కొత్త ఏడాది మంచి బడ్జెట్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? రూ.10,000 లోపు బడ్డెట్‌లో బెస్ట్ మెుబైల్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్‌లో ఈ రోజు (Jan 24, 2024) వరకూ ఉన్న బడ్జెట్ ఫోన్లలో అత్యుత్తమమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. తక్కువ ధరకే లభిస్తోన్న ప్రముఖ కంపెనీ స్మార్ట్‌ఫోన్లను ఫిల్టర్ చేసి అందులో ది బెస్ట్ (Best Phones Under 10k in India 2024)ను మీ ముందు ఉంచింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాప్-10 చౌక ఫోన్లు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Redmi 13C
గతేడాది నవంబర్‌లో విడుదలైన ఈ రియల్‌మీ (Realme) ఫోన్ వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల స్క్రీన్, MediaTek Helio G85 ప్రొసెసర్, 50MP + 2MP + 2MP కెమెరా సెటప్, 5MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, Android 13 OS వంటి ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.8,999లకు అమెజాన్‌లో లభిస్తోంది.
Realme Narzo N53
గతేడాది మేలో లాంచ్ అయిన ఈ ఫోన్ (Best Phones Under 10k in India 2024).. మంచి రివ్యూలను కలిగి ఉంది. ఈ Realme Narzo N53 ఫోన్.. 6.74 అంగుళాల స్క్రీన్, Unisoc T612 ప్రొసెసర్, Android 13 OS,50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది కూడా అమెజాన్‌లో రూ.8,999 సేల్ అవుతోంది.
Samsung Galaxy F13
శాంసంగ్ నుంచి తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌ను ఆశించే వారు దీన్ని పరిశీలించవచ్చు. ఈ మెుబైల్ 6.60 అంగుళాల డిస్‌ప్లే, Samsung Exynos 850 ప్రొసెసర్, 8MP సెల్ఫీ కెమెరా, 50MP + 5MP + 2MP రియర్ కెమెరా సెటప్, 4GB – 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్స్, 6000mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999లకు అందుబాటులో ఉంది.
Poco M6 5G
పోకో (Poco) నుంచి వచ్చిన ఈ బడ్జెట్ ఫోన్ కూడా (Best Phones Under 10k in India 2024) మంచి పర్‌ఫార్మెన్స్ ఇస్తోంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల స్క్రీన్, 50MP మెయిన్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4GB / 6GB / 8GB ర్యామ్, 128GB/ 256GB స్టోరేజ్ ఆప్షన్స్, 5000mAh బ్యాటరీ, Android 13 వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999లకు లభిస్తోంది.
Redmi A2
రూ.6,000 లోపే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి Redmi A2 మంచి ఆప్షన్. గతేడాది మేలో ఈ ఫోన్ విడుదలైంది. ఈ రెడ్‌మీ మెుబైల్ 6.52 అంగుళాల స్క్రీన్‌తో పాటు 8MP బ్యాక్ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా, 2GB / 4GB RAM, 32GB / 64GB స్టోరేజ్, Android 13 OS వంటి ముఖ్యమైన ఫీచర్లతో వచ్చింది.
Realme C53
బెస్ట్ బడ్జెట్ ఫోన్లలో Realme C53 కూడా ఒకటి. ఈ ఫోన్ 6.74 అంగుళాల స్క్రీన్, octa-core ప్రొసెసర్, 8MP ఫ్రంట్ కెమెరా, 108MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, Android 13 OS వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.9,999కు లభిస్తోంది.
Itel A70
ఈ ఏడాది జనవరి 3న (Best Phones Under 10k in India 2024) ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. 6.60 అంగుళాల స్క్రీన్, 13MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 12GB RAM, 128GB / 256GB స్టోరేజ్ ఆప్షన్స్, 5000mAh బ్యాటరీ, Android 13 Go Edition OS వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మెుబైల్ రూ.6,799లకు అమెజాన్‌లో సేల్ అవుతోంది.
Infinix Smart 8
ఈ ఫోన్ గతేడాది నవంబర్‌లో విడుదలైంది. 6.60 అంగుళాల స్క్రీన్, 5000mAh బిగ్ బ్యాటరీ, Unisoc T606 ప్రొసెసర్, Android 13 OS, 13MP ప్రైమరీ + 8MP సెల్ఫీ కెమెరా, 4GB RAM / 128GB స్టోరేజ్ వంటి కీలకమైన ఫీచర్లతో వచ్చింది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499గా ఉంది.
Infinix Smart 8 HD
ఈ ఫోన్ గతేడాది డిసెంబర్ 8న మార్కెట్‌లోకి వచ్చింది. 6.60 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ఫోన్ Unisoc T606 ప్రొసెసర్, Android 13 Go Edition OSపై వర్క్ చేస్తుంది. 13MP ప్రైమరీ + 8MP సెల్ఫీ కెమెరాలను ఫోన్ కలిగి ఉంది. అలాగే 3GB RAM / 64GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీతో ఫోన్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.6,299 సేల్ అవుతోంది.
Redmi 12
ఈ రెడ్‌మీ ఫోన్ గతేడాది జులైలో (Best Phones Under 10k in India 2024) మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.79 అంగుళాల స్క్రీన్, MediaTek Helio G88 ప్రొసెసర్, 50MP + 8MP + 2MP కెమెరా సెటప్, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ, Android 13 OS ఫీచర్లను కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.9,499 సేల్ అవుతోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!