌ సినిమాతో సుధీర్‌ బాబు హిట్ కొట్టాడా?

    విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించే సుధీర్‌ బాబు ఈ సారి థ్రిల్లర్ అండ్ యాక్షన్ ఎంట్‌టైనర్‌తో ముందుకొచ్చాడు. చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సుధీర్‌బాబుకి విజయం దక్కిందా ? ఈ చిత్రంతో హిట్ ట్రాక్‌ ఎక్కాడో లేదో చూద్దాం.  కథ మలయాళ చిత్రం ముంబయి పోలీస్‌ రీమేక్ ఇది. గతం మర్చిపోయిన పోలీస్ అధికారి, తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక కేసును ఎలా చేధిస్తాడనేది కథ. ఇందులో భరత్, శ్రీకాంత్‌ల పాత్ర ఏమిటి ? సుదీర్ బాబు ఎందుకు గతం మర్చిపోయాడు … Read more

    ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ధోని

    టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ బ్యాట్ పట్టాడు. రాంచీలోని ఝార్ఖండ్‌ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ మెుదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నాలుగు సార్లు చెన్నైకి కప్పు అందించిన ధోని మళ్లీ సాధన చేస్తుండటంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో అని సందేహంగా ఉన్న వేళ ప్రాక్టీస్ ప్రారంభించడంతో కచ్చితంగా ఆడతాడని అనుకుంటున్నారు. Thala Dhoni is getting ready for IPL 2023. pic.twitter.com/2sMk2IWVil … Read more

    శాకుంతలం నుంచి సెకండ్ సింగిల్‌

    సమంత నటించిన శాకుంతలం నుంచి సెకండ్‌ సింగిల్ వచ్చేసింది. రుషి వనంలోన స్వర్గధామం అంటూ సాగే ఈ పాట అలరిస్తోంది. ఫిబ్రవరి 17న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహించగా మణిశర్మ స్వరాలు సమకూర్చారు. సిద్ధ్‌ శ్రీరామ్, చిన్మయి కలిపి ఆలపించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

    ఉర్ఫీ జావెద్‌కు ఇళ్లు అద్దెకు ఇవ్వడంలేదట

    చిత్ర విచిత్రమైన వస్త్రాధారణతో దర్శనమిచ్చే బిగ్‌ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్‌ తనకు ఇళ్లు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. “ నా వస్త్రధారణ చూసి హిందూ ముస్లింలు ఎవ్వరూ ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులు నన్ను బెదిరిస్తుండటంతో మరికొందరు వెనుకడుగు వేస్తున్నారు. ముంబైలో అద్దె ఇళ్లను పొందటం కష్టం. ఒకసారి కాదు.. ప్రతిసారి ఇదే పరిస్థితి. పైగా సింగిల్‌గా ఉన్నాను. నాకు ఇళ్లు దొరకటం కష్టమే” అని పేర్కొంది. Courtesy Instagram: urf7i Courtesy Instagram: urf7i

    బెంగళూరులో కరెన్సీ నోట్ల వర్షం

    [VIDEO:](url) బెంగళూరులో కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. అదేలా అనుకుంటున్నారా? రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి వంతెనపై నుంచి నోట్లను విసిరాడు. కేఆర్ మార్కెట్‌ ప్రాంతంలో ఘటన జరిగింది. రూ. 10 నోట్లను వెదజల్లడంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు ఇవి రూ. 3000 ఉంటాయని సమాచారం. అతడు ఎందుకు చేశాడనేది తెలియదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపు పారిపోయాడు. అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. #Bizarre in #Bengaluru#Traffic came to halt on … Read more

    టెడ్డీ గెటప్‌లో ఇన్‌స్టా రీల్.. కట్‌ చేస్తే అరెస్ట్ !

    [VIDEO:](url) రోడ్డుపై ఇన్‌స్టా రీల్‌ చేసిన యువతికి జరిమానా విధించిన ఘటన మరువకముందే మరొకటి జరిగింది. ఉత్తర్‌ ప్రదేశ్‌ గోరక్‌పూర్‌లో సూరజ్‌ కుమార్ అనే యువకుడిని పోలీసులు ఏకంగా అరెస్ట్ చేశారు. సూరజ్ ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించి టెడ్డీ గెటప్‌లో రైల్వే క్రాస్‌ వద్ద రీల్ చేశాడు. గూడ్స్, ప్యాసింజర్‌ రైళ్లు వెళ్తుండగా ఫన్నీ వీడియోను చిత్రీకరించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావటంతో RPF పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రైల్వే గేట్‌ దూకాడని తెలిపారు. RPF #Gorakhpur have arrested … Read more

    దిల్లీలో భూకంపం, జనాల పరుగులు

    దిల్లీలో [భూకంపం](url) సంభవించింది. వివిధ ప్రాంతాల్లో భూమి భారీగా కంపించింది. దీంతో జనాలు బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని ఫితోర్‌గఢ్‌కు తూర్పున 148 కిలోమీటర్ల దూరంలో నేపాల్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. దిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమెదైనట్లు నెషనల్‌ సెంటర్‌ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #earthquake captured in camera.#delhi pic.twitter.com/wW3ikxFZCc — Knowledge ABC (@AbcKnowledge) … Read more