• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నదులు ఇలానే ఏర్పడతాయా?

    వరదల సమయంలో నదులు ఉప్పొంగి ప్రవహించడాన్ని మనం గమనించి ఉంటాం. అయితే రోడ్డుపై నీరు నదిలా పారిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడవిలోంచి ఒక నీటిపాయ మైదాన ప్రాంతంలో పారుతూ వీడియోలో కనిపించింది. ఆ పాయ ముందుకు సాగుతూ ఓ చిన్న కాలువలా మారుతుంది. ఈ దృశ్యాలను IFS అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ పోస్ట్ చేశారు. ‘నదులు ఇలానే ఏర్పడతాయి. నదికి తల్లి అడవి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. This is how rivers are made. Forest is … Read more

    తులసి మెుక్క కదలడం దేవుడి మహిమేనా?

    ఓ చెట్టు కింద తులసి మొక్క దానంతట అదే కదులుతూ కనిపించింది. తులసి చెట్టు తిరగడం దేవుడి మహిమే అంటూ ఆ వింతను జనాలు ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఇది ఎలా సాధ్యమంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు. https://www.instagram.com/reel/Cttkxr6vcBN/?utm_source=ig_web_copy_link

    మానవత్వం లేదా? ఇలాగేనా నిద్రలేపేది?

    పుణెలోని రైల్వే స్టేషన్‌లో ఓ పోలీసు అధికారి వ్యవహార తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిద్రిస్తున్న వారిపై నీళ్లు పోస్తూ నిద్రలేపిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మానవత్వం మరిచి ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. రిప్ హ్యూమనిటీ అనే క్యాప్షన్ పెట్టి ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు దాదాపు 13,800 లైక్‌లు రాగా.. 35 లక్షల మంది వీక్షించారు. RIP Humanity ?? Pune Railway Station pic.twitter.com/M9VwSNH0zn — ?? Rupen Chowdhury … Read more

    మానవత్వం మరిచిన కానిస్టేబుల్

    పూణే రైల్వే స్టేషన్లో జరగిన ఓ అమానుష ఘటన నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. రైల్వే ప్లాట్ ఫారంపై నిద్రిస్తున్న వారి మోహంపై కానిస్టేబుల్ నీళ్లు చల్లాడు. దీంతో అక్కడ నిద్రిస్తున్న వారు ఉలిక్కిపడి లేచారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసీ “మానవత్వానికి నివాళులు” అంటూ రాసి పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోను ముప్పై లక్షల మంది చూశారు. కొందరు విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. RIP Humanity ?? Pune … Read more

    ఉషా ఉతుప్ వెర్షన్‌లో ‘నాటునాటు’ సాంగ్‌

    RRR మూవీలోని ‘నాటునాటు’ సాంగ్‌ భారత్‌ లోనే కాదు, ప్రపంచదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తాజాగా విభిన్న స్వరాలతో సంగీత ప్రియులను అరించే గాయని ఉషా ఉతుప్, నాటునాటు సాంగ్‌ను తన వర్షన్‌లో పాడి ఆకట్టుకున్నారు. ఆమె పాటిన ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఉషా పాటను విన్న వారు కూడా ఆమె చాలా బాగా పాడగలిగారని ప్రశంసిస్తున్నారు. అయితే RRR సినిమాలో ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.

    మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం

    మహారాష్ట్ర- బుల్దానాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్​నుంచి పుణెకు వెళ్తుండగా శనివారం వేకువజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. Horrific accident on Samruddhi highway in #Buldhana 25 … Read more

    గవర్నర్‌ని ప్రశ్నిస్తూ వెలిసిన పోస్టర్లు

    తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, గవర్నర్‌ని ప్రశ్నిస్తూ రాష్ట్రంలో పోస్టర్లు వెలిశాయి. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం సమీపంలో పార్టీ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. నేర చరిత్ర కలిగిన కేంద్ర మంత్రుల జాబితాను ఇందులో ప్రచురించడం గమనార్హం. గవర్నర్ ఆర్.ఎన్.రవిని ప్రశ్నిస్తూ వీటిపై సమాధానమేంటని పోస్టర్లలో నిలదీశారు. #WATCH | Tamil Nadu: DMK supporters stick posters near Anna Arivalayam, DMK headquarters in Chennai, raising … Read more

    ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన మోదీ

    ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ మెట్రోల పర్యటించారు. స్వయంగా టికెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కారు. అయితే, మోదీ రాక సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ విధించిన నిబంధనలు విమర్శలకు దారితీస్తున్నాయి. కార్యక్రమానికి నల్ల దుస్తులు వేసుకు రావొద్దని, కచ్చితంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైంది. #WATCH | Prime Minister Narendra Modi travels by metro to attend centenary … Read more

    రథయాత్రలో అపశృతి: 7 మంది మృతి

    త్రిపురలో జరిగిన ఉల్తా రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఏడు మంది దుర్మరణం పాలయ్యారు. ఉన్‌కోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో ఉల్తా రథయాత్ర జరిగింది. ఈ క్రమంలో రథం పైభాగాన హైటెన్షన్ వెర్లు తగిలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రిపుర సీఎం మానిక్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. #Breakingnews 22+ deaths at Kumarghat in … Read more

    రథయాత్రలో అపశృతి: 7 మంది మృతి

    త్రిపురలో జరిగిన ఉల్తా రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ఏడు మంది దుర్మరణం పాలయ్యారు. ఉన్‌కోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో ఉల్తా రథయాత్ర జరిగింది. ఈ క్రమంలో రథం పైభాగాన హైటెన్షన్ వెర్లు తగిలి మంటలు వ్యాపించాయి. దీంతో ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రిపుర సీఎం మానిక్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. #Breakingnews 22+ deaths at Kumarghat in … Read more