• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రికెట్‌ చరిత్రలోనే చెత్త రివ్యూ

    [VIDEO](url): ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో బంగ్లా కెప్టెన్‌ తమిమ్‌ ఇక్బాల్‌ తీసుకున్న ఓ DRSపై నెట్టింట తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త రివ్యూ అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. టస్కిన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఆదిల్‌ రషీద్‌ బంతిని బ్యాటుతో డిఫెండ్ చేశాడు. బంతి కనీసం కాలుకు దగ్గరగా కూడా లేదు. కానీ దీనికి టస్కిన్‌ అప్పీల్‌ చేయడం, ఇక్బాల్‌ రివ్యూ తీసుకోవడం విచిత్రంగా అనిపించింది. What prize do … Read more

    ఆకట్టుకుంటున్న కబ్జా ట్రైలర్‌

    రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ నటించిన కబ్జా మూవీ ట్రైలర్‌ విడుదలైంది. కిచ్చా సుదీప్‌, శివ రాజ్‌ కుమార్‌, శ్రియ వంటి స్టార్‌ క్యాస్ట్‌ అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉంది. ఆర్.చంద్రు దర్శకత్వంలో వస్తున్నఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, ఒరియా, మరాఠీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మార్చి 17న థియేటర్లలో విడుదల కాబోతోంది.

    బిల్లీ బిల్లీ సాంగ్: వెంకీ మామ, సల్మాన్‌ ఖాన్‌ స్టెప్పులు

    బాలివుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్ హీరోగా వస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. టాలివుడ్‌ హీరో వెంకటేశ్‌ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టీజర్‌ విడుదల కాగా.. తాజాగా బిల్లీ బిల్లీ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. తమిళ సినిమా ‘వీరమ్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కానుంది.

    INDvsAUS: రక్తం కారుతున్నా బౌలింగ్‌ ఆపలేదు

    [VIDEO](url):బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ నిబద్ధతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మ్యాచ్‌ మధ్యలో తన వేలికి గాయమై రక్తం కారుతున్న దానిని తుడుచుకుంటూ బౌలింగ్‌ వేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. pic.twitter.com/NUjDml3OpN — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) March 2, 2023

    టీనేజర్‌ నా వీడియోలు రికార్డ్‌ చేశాడు: యామీ గౌతమ్‌

    ఇటీవల ఆలియా భట్ లివింగ్‌ రూంలో ఉండగా ఫోటోలు తీయడంపై రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటే సంఘటనే తన జీవితంలోనూ జరిగిందని నటి యామీ గౌతమ్‌ చెప్పుకొచ్చారు. ఓ 19-20 ఏళ్ల కుర్రాడు ఫోటో తీసుకుంటానని చెప్పి.. తనకు తెలియకుండానే వీడియో తీశాడని ఆమె చెప్పింది. మరునాడే కొంతమంది వచ్చి హోం టూర్‌ అంటూ తన ఇంట్లోకి వచ్చారని వివరించింది. ప్రతి దానికి ఓ హద్దు ఉంటుంది కానీ కొంతమంది అది మీరి ప్రవర్తిస్తున్నారని ఆవేదనగా అన్నారు. Instagram:yamigautam Instagram:yamigautam Instagram:yamigautam

    ట్రోలింగ్‌ దెబ్బకు కామెంట్లు ఆఫ్‌ చేసిన నటి

    నటి శ్వేతా తివారి ముద్దుల తనయ పాలక్‌ తివారీ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఈ అమ్మడు హాట్ ఫోటోలు షేర్‌ చేయగా.. కొంతమంది నెటిజన్లు నెగెటివ్‌ కామెంట్లు చేశారు. దీంతో పాలక్ తివారీ కాసేపటికే కామెంట్లు ఆఫ్ చేసింది. ‘బిజ్లీ బిజ్లీ’ సాంగ్‌తో పాపులర్‌ అయిన ఈ నటి ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘ కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సిినిమాలో కీలక పాత్రలో మెరవబోతోంది. Courtesy Instagram:palaktiwarii Courtesy Instagram:palaktiwarii Courtesy Instagram:palaktiwarii Courtesy Instagram:palaktiwarii

    పాపం బ్రేస్‌వెల్‌ ! చాలా దురదృష్టకరం

    [VIDEO](url): ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టులో కివీస్‌ ఆటగాడు బ్రేస్‌వెల్‌ ఔటైన తీరును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. క్రీజులోకి వచ్చినా రనౌట్‌ అవ్వడం చూసి ఎంత దురదృష్టవంతుడివి భయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. బెన్‌ స్టోక్స్‌ విసిరిన బంతిని ఫోక్స్‌ అందుకుని బెయిల్స్‌ గిరాటేసే సమయానికి బ్రేస్‌వెల్‌ క్రీజులోకి వచ్చినా…. అతడి బ్యాటు, లెగ్‌ గాలిలో ఉండటంతో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించారు. ??pic.twitter.com/f3ehGJTLVI — CricTracker (@Cricketracker) February 27, 2023

    నడుము అందాలతో కవ్విస్తున్న దివి

    బిగ్‌బాస్‌ ఫేం దివి తన సొగసులతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతోంది. చీర కొంగు చాటున తన నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. కవ్విస్తూ తాను పోస్ట్‌ చేసిన ఓ వీడియోకు నెట్టింట లైకుల వర్షం కురుస్తోంది. దివి ‘మహర్షి’ సినిమాతో సినీ ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘క్యాబ్‌స్టోరీస్’ చిత్రాల్లో నటించింది. View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi)   Screengrab Instagram:actordivi   Screengrab Instagram:actordivi

    పెళ్లిలో వెంకటేశ్‌-రామ్‌ చరణ్ సందడి

    [VIDEO](url): HCA అవార్డుల కోసం అమెరికా వెళ్లిన రామ్‌ చరణ్‌ అక్కడ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ఇదే వేడుకకు విక్టరీ వెంకటేశ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నాటు నాటు పాటను ప్రస్తావిస్తూ వెంకటేశ్‌ రామ్‌చరణ్‌ను అభినందించారు. ‘ఆల్‌ ది అవార్డ్స్‌ గోస్‌ టు మిస్టర్‌ చరణ్‌’ అంటూ వెంకీ మామ అనగానే అక్కడ అందరూ కేరింతలు కొట్టారు. RRR హాలివుడ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ 4 అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. "All the Awards Goes to Mr. Charan" … Read more

    హాలివుడ్‌ సినిమాలు చేస్తా: రామ్‌ చరణ్‌

    [VIDEO](url): HCA అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన నటుడు రామ్‌ చరణ్‌… ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు పాటను ప్రమోట్‌ చేస్తున్నాడు. అందులో భాగంగానే గుడ్‌మార్నింగ్‌ అమెరికా టాక్‌షోలో పాల్గొన్నాడు. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో హాలివుడ్‌లో నటిస్తారా అని ప్రశ్నించగా. “ ప్రస్తుతం ఇండియాలోనే సినిమాలు చేస్తున్నా. తప్పకుండా హాలివుడ్‌లోనూ చేస్తా. ఇండియా టాలెంట్‌ను ఇక్కడ కూడా చూపించాలనుకుంటున్నా. మంచి అవకాశం వస్తే తప్పకుండా హాలివుడ్‌లో నటిస్తా” అని సమాధానమిచ్చారు. Proven Winner ? @AlwaysRamCharan … Read more