• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ

    హైదరాబాద్‌ నొవాటెల్‌లో ఎన్టీఆర్‌, అమిత్‌ షా భేటీ అయ్యారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా సినిమా చూసిన అమిత్‌ షా, ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజకీయంగానూ ఈ భేటీ ఆసక్తిని పెంచుతోంది.

    ‘జైలర్‌’ సినిమా నుంచి రేపు క్రేజీ అప్డేట్‌

    సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ 169వ చిత్రం ‘జైలర్‌’ నుంచి రేపు క్రేజీ అప్డేట్‌ రాబోతోంది. డాక్టర్‌, బీస్ట్‌ వంటి సినిమాలు తెరెకెక్కించిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌ స్టార్‌తో నరసింహ వంటి బ్లాక్‌బస్టర్లు కొట్టి కె.ఎస్‌. రవికుమార్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు అప్డేట్‌ ఇవ్వనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

    డాక్టర్‌ను కొట్టిన కుమార్తె-సారీ చెప్పిన సీఎం

    మిజోరాం ముఖ్యమంత్రి జోరంతంగా తన కుమార్తె దురుసు ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పారు. ఇటీవల ఓ వైద్యుడిపై సీఎం కుమార్తె చేయిచేసుకుంటున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. తనకు వీఐపీ మర్యాద లేకుండా ప్రత్యేక అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదనే కోపంతో ఆమె డాక్టర్‌పై దాడి చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన వేళ ముఖ్యమంత్రి బహరంగ క్షమాపణ చెప్పారు. ‘నా కుమార్తె ప్రవర్తించిన తీరు ఏ విధంగానూ సమర్థనీయం కాదు. వైద్యుడిని కలిసి క్షమాపణ చెప్పాను.’ అని జోరంతంగా ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.

    ‘ఉట్టికొట్టిన బామ్మ’ వావ్‌ అంటున్న నెజిజన్లు

    జన్మాష్టమి రోజున ఉట్టి కొట్టడం అంతటా జరిగే వేడుకే అయినప్పటికీ ఓ వీడియో మాత్రం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఎందుకంటే అక్కడ ఉట్టి కొట్టింది యువకుడో, యువతో కాదు బామ్మ. ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాన్షు కాబ్రా షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సూపర్‌ బామ్మ అంటూ నెటినజ్లు కామెంట్‌ చేస్తున్నారు. వీడియో కోసం[ ఇక్కడ](url) క్లిక్ చేయండి. The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx — Dipanshu Kabra (@ipskabra) August 20, 2022

    ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం’ బీజేపీ మాజీ ఎమ్మెల్యే

    రాజస్థాన్‌ బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ్ఞాన్‌దేవ్‌ ఓ సమావేశంలో కూర్చుని మాట్లాడుతూ ‘ ఇప్పటికే ఐదుగురిని చంపేశాం. గోవులను చంపేవారిని విడిచిపెట్టేది లేదు.’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శలు గుప్పిస్తూ… ‘బిల్కిస్ బానో దోషులకు సత్కారం చేసిన వారిని రాజస్థాన్‌ పంపించండి, ఆ ఎమ్మెల్యేకు కూడా సత్కారం చేయించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే జ్ఞాన్‌దేవ్‌ వ్యాఖ్యల [వీడియో](url) సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. Rajasthan BJP Ex MLA Gyan Dev … Read more

    భారత మహిళా పైలట్‌కు అరుదైన గౌరవం

    ఎయిర్‌ ఇండియా పైలట్‌ జోయా అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత శాన్‌ ఫ్రాన్సిస్కో ఏవియేషన్‌ మ్యూజియంలో ఆమెకు చోటుదక్కింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు నార్త్‌పోల్‌ మీదుగా 16000 కిలోమీటర్లు ప్లేన్ నడిపిన తొలి భారత మహిళా పైలట్‌గా జోయా రికార్డు సృష్టించినందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. 2021లో జోయా ఈ ఘనత సాధించారు. ‘ SFO ఏవియేషన్‌ మ్యూజియంలో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. యూఎస్‌ఏలోని ప్రఖ్యాత మ్యూజియంలో నేను చిరకాలం నిలిచిపోతాననే ఊహను కూడా నేను … Read more

    సినీ స్టార్ల క్రికెట్ టోర్నీ మళ్లీ వచ్చేస్తోంది!

    డల్లాస్‌లో సెప్టెంబర్‌ 24 నుంచి మళ్లీ సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ట్రోఫీ, జెర్సీని ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఆవిష్కరించారు. ‘చదువు లేకపోయినా మేము లక్షల్లో సంపాదిస్తున్నామంటే దానికి కారణం ఈ చిత్ర పరిశ్రమే. ఈ చిత్ర పరిశ్రమ మాకెంతో ఇచ్చింది. కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉంటుంది’ అని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీలో నిర్మించే ఆసుపత్రికి రూ.20లక్షల చెక్‌ను చిరంజీవి అందజేశారు. కార్యక్రమంలో సినీనటుడు శ్రీకాంత్‌, ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ తదితరులు … Read more

    ట్వీట్లు నా పర్సనల్‌, రాజకీయం చేయొద్దు: అనసూయ

    తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని ప్రముఖ యాంకర్‌ అనసూయ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ బిల్కిస్‌ బానో అత్యాచార కేసుపై కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ ‘మన దేశానికి ఇదొక మాయని మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈరోజు బిల్కిస్‌ బానో.. రేపు ఇంకెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా నోరెత్తండి’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిని అనసూయ రీట్వీట్ చేస్తూ ‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’’ అని చెప్పింది. … Read more

    ఫిల్మ్‌ చాంబర్‌ కీలక నిర్ణయాలు

    సినిమా పరిశ్రమ విషయంలో చర్చలు జరుపుతున్న ఫిిల్మ్‌ చాంబర్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమా విడుదలైన 8 వారాల తర్వాతనే ఓటీటీ ఇచ్చేలా నిర్మాతలంతా కలిసి నిర్ణయించారు. థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. అందుకు వారు అంగీకరించారని వెల్లడించారు. వీపీఎఫ్‌ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేతన సమస్యలపైనా దాదాపుగా తుది నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. నాలుగైదు రోజుల్లో షూటింగులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

    మనసును మురిపించే రెహమాన్‌ పాట

    చియాన్‌ విక్రమ్‌ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న చిత్రం ‘కోబ్రా’. ఇందులో విక్రమ్ 25 గెటప్‌లలో కనిపిస్తారని టాక్. మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్‌ జ్ఞానముత్తు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే పాటల విడుదలను కూడా ప్రారంభించారు. తాజాగా ‘తరంగిని’ తెలుగు లిరికల్ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. రెహమాన్‌ బాణీలతో వినసొంపుగా ఈ పాట ఆకట్టుకుంటోంది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.