• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మార్టిన్‌’ టీజర్‌ మరో KGF తరహా సినిమా

    కన్నడ ఇండస్ట్రీలో KGF సినిమాల విజయంతో వరుసగా యాక్షన్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఉపేంద్ర ‘కబ్జా’ ట్రైలర్‌ అచ్చం KGFలా ఉందంటూ మాట్లాడుకుంటున్న వేళ… మరో సినిమా టీజర్‌ కూడా అలాగే ఉంది. ధ్రువ్‌ సార్జా హీరోగా ఎ. పి. అర్జున్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మార్టిన్‌’. ఈ సినిమా టీజర్‌లో డైలాగ్స్‌, విజువల్స్‌, బీజీఎం అన్నీ కేజీఎఫ్‌ను గుర్తుచేసేలా ఉన్నాయి.

    పోలీసు పాటకు సింగర్ ఫిదా

    దిల్లీ పోలీసు పాడిన ఓ పాటకు నెటిజన్లతో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఫిదా అయ్యారు. 2017లో వచ్చిన భద్రినాథ్‌ కి దుల్హనియా నుంచి ‘ రోకే నా రుకే నైనా’ పాటను ఓ ఫంక్షన్‌లో రాథోడ్‌ అనే పోలీస్‌ పాడగా అది నెట్టింట వైరల్‌ అయింది. సినిమాలో ఈ పాటను అరిజిత్‌ సింగ్‌ పాడారు. రాథోడ్‌ వృత్తిరీత్యా పోలీసు అయినా అతడి సంగీతం పట్ల అభిరుచి ఉంది. ఈ పాటకు సింగర్‌ అమాల్‌ మల్లిక్‌, లిరిసిస్ట్‌ కుమార్‌ స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. View this … Read more

    కొట్టుకున్న మహిళా కౌన్సిలర్లు

    [VIDEO](url):దిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయినా రచ్చ మాత్రం ఆగడం లేదు. మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ గందరగోళం నెలకొంది. స్టాండింగ్‌ కమిటీకి మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా… బీజేపీ, ఆప్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మహిళా కౌన్సిలర్లు పరస్పరం తోసుకుంటూ గొడవకు దిగారు. బీజపీ కౌన్సిలర్లు తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని మేయర్‌ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. ఈ ఎన్నికలు జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. #WATCH | Delhi: Ruckus and sloganeering continue at MCD house as … Read more

    చావు తప్పించుకున్న హీరో విశాల్‌

    [VIDEO](url):హీరో విశాల్‌ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోని’ ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. సీన్‌లో భాగంగా విశాల్‌ నేలపై పడిపోగా అదే సమయంలో ఓ భారీ ట్రక్కు దూసుకొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన ఈ ప్రమాదం నుంచి విశాల్‌ రెప్పపాటులో బయటపడ్డారు. కొన్ని ఇంచుల దూరంలో చావును చూశా అంటూ విశాల్‌ ప్రమాదపు వీడియోను షేర్‌ చేశారు. … Read more

    దాదాను దింపేసిన స్మృతి మంధాన

    [VIDEO](url): మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగి ఆడిన స్మృతి మంధాన బ్యాటింగ్‌ శైలిపై…. ICC షేర్‌ చేసిన ఓ వీడియో ఆసక్తి రేకెత్తిస్తోంది. మంధాన బ్యాటింగ్‌ను సౌరవ్‌ గంగూళీతో పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో చేసింది. గంగూళీ ఫ్రంట్‌ఫూట్ సిక్సర్‌కు అప్పట్లో వీరాభిమానులు ఉండేవారు. స్మృతి మంధాన కూడా అచ్చం అలాగే సిక్స్‌ బాదడం, పుల్‌ షాట్స్‌, కవర్‌ డ్రైవ్స్‌ అచ్చం దాదాలాగే ఆడటంతో వారిద్దరి షాట్లను పోలుస్తూ ఐసీసీ ఈ వీడియో … Read more

    ‘ఉగ్రం’ టీజర్‌: అల్లరి నరేశ్‌ ఉగ్రరూపం

    కెరీర్‌లో సింహభాగం కామెడీ రోల్స్‌ చేసిన అల్లరి నరేశ్‌…. నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. కానీ సీరియస్‌గా ఫైట్స్‌ చేసే రోల్‌ ఇప్పటిదాకా పడలేదు. ప్రస్తుతం అలాంటి ఓ రోల్‌లోనే ఉగ్రంలో నటిస్తున్నాడు. విజయ్‌ కనకమేడలతో రెండోసారి జత కట్టిన నరేశ్.. మరోసారి ప్రేక్షకులను పక్కాగా అలరిస్తామనే ధీమాతో ఉన్నాడు. తాజాగా ఉగ్రం టీజర్‌ విడుదల చేయగా.. అది సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

    మరణంపై పాట-సింగర్‌కు పోలీసు నోటీసులు

    [VIDEO](url):భోజ్‌పురి జానపద గాయని నేహా సింగ్ రాథోడ్‌కు యూపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాన్పూర్‌లో తల్లీ బిడ్డల మరణంపై నేహా ఈ పాట రాసి పాడారు. వీడియోలో ఉన్నది తానేనా, తానే ఆ లిరిక్స్‌ రాసి పాడిందా? లేక వేరే ఎవరైనా రాశారా? ఇలా నోటీసులో పోలీలుసు ప్రశ్నించారు. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నోటీసులో స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బీజేపీ పోలీసులను పంపించిందంటూ విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. यू पी में का … Read more

    సింగర్‌ సోను నిగమ్‌పై ఎమ్మెల్యే దాడి

    [VIDEO](url): ప్రముఖ సింగర్‌ సోను నిగమ్‌పై శివసేన ఎమ్మెల్యే దాడి చేశాడు. ముంబయిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ ఫటేర్‌పేకర్‌..సోను నిగమ్‌ మేనేజర్ సైరాతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపిస్తున్నారు. ఆమెను స్టేజ్ దిగాలని గొడవ చేయగా.. సోను కిందకు వెళ్తుంటే ఎమ్మెల్యే అతడి మనుషులు దాడి చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. హిందీతో పాటు వివిధ భాషల్లో సూపర్‌ హిట్‌ సాంగ్స్ పాడిన సోను నిగమ్‌.. గతేడాదే పద్మశ్రీ కూడా అందుకున్నారు. #Breaking … Read more

    కోనసీమ థగ్స్‌ నుంచి ‘హే అందమే’ పాట విడుదల

    ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా గోపాల్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘కోనసీమ థగ్స్’. హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయమవుతున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ షిబు తమీన్స్‌ తనయురాలు రియా షిబు హెచ్‌ ఆర్ పిక్చర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ ‘హే అందమే’ విడుదల చేశారు. శామ్ సీఎస్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

    LIVE: తారకరత్న అంతిమ సంస్కారాలు

    23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన నటుడు తారకరత్న అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఫిల్మ్‌ చాంబర్‌లో ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్దం ఉంచారు. నందమూరి అభిమానులు కడచూపు కోసం తరలివెళ్తున్నారు.