ల్యాప్‌టాప్స్, ఇతర సీపీయూల్లో ఫైల్ ట్రాన్సఫరింగ్ స్పీడ్, స్టోరేజ్ సామర్థ్యం పెంచుకునేందుకు సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (SSD) ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా వేగంగా డేటా యాక్సెస్, డేటాను స్టోరేజ్ చేయగలవు. హార్డు డ్రైవులతో పోలిస్తే ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. కంప్యూటర్ల పనితీరును మెరుగు పరచడంలో సహాయపడుతాయి. ల్యాగ్‌లేని వీడియో ఎక్స్‌పోర్టింగ్, క్రిటికల్ బిజినెస్ వర్క్స్‌కు ఇది అత్యావశ్యకం. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న SSDలు మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. మరి వాటిలో కొన్ని బెస్ట్ SSDలను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వాటిపై ఓ లుక్ వేయండి.
ZEBRONICS SD13
ఇది తక్కువ ధరలో లభిస్తోంది. 128GB SSD స్టోరేజ్ కెపాసిటి, తక్కువ పవర్ వినియోగం, తక్కువ హీట్ జనరేషన్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. అంతే కాదు… సైలెంట్ ఆపరేషన్ మోడ్‌లో పనిచేస్తుంది. దీని ధర రూ.829.
Western Digital WD
సాలిడ్ స్టేట్ డ్రైవ్‌లను తయారు చేయడంలో వెస్ట్రన్ డిజిటల్‌కు మంచి పేరుంది. ఈ SSD 250 జీబీ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. దీనిపై 5 ఏళ్ల వారెంటీ అయితే లభిస్తోంది. దీని ధర రూ. 2,049.
Kingston SSDNow A400 240GB
స్టోరేజ్ చిప్‌లు తయారు చేయడంలో కింగ్‌స్టన్‌కు ఎంత పెద్ద పేరుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇంటర్నల్ SSD.. 240జీబీ స్టోరేజ్ కెపాసిటిని కలిగి ఉంది. ఫాస్ట్‌గా ఫైల్స్ ట్రాన్సఫర్ చేయడం, స్పీడ్ లోడింగ్ కెపాసిటీ దీని సొంతం. దీని ధర రూ.2,393.
Kingston 256GB KC600
ఈ SSDలో లెటెస్ట్ 3D TLC NAND సాంకేతికత ఉపయోగించారు. దీని రైటింగ్ స్పీడ్ 550/520MB/s వరకు ఉంటుంది. పూర్తి స్థాయి ప్రొటెక్షన్‌తో అయితే లభిస్తుంది. దీనిపై 5 ఏళ్ల వారెంటీ లభిస్తోంది.
Kingston SSDNow A400 480GB
ఈ కింగ్‌స్టన్ SSD.. 480GB కెపాసిటితో 500MB/s రైటింగ్ క్యాపబులిటీని కలిగి ఉంది. తక్కువ పవర్ వినియోగం, లో వైబ్రేషన్, ఫాస్ట్ ఫైల్ ట్రాన్సఫర్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. దీని ధర రూ.2699.
Western Digital WD Green SATA 480GB
అమెజాన్‌లో బెస్ట్ రేటింగ్‌ను ఈ SSD కలిగి ఉంది. 480 స్టోరేజ్ కెపాసిటితో 545MB/s రీడ్ అండ్ రైట్ స్పీడ్ దీని సొంతం. షాక్ రెసిస్టెంట్, ఫాస్టర్ ఫైల్ ట్రాన్సఫర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్‌పై 3 ఏళ్ల వారెంటీ లభిస్తుంది. దీని ధర రూ.2940.
Samsung 870 EVO 500GB SATA
అమెజాన్‌లో ఈ SSDపై యూజర్స్ నుంచి బెస్ట్ రేటింగ్ అయితే ఉంది. ఇది 500జీబీ స్టోరేజ్ కెపాసిటితో 7,000MB/s రీడింగ్ స్పీడ్ కలిగి ఉంది. క్యాషే మెమోరి 1జీబీ వరకు ఉంది. ఐదేళ్ల వారెంటీ ఈ ప్రొడెక్ట్‌పై లభిస్తోంది. దీని ధర రూ.3,399.
amazon basics Portable 1TB SSD
ఇది అమెజాన్ ప్రొడక్ట్. తక్కువ ధరలో 1టెరా బైట్ వరకు స్టోరేజ్‌తో ఈ SSD లభిస్తోంది. 2000/1900MB/s రీడ్ కెపాసిటీని కలిగి ఉంది. దీని వల్ల 4K వంటి హై క్వాలిటీ కంటెంట్‌ను తెలికగా ల్యాగ్ లేకుండా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో దీని అసలు ధర రూ. 13 వేలు కాగా ప్రస్తుతం.. రూ.6072 కే లభిస్తోంది.
Kingston Q500 960GB
సాధారణ HDD హార్డ్ డ్రైవ్‌లతో పోలిస్తే.. ఇది 10X ఫాస్టర్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. వైబ్రెంట్ రెసిస్టెంట్, షాక్, వైబ్రెషన్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ప్రొడక్ట్‌పై 3 ఏళ్ల వారెంటీ లభిస్తోంది. దీని ధర రూ.9,499.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!