• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మనుషులు ప్లాస్టిక్‌కు బానిసలయ్యారు’

    [VIDEO: ](url)ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడంతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్నాయి. దీంతో అడవి జంతువులు ప్లాస్టిక్‌ వస్తువులను తిని మృత్యువాతపడుతున్నాయి. ఈ సందర్భంగా ఐఏస్ అధికారి సుప్రియా సాహు ప్లాస్టిక్ బాటిల్ తింటున్న ఓ ఏనుగు వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “మానవులు ప్లాస్టిక్‌కు బానిసలుగా మారారు. విసిరివేయబడిన ప్లాస్టిక్ వల్ల మూగజీవాలు బలవుతున్నాయి. ఇది లెక్కకు మించిన విషాదం అంటూ ట్వీట్ చేశారు. When humans become slaves of throwaway plastic the price is paid … Read more

    తెదేపా నాయకుడిపై కత్తి దాడి

    కాకినాడ జిల్లా తునిలో తెదేపా నాయకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరి రావును హత్య చేసేందుకు ప్రయత్నించాడు. భవాని మాల వేషధారణలో వచ్చిన నిందితుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. శేషగిరిరావు తలకు, చేతికి తీవ్ర గాయాలవ్వటంతో ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బైక్ పై పారిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషగిరిరావును సీనియర్ నేతలు యనమల, రాజప్ప పరామర్శించారు.

    మలబార్ విన్యాసాల్లో భారత్ యుద్ద సన్నద్ధత

    [VIDEO:](url)జపాన్ సముద్రంలో జరుగుతున్న మలబార్ విన్యాసాల్లో భారత నౌకాదళం పాల్గొంది. ఈ విన్యాసాల్లో అణుశక్తితో నడిచే విమాన వాహక నౌకతో పాటు భారత్‌కు చెందిన మరో 11 ఉపరితల నౌకలు పాల్గొన్నాయి. వీటికి అదనంగా సముద్ర గస్తీ విమానం, రెండు హెలికాప్టర్లు, జలాంతర్గాములు యుద్ధవిన్యాసాల్లో అలరించాయి. లక్ష్యాలను ఛేదిస్తూ తమ యుద్ధసన్నద్దతను పరీక్షించుకున్నాయి. భారత్‌తో పాటు ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, జపాన్ నౌకాదళాలు కూడా పాల్గొన్నాయి. #WATCH | Indian Navy participates in the Malabar exercise 2022 in seas … Read more

    కృష్ణ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

    [VIDEO:](url) సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హీరో ప్రభాస్‌, ఆర్‌ నారాయణమూర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కూడా కృష్ణ పార్థీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అటు సూపర్‌స్టార్‌ కృష్ణ మృతికి సంతాపంగా రేపు తెలుగు సినిమా పరిశ్రమ బంద్‌ పాటించాలని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ పిలుపునిచ్చింది. షూటింగ్‌ నిలిపివేయాలని కోరింది. #Prabhas Pays Last Respects to Super Star Krishna#RIPSuperStarKrishnaGaru #SuperStarKrishna #Tollywood pic.twitter.com/yqj9RZQMw2 — greatandhra (@greatandhranews) November 15, 2022

    చిత్తూరులో బావిలో పడ్డ ఏనుగు

    [VIDEO](url): APలోని చిత్తూరు జిల్లా గుండ్లపల్లి గ్రామంలో బావిలో పడిన ఏనుగుని అధికారులు రక్షించారు. సోమవారం రాత్రి ఇటుగా వచ్చిన ఏనుగు నీటిబావిలో పడిపోయింది. నేడు ఉదయం ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానిక జేసీబీ సిబ్బంది సాయంతో బావి గోడను ఒకవైపు తొలగించారు. ఏనుగుకు ఎక్కేందుకు అనువుగా ఉండటానికి మట్టిని తొలగించారు. చాలా సేపటి తర్వాత ఏనుగు అందులో నుంచి పైకి ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. #WATCH | An elephant that fell into … Read more

    బీజేపీ ప్లెక్లీలే తొలగిస్తారా.. సోము వీర్రాజు ఆగ్రహం

    విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వేళ.. అధికారులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పలు సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలు, ప్లెక్సీలు తొలగించడంపై మండిపడ్డారు.రెండ్రోజులు జెండాలు ఉంచడానికి కష్టం అయిపోయిందా మీకు అంటు నిలదీశారు. ట్రాలీలో ఉన్న పడేసిన జెండాలను తిరిగి తీసుకున్నారు. ప్రధాని మోదీ వస్తుంటే కనీసం స్వాగతం చెప్పే ప్లెక్సీలు కూడా ఉండనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది. Plight Of National Party … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022

    వైసీపీ గూండల్లారా జాగ్రత్త: పవన్ కళ్యాణ్

    గుంటూరు-ఇప్పంటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామార్శించేందుకు వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసుల వ్యవహారతీరుపై పవన్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. మార్చిలో ఇప్పంటం ప్రజలు జనసేనకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. వైసీపీ గూండాల్లారా జాగ్రత్త. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పంటం ఏమైనా కాకినాడనా? రాజమండ్రినా? గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ గ్రామంలో రోడ్డు విస్తరణనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ … Read more

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more

    మయోసైటిస్‌ త్వరగా నయం కాదు

    మయోసైటిస్‌ వ్యాధి త్వరగా నయం కాదని సన్‌ స్పిరిచ్యువల్‌ వ్యవస్థాపకులు విక్రమాదిత్య అన్నారు. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మయోసైటిస్‌ కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. జీవన విధానాల మార్పుల కారణంగానే ఈ వ్యాధి సోకుతుందని వెల్లడించారు. అతిగా శారీరక శ్రమ చేయటంతో పాటు ఆహారపు అలవాట్ల కారణంగా మయోసైటిస్‌ సోకే ప్రమాదం ఉందని విక్రమాదిత్య తెలిపారు. హీరోయిన్‌ సమంత ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.