తన వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని ప్రముఖ యాంకర్ అనసూయ నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ బిల్కిస్ బానో అత్యాచార కేసుపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ ‘మన దేశానికి ఇదొక మాయని మచ్చ. సన్మానం చేయడానికి వారేమైనా స్వాతంత్ర్య సమరయోధులా!! ఈరోజు బిల్కిస్ బానో.. రేపు ఇంకెవరైనా కావొచ్చు. ఇప్పటికైనా నోరెత్తండి’’ అంటూ ట్వీట్ చేశారు. దీనిని అనసూయ రీట్వీట్ చేస్తూ ‘స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. అత్యాచారం చేసేవాళ్లను వదిలేసి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’’ అని చెప్పింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ‘హైదరాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీంతో అనసూయ ట్వీట్లు తన వ్యక్తిగత అభిప్రాయాలని వాటిని రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
-
Twitter:Anasuya bharadwaj
-
Twitter:Anasuya bharadwaj
-
Twitter:Anasuya bharadwaj
-
Twitter:Anasuya bharadwaj
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్